అడల్ట్ సీన్లు తొలగిస్తున్న అమెజాన్ ప్రైమ్

ది డర్టీ పిక్చర్ సినిమాలో ఉండే బోల్డ్ సీన్లు, డైలాగులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేవు. ఆ సినిమాలో అలాంటి సీన్లన్నీ తొలగించడంతో సినిమా నిడివి 17 నిమిషాలు తగ్గింది. ఇక హంటర్ పేరుతో ఉన్న సెక్స్ కామెడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ కన్నా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 9 నిమిషాలు తగ్గింది.

news18-telugu
Updated: January 8, 2019, 6:29 PM IST
అడల్ట్ సీన్లు తొలగిస్తున్న అమెజాన్ ప్రైమ్
అడల్ట్ సీన్లు తొలగిస్తున్న అమెజాన్ ప్రైమ్
  • Share this:
అమెజాన్ ప్రైమ్... అన్ని భాషల సినిమాలతో పాటు స్పెషల్ షోస్, ఒరిజినల్ సిరీస్‌కు వేదిక. ఓవర్ ది టాప్(ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే సినిమాలకు పెద్దగా సెన్సార్ ఉండదన్న వాదన ఉంది. కానీ ఆ పరిస్థితి మారిపోయింది. ఇకపై అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే సినిమాలకూ కత్తెర పడుతోంది. ముఖ్యంగా అడల్ట్ సీన్లు ఇక సినిమాల్లో కనిపించవు. ఇలాంటి సీన్లకు కత్తెర వేస్తోంది ఎవరో కాదు. అమెజాన్ ప్రైమ్ స్వయంగా సెన్సార్ చేస్తోంది. సెక్స్ సీన్లు, అశ్లీల సంభాషణలను తొలగిస్తోంది. ఇక 13 ఏళ్లలోపు పిల్లలు కూడా అలాంటి సినిమాలను చూసేలా ఎడిట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ ప్రధాన కాంపిటీటర్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం అలాంటి సీన్లన్నీ మామూలుగానే ఉంటున్నాయి.

ది డర్టీ పిక్చర్ సినిమాలో ఉండే బోల్డ్ సీన్లు, డైలాగులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో లేవు. ఆ సినిమాలో అలాంటి సీన్లన్నీ తొలగించడంతో సినిమా నిడివి 17 నిమిషాలు తగ్గింది. ఇక హంటర్ పేరుతో ఉన్న సెక్స్ కామెడీ సినిమా నెట్‌ఫ్లిక్స్ కన్నా అమెజాన్ ప్రైమ్ వీడియోలో 9 నిమిషాలు తగ్గింది. ఇలా శృంగార దృశ్యాలు, అశ్లీల డైలాగులు తొలగించడానికి కారణం... ఇటీవల కోర్టుల్లో ఫైల్ అవుతున్న ప్రజాప్రయోజన వ్యాజ్యాలే. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాల్లో అడల్ట్ సీన్లు ఉండటంపై పలువురు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. అందుకే స్వయంగా సెన్సార్ చేస్తోంది అమెజాన్ ప్రైమ్. సినిమా హక్కులు కొనేప్పుడే సెల్ఫ్ సెన్సార్‌షిప్ గురించి చర్చిస్తోంది అమెజాన్.

సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిషేధించిన సినిమాలు అమెజాన్ ప్రైమ్‌లో కనిపించవు. కానీ వాటిని నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. మొత్తానికి సినిమాల స్ట్రీమింగ్ విషయంలో అమెజాన్ ప్రైమ్ లక్ష్మణరేఖ గీసుకుందని అర్థమవుతోంది.

ఇవి కూడా చదవండి:ఒక్క రూపాయికే రూ.2,399 విలువైన బ్యాక్‌ప్యాక్... 

ALERT: ఈ పాలసీలను నిలిపేసిన ఎల్ఐసీ... అవి మీ దగ్గర ఉంటే ఏం చేయాలి?

రూ.4,000 తగ్గింపుతో రెడ్‌మీ నోట్ 5 ప్రోసంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఐఆర్‌సీటీసీ నుంచి గుడ్‌ న్యూస్

 
First published: January 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు