HOME »NEWS »TECHNOLOGY »amazon pushes security products with indoor drone and car alarm ss gh

Amazon: అలారం, సెక్యూరిటీ డ్రోన్ల బిజినెస్‌లోకి అమెజాన్

Amazon: అలారం, సెక్యూరిటీ డ్రోన్ల బిజినెస్‌లోకి అమెజాన్
Amazon: అలారం, సెక్యూరిటీ డ్రోన్ల బిజినెస్‌లోకి అమెజాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Amazon security products | ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సెక్యూరిటీ ప్రొడక్ట్స్ తయారీపై దృష్టిపెట్టింది. కొత్త ప్రొడక్ట్స్‌ని లాంఛ్ చేయనుంది.

  • Share this:
వాహనాలు చోరీకి గురికాకుండా యజమానులను అప్రమత్తం చేసే రింగ్ పరికరాలను అమ్మనున్నట్టు అమెజాన్ గతవారం ప్రకటించింది. ఇంటి లోపల సెక్యూరిటీ వీడియోలు రికార్డ్ చేయడానికి ఉపయోగపడే ఇండోర్ డ్రోన్ కెమెరాలను, ఇతర భద్రతా పరికరాలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అమెజాన్ 2018 లోనే సెక్యూరిటీ బిజినెస్లోకి అడుగు పెట్టింది. అదే సంవత్సరంలో స్మార్ట్ డోర్ బెల్ సంస్థను కొనుగోలు చేసిన తరువాత ఈ రంగంలో అమ్మకాలను పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కానీ వీటిపై కొంతమంది పౌర హక్కుల నాయకులు, సంఘాలు, న్యాయవాదులు అభ్యంతరం తెలుపుతున్నారు. వీటి ద్వారా కొనుగోలుదారుల ఇళ్లలోకి అధికారికంగా ప్రవేశించే అవకాశం అమెజాన్‌కు కల్పించినట్టు అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్యాకేజీ డెలివరీ చేయడం నుంచి గాడ్జెట్ల వరకు, తాజాగా సెక్యూరిటీ బిజినెస్ వరకు వ్యాపారాన్ని అమెజాన్ విస్తరించింది.

వచ్చే ఏడాది నుంచి అమ్మకాలు


ఈ ఇండోర్ డ్రోన్, రింగ్ ఆల్వేస్ హోమ్ కెమెరాలు వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తాయని అమెజాన్ ప్రకటించింది. స్టాటిక్ కెమెరాలు లేని ప్రదేశాల్లో వీటి ద్వారా వీడియోలు రికార్డింగ్ చేయవచ్చు. వినియోగదారుల వస్తువులు ఎక్కడ పడిపోయాయో వెతికి వీడియోల్లో చూపించగలదని అమెజాన్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ రౌష్ చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఈ పరికరానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. పరికరం ఎగురుతున్నప్పుడు మాత్రమే రికార్డ్ చేస్తుందని ఆయన వివరించారు.Poco X3: ఈరోజే పోకో ఎక్స్3 ఫస్ట్ సేల్... డిస్కౌంట్‌తో కొనండి ఇలా

Samsung: ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించిన సాంసంగ్

వాహనాల చోరీలను అడ్డుకునే పరికరం కూడా


కార్ల చోరీని అరికట్టే ఒక అలారం డివైజ్‌ను కూడా అమెజాన్ విడుదల చేయనుంది. ఎవరైనా బయటి వ్యక్తులు తమ కార్లను అనుమతి లేకుండా తీసుకెళ్లడానికి ప్రయత్నించినా, తలుపులు తెరిచినా యజమానులకు వినిపించేలా ఒక అలారం మోగుతుంది. ఈ వెహికిల్ సెక్యూరిటీ కెమెరా... రింగ్ కార్ కనెక్ట్ సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తుంది. ఇది వీడియో ప్లే బ్యాక్, హెచ్చరిక కోసం ఇతర కార్ల కెమెరాలతో పనిచేస్తుంది. ఇలాంటి పరికరాలను మొదటిసారి టెస్లా కంపెనీ తయారు చేసింది. వాటిని తక్కువ ధరలకే వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.

దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయా?


రింగ్ పరికరాలపై పౌర హక్కుల కోసం పోరాడే సంస్థల న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరికరాలను అందుబాటులోకి తేవాలంటే అమెజాన్ కంపెనీ పోలీసులతో పార్ట్‌నర్‌షిప్ వదిలేయాలని శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ఎలక్ట్రానిక్ ఫ్రాంటియర్ ఫౌండేషన్ (ఇఎఫ్ఎఫ్) సంస్థ డిమాండ్ చేస్తుంది. సెక్యూరిటీ పేరుతో రికార్డు చేసిన వీడియోలను పోలీసులు దుర్వినియోగం చేసే అవకాశముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ సెక్యూరిటీ విభాగమైన రింగ్ డివిజన్ ప్రెసిడెంట్ లీలా రౌహి ఈ ప్రచారాన్ని ఖండించారు. సంస్థ ఎప్పటికీ వీడియోలను చట్ట సంబంధ సంస్థలకు అందించదని ఆమె పేర్కొన్నారు. సమాచారాన్ని ఎవరెవరితో పంచుకోవాలనే అధికారం వినియోగదారులకే ఉంటుందన్నారు. సెక్యూరిటీ వీడియోలపై పూర్తి నియంత్రణ వారిదేనని తెలిపారు. కస్టమర్లకు అన్ని రకాల సేవలందించేందుకు రింగ్ విభాగం పనిచేస్తుందని ఆమె వివరించారు.

Android Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... ఈ 17 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి

Realme Narzo 20: కాసేపట్లో రియల్‌మీ నార్జో 20 సేల్... ఆఫర్స్ ఇవే

స్మార్ట్ స్పీకర్లలో పోటీ


సెక్యూరిటీ డివైజ్లతో పాటు స్మార్ట్ స్పీకర్ల బిజినెస్లోకి కూడా అమెజాన్ అడుగుపెట్టింది. తాజాగా లూనా అనే క్లౌడ్-బేస్డ్ గేమింగ్ సర్వీస్ను ఆ సంస్థ ప్రకటించింది. ఎకో స్పీకర్లు, దానికి అలెక్సా వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లు దీని సొంతం. స్మార్ట్ స్పీకర్ల విభాగంలో యాపిల్, గూగుల్ వంటి సంస్థలతో పోటీ పడుతూ, అమెరికాలో తమ మార్కెట్ వాటాను నిలబెట్టుకోవడానికి అమెజాన్ ప్రయత్నిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:September 29, 2020, 13:21 IST