అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!

ఇకపై అమెజాన్‌లో అన్‌లిమిటెడ్‌గా పుస్తకాలు చదువుకోవచ్చు. ఈ అవకాశం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే.

news18-telugu
Updated: September 26, 2018, 12:17 PM IST
అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు శుభవార్త!
ఇకపై అమెజాన్‌లో అన్‌లిమిటెడ్‌గా పుస్తకాలు చదువుకోవచ్చు. ఈ అవకాశం అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రమే.
  • Share this:
మీకు పుస్తకాలు చదవడం అలవాటా? అయితే ఇది మీకు గొప్ప శుభవార్తే. అమెజాన్‌లో కొన్ని పుస్తకాలు ఉచితంగా చదువుకోవచ్చు. ఈ అవకాశం ప్రైమ్ సభ్యులకు మాత్రమే. ఇప్పటికే ప్రైమ్ సభ్యులకు షాపింగ్ యాప్‌లో ఆఫర్లతో పాటు ప్రైమ్ వీడియో, మ్యూజిక్ అందిస్తోంది అమెజాన్. ఇప్పుడు ప్రైమ్ సభ్యులకు పుస్తకాలనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే 'ప్రైమ్ రీడింగ్'. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్ సభ్యులు అదనంగా చెల్లించాల్సింది ఏమీ లేదు. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంటే చాలు.

కిండిల్ అన్‌లిమిటెడ్ సబ్‌స్క్రిప్షన్‌కు 'ప్రైమ్ రీడింగ్'కు తేడా ఏంటీ?

భారతదేశంలో రెండు రకాల అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్స్ ఉన్నాయి. రూ.999 చెల్లిస్తే ఏడాదిపాటు ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంటుంది. లేదంటే రూ.129 చెల్లించి నెలరోజులపాటు ప్రైమ్ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. మరి కిండిల్ అన్‌లిమిటెడ్ సబ్‌స్క్రిప్షన్‌కు 'ప్రైమ్ రీడింగ్'కు తేడా ఏంటన్న అనుమానం చాలామందికి ఉంది. 'ప్రైమ్ రీడింగ్' అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో భాగమే. నెల రోజులకు రూ.169తో కిండిల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే కిండిల్ ఇ-రీడర్స్, కిండిల్ యాప్స్‌లో ఎన్ని పుస్తకాలైనా చదవొచ్చు. అయితే వారికి అమెజాన్ ప్రైమ్ సేవలు లభించవు.

అమెజాన్ ప్రైమ్‌లో ఉన్నవాళ్లుమాత్రం... 'ప్రైమ్ రీడింగ్'లో కొన్ని పుస్తకాలను ఉచితంగా చదువుకోవచ్చు. అంటే లైబ్రరీలో మనం మెంబర్‌షిప్ తీసుకొని పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి చదువుకున్నట్టు అన్నమాట. 'ప్రైమ్ రీడింగ్'లో మీరు ఒకేసారి 10 పుస్తకాలు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి చదివి తిరిగిచ్చిన తర్వాత మరొకటి తీసుకోవచ్చు. ఇలా 'ప్రైమ్ రీడింగ్'లో ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషలకు చెందిన వందలాది పుస్తకాలు ఉన్నాయి. అయితే ప్రైమ్ రీడింగ్‌లో మ్యాగజైన్లు లేవు. 'ప్రైమ్ రీడింగ్'లో కొన్ని పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి కాబట్టి సీరియస్ రీడర్స్‌కు మాత్రమే కిండిల్ ఉపయోగపడుతుంది. సరదాగా చదివేవాళ్లకు 'ప్రైమ్ రీడింగ్' ఉపయోగకరం.

ఇవి కూడా చదవండి:

అక్టోబర్ 10 నుంచి ఫ్లిప్‌కార్ట్ సేల్!

అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!ఎక్కువ క్రెడిట్ కార్డులుంటే సిబిల్ స్కోర్‌ తగ్గుతుందా?

ఇండియాలో లాంఛైన సాంసంగ్ గెలాక్సీ ఏ7

ఇండియాలో రిలీజైన వివో వీ11

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్

సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!

 
First published: September 26, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading