హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Prime Lite: గుడ్ న్యూస్.. రూ.999కే అమెజాన్ ప్రైమ్ లైట్‌.. బెనిఫిట్స్‌ ఇవే!

Amazon Prime Lite: గుడ్ న్యూస్.. రూ.999కే అమెజాన్ ప్రైమ్ లైట్‌.. బెనిఫిట్స్‌ ఇవే!

Amazon Prime Lite: గుడ్ న్యూస్.. రూ.999కే అమెజాన్ ప్రైమ్ లైట్‌.. బెనిఫిట్స్‌ ఇవే!

Amazon Prime Lite: గుడ్ న్యూస్.. రూ.999కే అమెజాన్ ప్రైమ్ లైట్‌.. బెనిఫిట్స్‌ ఇవే!

Amazon Prime Lite: సబ్‌స్క్రైబర్లు అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా విభిన్న ప్లాన్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తర్వాత అమెజాన్ ప్రైమ్ చౌకైన, యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇప్పుడు OTT ప్లాట్‌ఫారంలకు భారీగా డిమాండ్‌ పెరిగిన విషయం తెలిసిందే. వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా కంపెనీలు ప్రత్యేక కార్యక్రమాలను రూపొందిస్తున్నాయి. అంతే కాకుండా సబ్‌స్క్రైబర్లు అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా విభిన్న ప్లాన్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ తర్వాత అమెజాన్ ప్రైమ్ చౌకైన, యాడ్-సపోర్టెడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

* రూ.999కే అమెజాన్‌ ప్రైమ్‌ లైట్‌

అమెజాన్ ప్రైమ్ తన వార్షిక ప్లాన్ ధరను రూ.999 నుంచి రూ.1499కి పెంచింది. ఈ ప్లాన్‌ తరహా బెనిఫిట్స్‌నే అందించే అమెజాన్ ప్రైమ్ లైట్ వెర్షన్‌ను కంపెనీ పరీక్షిస్తోంది. దీని ధరను కేవలం రూ.999గా పేర్కొనే అవకాశం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది యాడ్-సప్ర్టెడ్ ప్లాన్‌తో వస్తుందని, యాడ్‌లను చేర్చడం సబ్‌స్క్రైబర్‌లను ఇబ్బంది పెట్టవచ్చని భావిస్తున్నారు.

ఓన్లీటెక్ వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల మేరకు.. అమెజాన్ ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ ప్లాన్‌ను ప్రస్తుతం టెస్టింగ్‌ చేస్తున్నారు. ప్రైమ్ లైట్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది, సెలక్టెడ్‌ కస్టమర్లకు మాత్రమే యాక్సెస్‌ చేసుకునే అవకాశం ఉంది. ప్రైమ్ మెంబర్‌షిప్, ప్రైమ్ లైట్ మెంబర్‌షిప్ అందించే ప్రయోజనాల్లో నిమిషం తేడా ఉంటుంది.

చవకైన మెంబర్‌షిప్ ప్లాన్‌తో ప్రైమ్ వినియోగదారులు ఒకదానికి బదులుగా అన్‌లిమిటెడ్‌ ఫ్రీ టూ డేస్‌ డెటివరీ పొందుతారు. ప్రైమ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్‌లు, డీల్‌లకు యాక్సెస్ ఉంటుంది. అమెజాన్‌ పే(Amazon Pay), ICICI క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంటుంది.

* బెనిఫిట్స్‌ ఇవే

అమెజాన్ షాపింగ్ వెబ్‌సైట్‌లో ప్రయోజనాలను అందించడమే కాకుండా, ప్రైమ్ లైట్ ప్రైమ్ వీడియోకు యాక్సెస్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని అర్థం ప్రైమ్ వీడియో యాప్‌లో అన్ని ప్రత్యేకమైన కంటెంట్‌ను వీక్షించవచ్చు. అయితే ప్లాన్ యాడ్‌ ఫ్రీ కాదు. షోలు, సినిమాలు చూస్తున్నప్పుడు మధ్యలో యాడ్‌లు కనిపిస్తాయి. దానితో పాటు వీడియో ప్లేబ్యాక్ క్వాలిటీ SD క్వాలిటీకి పరిమితం అవుతుంది.

ఇది కూడా చదవండి : ప్రాపర్టీ కొనుగోలుకు ఏ డాక్యుమెంట్లు అవసరం? మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే

ఒకే సమయంలో రెండు డివైజ్‌లలో మాత్రమే ప్లాన్‌ వినియోగించవచ్చు. ప్రైమ్ లైట్ సభ్యులు నో-కాస్ట్ EMI, అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, ఉచిత ఈబుక్‌లు, ప్రైమ్ గేమింగ్, వన్‌ డే డెలివరీకి యాక్సెస్ పొందలేరు. షాపింగ్ యాప్‌ని ఉపయోగించే, హై క్వాలిటీ కంటెంట్‌ను వీక్షించాలని లేని వారికి ఈ ప్లాన్ కచ్చితంగా సరిపోతుంది. ప్రైమ్‌ లైట్‌ని సెలక్ట్‌ చేసుకోవడం ద్వారా రూ.500 ఆదా చేయవచ్చు.

* మొబైల్‌ ప్లాన్‌ లాంచ్‌

అమెజాన్ ప్రైమ్ సంవత్సరానికి రూ.599కి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ప్లాన్‌ను కూడా ప్రవేశపెట్టింది. ప్లాన్ స్టాండర్డ్ డెఫినిషన్ (SD) నాణ్యతలో కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కంటెంట్‌ను ఆఫ్‌లైన్‌లో చూసే అవకాశం ఉంది. లైవ్ క్రికెట్ మ్యాచ్‌లతో పాటు అమెజాన్ ఒరిజినల్స్‌కి కూడా యాక్సెస్ ఇస్తుంది. వినియోగదారులు భారతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలు లేదా మూవీలు కూడా చూడవచ్చు.

First published:

Tags: Amazon, Amazon prime, Netflix

ఉత్తమ కథలు