హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

మాటమార్చిన అమెజాన్... టిక్‌టాక్ బ్యాన్ తప్పేనని తాజా ప్రకటన...

మాటమార్చిన అమెజాన్... టిక్‌టాక్ బ్యాన్ తప్పేనని తాజా ప్రకటన...

మాటమార్చిన అమెజాన్... టిక్‌టాక్ బ్యాన్ తప్పేనని తాజా ప్రకటన...(File)

మాటమార్చిన అమెజాన్... టిక్‌టాక్ బ్యాన్ తప్పేనని తాజా ప్రకటన...(File)

టిక్‌టాక్ బ్యాన్ దిశగా నిర్ణయం తీసుకున్న అమెజాన్... 24 గంటల్లోపే మళ్లీ ఆ నిర్ణయాన్ని ఎందుకు వెనక్కి తీసుకుంటోంది? ఈ మధ్యలో ఏం జరిగింది?

ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్... తమ ఉద్యోగులందరికీ ఈమెయిల్ పంపి... మీ మొబైళ్లలో టిక్ టాక్‌ యాప్‌ని డిలీట్ చెయ్యమనీ, వాడొద్దనీ చెప్పింది. అలా చెప్పిన 5 గంటల లోపే మాట మార్చింది. తను అలా మెయిల్ పంపడం తప్పేననీ, టిక్ టాక్‌ను బ్యాన్ చెయ్యడం తప్పేనని అంది. కంపెనీ ఉదయం పంపిన ఈ మెయిల్ తప్పుగా వెళ్లిందనీ... టిక్ టాక్ విషయమై తన పాలసీల్లో ఎలాంటి మార్పూ లేదని తాజాగా తెలిపింది. ఈ ఐదు గంటల్లోనే ఏం జరిగిందని కంపెనీ ప్రతినిధి జాసీ అండెర్సన్‌ను అడగ్గా... సమాధానం చెప్పలేదు. మొదట పంపిన ఈ మెయిల్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి.

టిక్‌టాక్‌కి యువత ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఐతే... ఇండియాలో టిక్ టాక్ బ్యాన్‌కి వ్యతిరేకంగా ఎవరూ స్పందించలేదు. ఇండియాలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. చైనాలో ఉన్న ఆ కంపెనీ ఇండియాలో రన్ అవ్వడానికి వీల్లేదని నినదించారు.

ఇలాంటి పరిస్థితుల్లో అమెజాన్ నుంచి కూడా ఇలాంటి ప్రకటనే రావడంతో... అందరూ ఆశ్చర్యంగా చూశారు. మళ్లీ ఐదు గంటల్లోనే అమెజాన్ మాట మార్చింది. అమెజాన్‌కి ప్రపంచవ్యాప్తంగా 840000 మంది ఉద్యోగులు ఉన్నారు. టిక్ టాక్ ని ఉద్యోగులు బ్యాన్ చేస్తే... అది టిక్ టాక్ యాజమాన్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆ పరిస్థితిని తప్పించడం వల్ల ఇప్పుడు టిక్ టాక్ ఊపిరి పీల్చుకున్నట్లే. టిక్ టాక్ త్వరలో చైనాను వీడి వెళ్లనుందనే ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Amazon, Tiktok

ఉత్తమ కథలు