Home /News /technology /

AMAZON PRIME DAY SALE OFFERS AMAZING OFFERS ON THESE BRANDED HEADPHONES AT LOW PRICES UMG GH

Amazon: అమెజాన్ ప్రైమ్ డే సేల్ వీటిపై దిమ్మతిరిగే ఆఫర్లు.. తక్కువ ధరకే బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్..!

 అమెజాన్ ప్రైమ్ డే సేల్  వీటిపై దిమ్మతిరిగే ఆఫర్లు.. తక్కువ ధరకే బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్..

అమెజాన్ ప్రైమ్ డే సేల్ వీటిపై దిమ్మతిరిగే ఆఫర్లు.. తక్కువ ధరకే బ్రాండెడ్ హెడ్‌ఫోన్స్..

ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఈ వీకెండ్‌ అతిపెద్ద ఆఫర్ సేల్ నిర్వహిస్తోంది. ‘అమెజాన్ ప్రైమ్ డే 2022’ పేరుతో ప్రారంభమైన ఆఫర్ సేల్ జులై 23 నుంచి జులై 24 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లు, టీవీలు, యాక్సెసరీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై వివిధ ఆఫర్లను అం

ఇంకా చదవండి ...
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్(Amazon) ఈ వీకెండ్‌ అతిపెద్ద ఆఫర్ సేల్ నిర్వహిస్తోంది. ‘అమెజాన్ ప్రైమ్ డే 2022’ పేరుతో ప్రారంభమైన ఆఫర్ సేల్ జులై 23 నుంచి జులై 24 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లు, టీవీలు, యాక్సెసరీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై వివిధ ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండే ఈ సేల్(Sale) జులై 23 అర్ధరాత్రి నుంచి జులై 24 రాత్రి 11:59 గంటల వరకు కొనసాగుతుంది. సేల్‌కు ముందు ప్రైమ్ మెంబర్‌షిప్ లేని వారు కొత్త మెంబర్‌షిప్ పొందవచ్చు. లేదా 30 రోజుల ఫ్రీ ట్రయల్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో బెస్ట్ ఆఫర్స్ ఓసారి చెక్ చేయండి..

 iQOO Neo 6
ఐక్యూ నియో 6 ఫోన్‌ను ప్రస్తుత ఆఫర్‌లో రూ.25,999కే కొనుగోలు చేయవచ్చు. వివిధ ఆఫర్లతో దీనిపై రూ. 4,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 1,000 డిస్కౌంట్ కూపన్‌, ఎంపిక చేసిన బ్యాంక్(Bank) కార్డ్‌లపై మరో రూ. 3,000 డిస్కౌంట్‌ ఉన్నాయి.

Apple AirPods Gen-3
ఈ ఎయిర్‌పాడ్స్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 17,990కి లభిస్తున్నాయి. ICICI బ్యాంక్, స్టేట్ బ్యాంక్ కస్టమర్లు 10 శాతం అదనపు తగ్గింపు పొందుతారు. నో-కాస్ట్ EMI ఆప్షన్లు ఉన్నాయి.

Bose Quietcomfort 45 headphones
హెడ్‌ఫోన్స్(Headphones) ప్రైమ్ డే సేల్‌లో రూ. 22,990 ధరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి గరిష్టంగా 24 గంటల బ్యాటరీ లైఫ్, హై ఫిడిలిటీ సౌండ్ సపోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్‌ వంటి ఫీచర్లతో వస్తాయి.

Apple iPhone 11 (64GB)
ఐఫోన్ 11 ఇప్పుడు రూ. 41,999 ధరకు అందుబాటులో ఉంది. కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌లను రూ. 12,950 వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

OnePlus బడ్స్ ప్రో
వన్‌ప్లస్ బడ్స్ ప్రో ప్రీమియం TWS ఇయర్‌బడ్స్ ధర రూ. 8990కు తగ్గింది. దీన్ని మ్యాట్ బ్లాక్, రేడియంట్ సిల్వర్ వంటి రెండు రంగులలో కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్‌లతో అదనంగా రూ. 1000 డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.

iQOO Z6
ఐక్యూ Z6 ఫోన్ రూ. 1000 కూపన్‌తో రూ. 12,499కి అందుబాటులో ఉంది. ICICI, SBI బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగిస్తే మరో రూ. 1000 డిస్కౌంట్ పొందవచ్చు.

ఇదీ చదవండి: china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..



Raegr Arc 400 Pro 15W వైర్‌లెస్ ఛార్జర్
ఈ వైర్‌లెస్ ఛార్జర్ ధర ఆఫర్లో రూ. 899 నుంచి రూ. 791కి తగ్గింది. నథింగ్ ఫోన్ (1), గెలాక్సీ S20 FE 5G వంటి ఫోన్‌లకు అత్యంత సరసమైన వైర్‌లెస్ ఛార్జర్‌లలో ఇది ఒకటిగా నిలిచింది.

Apple iPad Air 2022 with M1 chip
2022 64GB iPad Air (WiFi) చిప్ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో రూ. 51,590కి అందుబాటులో ఉంది. వైఫై సెల్యులార్ వేరియంట్ రూ. 68,900కి బదులుగా రూ. 63,999కి అందుబాటులో ఉంది. M1 iPad Air 2022 10.9-అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లే, స్టీరియో ల్యాండ్‌స్కేప్ స్పీకర్లు, 12MP ఫ్రంట్, బ్యాక్ కెమెరాలతో వస్తుంది. ఇది యాపిల్ 'సెంటర్ స్టేజ్' ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది.



Sony WH-1000XM4 హెడ్‌ఫోన్‌లు, WF-1000XM4 ఇయర్‌ఫోన్‌లు
Sony WH-1000XM4 ప్రీమియం నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్‌లను రూ. 2,000 బ్యాంక్ ఆపర్లతో రూ. 17,990కి కొనుగోలు చేయవచ్చు. Sony WF-1000XM4 TWS కూడా రూ. 2,000 బ్యాంక్ ఆఫర్‌లో రూ. 15,990 వద్ద అందుబాటులో ఉంది.

Amazon Kindle 10th-Gen
తాజా ఆఫర్‌లో దీని ధర రూ.7,999 నుంచి రూ.6,499కి తగ్గింది. ఈ డివైజ్ 167 ppi గ్లేర్-ఫ్రీ డిస్‌ప్లే, అడ్జస్టబుల్ ఫ్రంట్ లైట్‌తో వస్తుంది. ప్రైమ్ మెంబర్స్ వందల కొద్దీ పుస్తకాలు, కామిక్‌లకు ఫ్రీ యాక్సెస్‌ పొందవచ్చు.
Published by:Mahesh
First published:

Tags: Amazon prime, Headphones, Mobile offers, Smartphones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు