హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Prime: ప్రైమ్​ యూజర్స్​కు గట్టి షాకిచ్చిన అమెజాన్​.. నెలవారీ ప్లాన్​, ఫ్రీ ట్రయల్​ తొలగింపు.. వివరాలివే

Amazon Prime: ప్రైమ్​ యూజర్స్​కు గట్టి షాకిచ్చిన అమెజాన్​.. నెలవారీ ప్లాన్​, ఫ్రీ ట్రయల్​ తొలగింపు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గట్టి షాకిచ్చింది. నెలవారీ సబ్ స్క్రిప్షన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అమెజాన్. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ అమెజాన్ ప్రైమ్​ యూజర్లకు గట్టి షాకిచ్చింది. నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ప్యాక్​ను తాత్కాలికంగా నిలపివేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసంది. అలాగే తన కొత్త కస్టమర్ల కోసం ఇచ్చే ఫ్రీ ట్రయల్​ ఆఫర్​ను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు స్పష్టం చేసింది అమెజాన్. దీంతో, ప్రైమ్​ యూజర్లకు ఇకపై కేవలం మూడు నెలలు లేదా ఏడాది వ్యవధి గల ప్రైమ్ సబ్​స్క్రిప్షన్ ప్లాన్లు​ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. కాగా, ఆర్​బీఐ నూతన మార్గదర్శకాలకు లోబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్​ వెల్లడించింది. రీఛార్జులు, ఓటీటీ, డీటీహెచ్​ వంటి రికరింగ్​ ఆన్​లైన్​ లావాదేవీల కోసం అడిషనల్​ ఫ్యాక్టర్​ ఆఫ్​ అథెంటికేషన్​ (ఏఎఫ్​ఏ)ను అమలు చేయాలని బ్యాంకులను, ఫైనాన్స్​ సంస్థలను ఆర్బీఐ ఆదేశించించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఎఫ్​ఏ నిబంధనలకు లోబడి నెలవారీ సబ్​స్క్రిప్షన్​ ప్లాన్​ రూ. 129ని తొలగించినట్లు అమెజాన్​ పేర్కొంది. ఇకపై ప్రైమ్​ సబ్​స్క్రిప్షన్​ తీసుకోవాలి అనుకునే వారికి రూ. 329 విలువ చేసే మూడు నెలల ప్లాన్​, రూ.999 విలువ గల ఏడాది ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

WhatsApp: ఆ వినియోగదారుల ఖాతాలను తొలగిస్తాం.. వాట్సాప్ షాకింగ్ ప్రకటన.. వివరాలివే..

ఎవరైనా యూజర్​ కొత్త ప్రైమ్​ మెంబర్​షిప్​ తీసుకోవాలన్నా, లేదంటే పాతదాన్ని రెన్యువల్​ చేసుకోవాలన్నా మూడు నెలలు లేదంటే ఏడాది సబ్​స్క్రిప్షన్​ను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఏప్రిల్​ 27న అమెజాన్ ప్రైమ్ తన సపోర్ట్​ పేజీలో మార్పులు చేశారు. కాగా, తొలుత ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచే అమలు చేయాలని ఆర్బీఐ భావించగా.. బ్యాంకులు, పేమెంట్ గేట్​వేల వినతితో దీన్ని సెప్టెంబర్ 30 వరకు వాయిదా వేసింది.

కరోనాతో పెరిగిన ఓటీటీ క్రేజ్..

కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత థియేటర్లు మూతపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వెబ్ సిరీస్లతో పాటు సినిమాలు కూడా ఓటీటీలో విడదల చేస్తున్నారు. ఫలితంగా ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా ఓటీటీ ప్లాట్​ఫామ్​లో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు, ఇతర ఓటీటీ ప్లాట్​ఫామ్​లకు గట్టి పోటీనిచ్చేందుకు నెలవారీ సబ్స్క్రిప్షన్ విధానాన్ని అందిస్తూ వస్తోంది. దీంతో ఏడాది పాటు సబ్​స్క్రిప్షన్​ పొందలేని కస్టమర్లు నెలరోజుల ప్యాక్ తీసుకుని ఎంజాయ్ చేసే వారు. అయితే, ఇప్పుడు అటువంటి వారికి అమెజాన్ బిగ్ షాకిచ్చిందనే చెప్పాలి. కాగా, ప్రైమ్​ ఫ్రీ ట్రయల్​, నెలవారీ సబ్​స్క్రిప్షన్​ను తాత్కాలికంగా తొలగించిన అమెజాన్​.. భవిష్యత్తులో దీన్ని పునరుద్ధరిస్తుందా? పూర్తిగా నిలిపేస్తుందా? అనే విషయంపై మాత్రం స్పష్టతను ఇవ్వలేదు.

First published:

Tags: Amazon, Amazon prime, Ott

ఉత్తమ కథలు