కరోనా తర్వాత వివిధ రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ బిజినెస్ పూర్తిగా మారింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు (OTT Platforms) డిమాండ్ పెరిగింది. ఓటీటీల కోసమే ప్రత్యేకంగా సిరీస్‌లు, సినిమాలు, ప్రత్యేక షోలు రూపొందుతున్నాయి. ఈ క్రమంలో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆయా ఓటీటీ ప్లాట్‌ఫాంలు స్పెషల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తున్నాయి. మొబైల్ ఓన్లీ ప్లాన్స్‌ను (Mobile Only Plans) కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రధాన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందిస్తున్న సబ్స్క్రిప్షన్ ప్లాన్లు, వాటి బెనిఫిట్స్ తెలుసుకుందాం.
అమెజాన్ ఇటీవల ప్రైమ్ వీడియో కోసం మొబైల్-ఓన్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్‌గా పిలిచే ఈ ప్లాన్ రూ.599తో ఒన్ ఇయర్ వ్యాలిడిటీతో వస్తుంది. మొబైల్ డివైజెస్‌లో సబ్స్క్రైబర్లకు మాత్రమే ప్రైమ్ వీడియో యాక్సెస్‌ను అందిస్తుంది. దీని ద్వారా ఫ్రీ డెలివరీలు, అమెజాన్ మ్యూజిక్ మొదలైన ఇతర ప్రైమ్ మెంబర్షిప్ బెనిఫిట్స్ అందవని గమనించాలి.
BSNL New Plan: బీఎస్ఎన్ఎల్ నుంచి ఏడాది వేలిడిటీతో కొత్త ప్లాన్... బెనిఫిట్స్ తెలుసుకోండి
నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ప్లాన్ సహా అనేక రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది. మొబైల్ ప్లాన్‌కు నెలకు రూ.149 చెల్లించాలి. ఈ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో SD (480p) నాణ్యతలో అందుబాటులో ఉన్న మొత్తం కంటెంట్‌కు యాక్సెస్‌ను అందిస్తుంది.
డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ డివైజ్‌ల కోసం నెలవారీ, వార్షిక ప్లాన్లను అందిస్తుంది. దీని ధర మూడు నెలలకు రూ.149, సంవత్సరానికి రూ.499. ఈ రెండు ప్లాన్లు యాడ్-సపోర్టుతో వస్తాయి. ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే లాగిన్ చేయగలరు.
వూట్ సెలెక్ట్ సంవత్సరానికి రూ.299తో ఒక మొబైల్ ప్లాన్‌ను మాత్రమే అందిస్తోంది. ఒక డివైజ్‌లో 720p స్ట్రీమింగ్‌ను మాత్రమే అవకాశం ఉంటుంది.
Google Messages: టెక్స్ట్ మెసేజెస్‌ని షెడ్యూల్ చేయొచ్చు... ఎలాగో తెలుసుకోండి
సోనీలైవ్ మొబైల్ ప్లాన్ సంవత్సరానికి రూ.599తో ఉంది. ఇది ఒక మొబైల్ డివైజ్‌లో మాత్రమే 720p స్ట్రీమింగ్కు అవకాశం ఇస్తుంది.
డిస్కవరీ+ కేవలం రెండు ప్లాన్లను మాత్రమే అందిస్తుంది. రూ.199కి మంత్లీ ప్లాన్, రూ.399కి యాన్యువల్ ప్లాన్ అందుబాటులో ఉన్నాయి.
Eros Now ఎలాంటి మొబైల్ ప్లాన్‌ను అందించదు. ఈ ప్లాట్‌ఫామ్ వరుసగా రూ.49, రూ.79, రూ.399 ధరలతో మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ ప్లాన్లను మాత్రమే అందిస్తుంది.
Jio Offer: ఐసీసీ టీ20 వాల్డ్ కప్ ఫైనల్ చూస్తారా? ఈ జియో ప్లాన్స్‌పై డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ
జీ5లో మొబైల్- ఓన్లీ ప్లాన్ అందుబాటులో లేదు. ఇది వరుసగా రూ.999, రూ.399 ధరలతో యాన్యువల్, క్వార్టర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon prime, Disney+ Hotstar, Netflix, Ott, Ott platform