హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: అమెజాన్‌లో ప్రైమ్ ఫోన్స్ పార్టీ సేల్.. తక్కువ ధరకే వస్తున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే

Amazon: అమెజాన్‌లో ప్రైమ్ ఫోన్స్ పార్టీ సేల్.. తక్కువ ధరకే వస్తున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon prime phones party: అమెజాన్ ఇటీవల ‘ప్రైమ్ ఫోన్స్ పార్టీ’ పేరుతో సేల్ ఈవెంట్‌ను ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి కోసం నిర్వహిస్తున్న ఈవెంట్ జనవరి 8న క్లోజ్ కానుంది. ఈ సేల్ ఈవెంట్‌లో శామ్‌సంగ్‌ గెలాక్సీ S22, షియోమి 12 ప్రోతో పాటు  మరిన్ని బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Amazon prime phones party: దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి తరచూ ఆఫర్లు అందిస్తుంటుంది. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు సేల్ ఈవెంట్స్ నిర్వహిస్తూ మార్కెట్‌లో తన వాటాను పెంచుకుంటోంది. అమెజాన్ ఇటీవల ‘ప్రైమ్ ఫోన్స్ పార్టీ’ పేరుతో సేల్ ఈవెంట్‌ను ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి కోసం నిర్వహిస్తున్న ఈవెంట్ జనవరి 8న క్లోజ్ కానుంది. ఈ సేల్ ఈవెంట్‌లో శామ్‌సంగ్‌ గెలాక్సీ S22, షియోమి 12 ప్రోతో పాటు మరిన్ని బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.

బిగ్గెస్ట్ ఆఫర్.. 55 ఇంచుల స్మార్ట్ టీవీపై రూ.లక్షా 70 వేల తగ్గింపు!

* Xiaomi 12 Pro

షియోమి కంపెనీకి చెందిన ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.55,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌పై అమెజాన్ వెబ్‌సైట్‌లో రూ.1000 డిస్కౌంట్ కూపన్ కూడా ఉంది. అయితే బై నౌ ఆప్షన్‌‌పై క్లిక్ చేయడానికి ముందు ఈ కూపన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.8,000 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

* మిడ్-బడ్జెట్ రేంజ్‌లో రెడ్‌మీ K50i

మిడ్-రేంజ్‌ సెగ్మెంట్‌లో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి రెడ్‌మీ K50i బెస్ట్ ఆప్షన్ కావచ్చు. అమెజాన్‌లో రూ.22,999కు సొంతం చేసుకోవచ్చు. బడ్జెట్ రేంజ్‌లో రూ.12 వేలలోపు 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకుంటే.. రెడ్‌మీ 11 ప్రైమ్ బెస్ట్ ఛాయిస్. ఇది రూ.11,999తో లాంచ్ అయింది. బ్యాంకు కార్డ్‌ ఆఫర్‌లో కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. శామ్‌సంగ్‌ గెలాక్సీ M13 అమెజాన్‌లో రూ.9,999కు అందుబాటులో ఉంది. అయితే దీన్ని రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్‌ గెలాక్సీ M33, M32 ప్రైమ్‌ను వరుసగా రూ.16,499, రూ.12,499 ధరతో సొంతం చేసుకోవచ్చు.

* శామ్‌సంగ్ గెలాక్సీ S22

శామ్‌సంగ్ కంపెనీకి చెందిన ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో రూ.52999 డిస్కౌంట్ ధరతో లభిస్తుంది. హై-ఎండ్ చిప్‌సెట్, 120Hz డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే, అద్భుతమైన కెమెరా సెట్‌ వంటి బెస్ట్ ఫీచర్స్‌ అందిస్తోంది.

* రియల్‌మీ ఫోన్లు

Realme బ్రాండ్‌లో కూడా బెస్ట్ డీల్స్ ఉన్నాయి. రియల్‌మీ Narzo 50ను రూ.10,999, రియల్‌మీ Narzo 50 ప్రోను రూ.19,999 డిస్కౌంట్ ధరతో కొనుగోలు చేయవచ్చు. కూపన్, బ్యాంక్ ఆఫర్స్ ఆధారంగా వీటిపై అదనంగా రూ. 2,000 డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

First published:

Tags: Amazon, Amazon sales, Mobile phones, Smart phones

ఉత్తమ కథలు