AMAZON PRIME DAY SALE HUGE DISCOUNT OFFERS ON THESE SAMSUNG PRODUCTS SS GH
Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ సాంసంగ్ ఉత్పత్తులపై బంపరాఫర్లు
Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో ఈ సాంసంగ్ ఉత్పత్తులపై బంపరాఫర్లు
(image: Samsung India)
Amazon Prime Day Sale | అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో సాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలు, ఇతర ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నిర్వహిస్తున్నప్రైమ్ డే సేల్ మొదలైంది. నేడు, రేపు (జూలై 26, 27) రెండ్రోజుల పాటు జరగనుంది. సేల్‌లో భాగంగాఅనేక ఉత్పత్తులపైఆఫర్లు ప్రకటించింది. ఈ తరుణంలో సాంసంగ్ తన టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లను భారీ డిస్కౌంట్లకు పెట్టింది. అమెజాన్‌లో ఉన్న సాంసంగ్ ప్రత్యేకమైన ఆఫర్లు ఇవే..
స్మార్ట్ టీవీ
ప్రైమ్డేస్లో స్మార్ట్ టీవీలపై సాంసంగ్ ఆఫర్లు ప్రకటించింది. హెచ్డీ స్మార్ట్ టీవీలు రూ.17,490 నుంచి అందుబాటులో ఉండగా.. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తోంది. 16 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే సాంసంగ్ క్రిస్టల్ 4కే యూహెచ్డీ టీవీ ప్రారంభ ధరపై 28 శాతం తగ్గించి రూ.37,990కే అమ్మకానికి పెట్టింది.
ఇక 55 ఇంచుల లైఫ్‌స్టయిల్ స్మార్ట్‌టీవీ ‘ది ఫ్రేమ్ 2021’ ఎడిషన్‌కు టెరాకొటా కలర్‌తో బెజిల్ (అంచులు)ను సాంసంగ్ విడుదల చేసింది. ది ఫ్రేమ్ 2021 మోడల్.. గత మోడల్ కంటే 46 శాతం సన్నగా ఉంటుందని సంస్థ వెల్లడించింది. ది ఫ్రేమ్ 2021 టెరాకోటా కలర్ 55 ఇంచుల బెజిల్ను 24 శాతం డిస్కౌంట్‌తో రూ.6,749లకు అమ్మకానికి పెట్టింది. టీవీతో పాటు బెజిల్ను కొనుగోలు చేసే వారికి ఇది వర్తిస్తుంది. ప్రైమ్డేస్లో 31 శాతం వరకు డిస్కౌంట్‌తో సాంసంగ్ ది ఫ్రేమ్ టీవీ ప్రారంభం ధర రూ.61,990 నుంచి అందుబాటులోకి రానుంది. నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.
వాషింగ్ మెషీన్
కొత్తగా లాంచ్ చేసిన హైజీన్ స్ట్రీమ్ టెక్నాలజీ.. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్‌పై 21 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించిన సాంసంగ్ .. ప్రారంభ ధర రూ.31,499కే అమ్మకానికి పెట్టింది. నెలకు రూ.1,750 నోకాస్ట్ ఈఎంఐ సదుపాయంతో కూడా ఈ వాషింగ్ మెషీన్లను కొనవచ్చు. అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లపై 20 శాతం వరకు ఆఫర్ ఇస్తోంది. వీటి ధర రూ.30,999 నుంచి ప్రారంభమవుతున్నాయి.
డిగో పాటెర్న్లో సింగిల్ డోర్ డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్ (198 లీటర్లు), డబుల్ డోర్ ఫ్రోస్ట్ ఫ్రీ (235 లీటర్లు) రిఫ్రిజిరేటర్లను లాంచ్ చేసిన సాంసంగ్ వాటి ప్రారంభ ధరలను వరుసగా రూ.17,900, రూ.24,990గా ఉంచింది. 20 శాతం వరకు డిస్కౌంట్‌తో పాటు 10 ఏళ్ల పాటు కంప్రెసర్ వారంటీతో ప్రైమ్ డేస్‌లో కొనవచ్చు. సాంసంగ్ సైడ్ బై సైడ్ అండ్ కన్వర్టబుల్ ఫ్రెంచ్ డోర్ రిఫ్రిజిరేటర్‌ను సాంసంగ్ రూ.69,990 ప్రారంభ ధరకు అమ్మకానికి పెట్టింది. నెలకు రూ.3,889 ఈఎంఐ ద్వారా కూడా దీన్ని కొనొచ్చు.
మైక్రోవేవ్స్
సాంసంగ్ బేకర్ సిరీస్ మైక్రోవేవ్‌లు రూ.9,990 ధర నుంచి అందుబాటులో ఉన్నాయి. దాదాపు అన్ని మోడళ్లపై 20 శాతం వరకు డిస్కౌంట్‌తో ఇవి సేల్‌లో ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.