Amazon Prime: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌... యూత్‌కు రూ.499 మాత్రమే

Amazon Prime Youth Offer | రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందాలంటే వయస్సు ధృవీకరించడానికి ఏవైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

news18-telugu
Updated: July 12, 2019, 12:21 PM IST
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌... యూత్‌కు రూ.499 మాత్రమే
Amazon Prime: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌... యూత్‌కు రూ.499 మాత్రమే
news18-telugu
Updated: July 12, 2019, 12:21 PM IST
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌ ఆన్‌లైన్ షాపింగ్ లవర్స్‌ను ఊరిస్తోంది. జూలై 15, 16 తేదీల్లో 'ప్రైమ్ డే సేల్‌' నిర్వహిస్తోంది అమెజాన్. ఈ సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. యువత కోసం 'అమెజాన్ ప్రైమ్ యూత్ ఆఫర్' ప్రకటించడం విశేషం. ఏకంగా ప్రైమ్ మెంబర్‌షిప్‌పై 50% క్యాష్‌బ్యాక్ ఇస్తామంటోంది అమెజాన్. 18 నుంచి 24 ఏళ్ల వయస్సుగల వారెవరైనా కేవలం రూ.499 చెల్లించి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ పొందొచ్చు. ముందుగా రూ.999 చెల్లించి ఏడాదికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే రూ.500 క్యాష్‌బ్యాక్ ఇస్తుంది అమెజాన్. రూ.500 క్యాష్‌బ్యాక్ అమెజాన్ పే అకౌంట్‌లోకి వస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్‌లో ప్రొడక్ట్స్ కొనడంతో పాటు బిల్ పేమెంట్స్, రీఛార్జ్, బుక్‌మై షో, స్విగ్గీ, డొమినోస్, రెడ్‌బస్ లాంటి ఆన్‌లైన్ పార్ట్‌నర్ మర్చంట్స్‌కి పేమెంట్ కోసం ఉపయోగించుకోవచ్చు. రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందాలంటే వయస్సు ధృవీకరించడానికి ఏవైనా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి.

వాస్తవానికి ఇది కొత్త ఆఫర్ ఏమీ కాదు. గతంలో వొడాఫోన్ యూత్ ఆఫర్ గురించి అందరికీ తెలిసిందే. అప్పుడు వొడాఫోన్ ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ తీసుకున్నవారికి ఈ ఆఫర్ లభించేది. ఇప్పుడు 'అమెజాన్ ప్రైమ్ యూత్ ఆఫర్' పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పటికే ప్రైమ్ మెంబర్‌షిప్‌ కోసం నెలకు రూ.129, మూడు నెలలకు రూ.329, ఏడాదికి రూ.999 వసూలు చేస్తోంది అమెజాన్. ఈ ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు. అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో అనేక సర్వీసులు లభిస్తాయి. అమెజాన్ షాపింగ్ యాప్‌లో స్పెషల్ డీల్స్‌తో పాటు డెలివరీ ఛార్జీలు లేకుండా ప్రొడక్ట్స్ కొనొచ్చు. దాంతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. కేవలం ప్రైమ్ మెంబర్స్ కోసం జూలై 15, 16 తేదీల్లో 'ప్రైమ్ డే సేల్‌' ప్రకటించింది అమెజాన్. ఈ సేల్‌లో ప్రైమ్ మెంబర్స్ వేలాది ఉత్పత్తులపై డీల్స్ పొందొచ్చు.

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో




ఇవి కూడా చదవండి:

IRCTC e-wallet: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ ట్రై చేశారా?

Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా
Loading...
WhatsApp: కోటిన్నర ఫోన్లల్లో 'ఏజెంట్ స్మిత్' మాల్‌వేర్... జర జాగ్రత్త
First published: July 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...