గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌తో(Amazon Great Republic Sale) ముందుకొచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన సేల్ ఈవింగ్ జనవరి 20తో ముగియనుంది. సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ (Elecronic) ఉత్పత్తులపై అదిరిపోయే ఆఫర్లు(Offers) ప్రకటించింది. మీరు కొత్త స్మార్ట్‌వాచ్‌ని కొనుగోలు చేయాలని లేదా ఎవరికైనా బహుమతిగా ఇవ్వాలని ప్లాన్ చేస్తుంటే, ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. ఎందుకంటే, అమెజాన్ సేల్‌లో శామ్సంగ్, షియోమి, బోట్, నాయిస్ సంస్థలకు చెందిన స్మార్ట్‌వాచ్‌లపై 50% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఏ స్మార్ట్‌వాచ్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో చూద్దాం.
శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3పై 54% డిస్కౌంట్ లభిస్తుంది. తద్వారా దీన్ని కేవలం రూ. 15,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ ఆండ్రాయిడ్, iOS డివైజెస్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇది వృత్తాకార సూపర్ AMOLED డయల్ డిస్ప్లేతో వస్తుంది. ఇది స్లీప్, బ్లడ్ ఆక్సిజన్‌ను ట్రాక్ చేయగలదు. శామ్సంగ్ గెలాక్సీ వాచ్ 3 120 కంటే ఎక్కువ వర్కవుట్ ప్రోగ్రామ్‌లపై పనిచేస్తుంది.
ఎంఐ వాచ్ రివాల్వ్..
ఎంఐ వాచ్ రివాల్వ్‌ను 59% డిస్కౌంట్‌తో రూ. 6,599 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది 10 ప్రొఫెషనల్ స్పోర్ట్స్ మోడ్లతో వస్తుంది. స్లీప్, ప్రెజర్, బాడీ ఎనర్జీ లెవల్స్‌ను పర్యవేక్షించగలదు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలకు అనుకూలంగా ఉంటుంది. ఎంఐ వాచ్ రివాల్వ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 14 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తుంది.
హెలిక్స్ టైమెక్స్ మెటల్ఫిట్..
హెలిక్స్ టైమెక్స్ మెటల్ఫిట్ 60% డిస్కౌంట్‌తో రూ. 1,999 ధర వద్ద లభిస్తుంది. టైమెక్స్ నుండి వచ్చిన ఈ స్మార్ట్ వాచ్‌తో హార్ట్ రేట్ మానిటర్ చేయవచ్చు. ఇది ఫీమేల్ హెల్త్ ట్రాకింగ్‌ను కూడా కలిగి ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తుంది. ఈ డివైజ్ IP68 రేటింగ్‌తో వస్తుంది.
బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్..
బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్ వాచ్ 72% డిస్కౌంట్‌తో కేవలం రూ. 2,199 ధర వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.69- అంగుళాల టచ్‌స్క్రీన్ కలర్ డిస్ప్లేతో వస్తుంది. ఇది హార్ట్ రేట్ సెన్సార్, SPO2, స్ట్రెస్ మానిటర్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఒకే ఛార్జ్‌పై 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తుంది.
నాయిస్ కలర్ ఫిట్ పల్స్..
నాయిస్ కలర్ ఫిట్ పల్స్ 64% డిస్కౌంట్‌తో రూ. 1,799 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 1.4 -అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 8 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. వీటి ఇయర్ఫోన్లు వాటర్‌ప్రూఫ్‌తో వస్తాయి.
ఫైర్ బోల్డ్ నింజా 2..
ఫైర్ బోల్డ్ నింజా 2 స్మార్ట్‌వాచ్ 68% డిస్కౌంట్‌తో రూ. 1,599 వద్ద లభిస్తుంది. ఇది దీర్ఘచతురస్రాకార డయల్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ 30 స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందించగలదని కంపెనీ పేర్కొంది.
అమెజ్‌ఫిట్ GTR..
అమెజ్‌ఫిట్ GTR స్మార్ట్‌వాచ్ 64% డిస్కౌంట్‌తో రూ. 5,000 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ క్లాసిక్ వాచ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది 1.39 -అంగుళాల AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డివైజ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 24 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందజేస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ కూడా వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది.
ఫైర్-బోల్ట్ ఇన్విన్సిబుల్..
ఫైర్-బోల్ట్ ఇన్విన్సిబుల్ 63% డిస్కౌంట్‌తో రూ. 5,999 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 1.39 -అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 100 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ఇది 100 ఇన్‌బుల్ట్ వాచ్ ఫేస్‌లు, 8GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 7 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందజేస్తుంది.
బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్..
బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్‌వాచ్ 71% డిస్కౌంట్‌తో రూ. 1,999 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 1.3-అంగుళాల LCD డిస్ప్లేతో వస్తుంది. ఇది హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌తో 10 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. ఒకే ఛార్జ్‌పై 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది.
జియోని స్టైల్‌ఫిట్ GSW6..
జియోని స్టైల్‌ఫిట్ GSW6 స్మార్ట్‌వాచ్ 61% డిస్కౌంట్‌తో రూ. 2,699 వద్ద లభిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది. ఇది మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. SpO2, హార్ట్‌రేట్ మానిటరింగ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ 3 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Amazon, Amazon Great Republic Day Sale, Mobile News, Mobiles, Smartphone