Amazon : ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్(Amazon) కస్టమర్లను ఆకట్టుకోవడానికి మెగా ఈవెంట్స్‌తో మందుకు వస్తుంటుంది. తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సంస్థ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్(Amazon great republic day sale) నిర్వహిస్తోంది. ఈ నెల 15 నుంచి కొనసాగుతున్న ఈ స్పెషల్ సేల ఈవెంట్ జనవరి 20న ముగియనుంది. ఈ ఆఫర్లలో స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, హోమ్ యాక్సెసరీస్ వంటి ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే ఆఫర్స్‌ను పొందవచ్చు. టాప్ బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ బెస్ట్ డీల్స్ అందిస్తోంది. వాటిపై ఓ లుక్కేయండి.
Samsung Galaxy M32 Prime
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.9,899 డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. ఇది రియర్ క్వాడ్ కెమెరా సెటప్‌తో లభిస్తుంది. 64MP (F 1.8) ప్రధాన కెమెరా, 8MP (F2.2) అల్ట్రా వైడ్ కెమెరా, 2MP (F2.4) డెప్త్ కెమెరా, 2MP (2.4) మాక్రో కెమెరా ఇందులో ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో 20MP (F2.2) ఫ్రంట్ కెమెరాను అమర్చారు. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంటుంది.
Redmi A1
Redmi A1 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 3GB RAM +32GB బేస్ వేరియంట్ ధర రూ.7,499. మరో వేరియంట్ 4GB RAM + 64GB ధర రూ.8,299. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ హ్యాండ్‌సెట్‌పై బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G25 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ సెన్సార్ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.
టెక్నో స్పార్క్ 9
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో టెక్నో స్పార్క్ 9పై బెస్ట్ డీల్ పొందవచ్చు. అన్ని ఆఫర్స్ కలుపుకుని ఈ హ్యాండ్‌సెట్‌ను రూ.7019కు సొంతం చేసుకోవచ్చు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ 6.6-అంగుళాల డాట్ నాచ్ డిస్‌ప్లేతో లభిస్తుంది. మీడియాటెక్ హీలియో G37 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ HiOS 8.6తో డివైజ్ రన్ అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 52,000mAh బ్యాటరీ ఉంటుంది.
రియల్‌మీ నార్జో 50
రియల్‌మీకి చెందిన ఈ బడ్జెట్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G96 ఆక్టా-కోర్ ప్రాసెసర్ దీంట్లో ఉంటుంది. 33వాట్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5,000mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. ఈ డివైజ్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా ప్రధాన హైలెట్. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా రియల్‌మీ నార్జో 50పై బెస్ట్ డీల్ పొందవచ్చు. ప్రస్తుతం రూ.11,900కు లభిస్తున్న ఈ మోడల్‌పై బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung Galaxy M04
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో P35 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ One UI కోర్ 4.1 ఓఎస్‌తో రన్ అవుతుంది. 6.5-అంగుళాల LCD స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ HD+ రిజల్యూషన్‌తో డిస్‌ప్లే ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.8,999గా ఉంది. అయితే డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్‌లో భాగంగా దీన్ని రూ.7499కే కొనుగోలు చేయవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.