Home /News /technology /

AMAZON PRIME DAY SALE 2022 GET UP TO 75 PERCENT DISCOUNT ON LAPTOPS AND HEADPHONES HERE OFFERS DETAILS NS

Amazon Prime Day Sale Offers: ఎల్లుండి నుంచే అమెజాన్ ప్రైమ్ డే సేల్.. విభాగాల వారీగా ఆఫర్ల వివరాలివే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

లక్షలాది మంది వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రైమ్ డే సేల్‌ను జూలై 23న నిర్వహించేందుకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సిద్ధమైంది. ఈ సేల్ ఈ నెల 23వ తేదీన మొదలై 24వ తేదీ వరకు రెండు రోజుల పాటు కొనసాగనుంది.

    లక్షలాది మంది వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రైమ్ డే సేల్‌ (Amazon Prime Day Sale) ను జూలై 23న నిర్వహించేందుకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) సిద్ధమైంది. ఈ సేల్ ఈ నెల 23వ తేదీన మొదలై 24వ తేదీ వరకు రెండు రోజుల పాటు కొనసాగనుంది. సేల్ ఈవెంట్‌ ప్రారంభానికి ముందే బెస్ట్ డీల్‌లు మరియు ఆఫర్‌లను వెల్లడించింది అమెజాన్. స్మార్ట్‌ఫోన్‌లు (Smartphone Offers) మరియు ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని తెలిపింది అమెజాన్. ఇది కాకుండా.. ల్యాప్‌టాప్‌లు మరియు హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు తగ్గింపు అందించబడుతుందని వెల్లడించింది. ఈ ఆఫర్లతో పాటు SBI మరియు ICICI బ్యాంక్ కార్డులతో (క్రెడిట్, డెబిట్) కొనుగోళ్లు చేసే వారికి అదనంగా 10 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. విభాగాల వారీగా ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

    మొబైల్‌లు మరియు యాక్సెసరీలపై తగ్గింపు.. ప్రైమ్ డే సేల్‌లో మీరు ల్యాప్‌టాప్‌లపై రూ.40,000 వరకు తగ్గింపును అందుకోవచ్చు. ఇంకా.. మీరు స్మార్ట్ వాచ్‌లు మరియు ఫిట్‌నెస్ బ్యాండ్‌లపై 75 శాతం వరకు తగ్గింపును పొందొచ్చు. అదే సమయంలో.. హెడ్‌ఫోన్‌లపై 75 శాతం వరకు, టాబ్లెట్‌లపై 50 శాతం మరియు అలెక్సా పరికరాలపై 55 శాతం వరకు తగ్గింపును అందుకోవచ్చు.
    Amazon Prime Day: అమెజాన్ లో స్మార్ట్ టీవీలపై 60% వరకు తగ్గింపు.. ఈ Redmi Smart TV కేవలం రూ.10 వేలకే.. బెస్టు ఆఫర్లు ఇవే..

    ఇంకా మీరు మీ కిచెన్ ను అప్‌గ్రేడ్ చేయాలని చూస్తున్నట్లయితే.. ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. ఈ సేల్ లో కిచెన్ వేర్‌పై 60 శాతం వరకు తగ్గింపు అందుకోవచ్చు. Amazon Prime Day సేల్‌లో గొప్ప డీల్‌లు ఉన్నాయి. మీరు సరసమైన ధరలకు ప్రీమియం ఉత్పత్తులను కొనుగోలు చేయగలగొచ్చు. ఈ సేల్ లో మైక్రోవేవ్‌లు 60% వరకు తగ్గింపుతో లభిస్తాయి. ఇది కాకుండా వ్యాక్యూమ్ క్లీనర్లపై 30% వరకు తగ్గింపు పొందొచ్చు. మిక్సర్ గ్రైండర్లపై 50% వరకు మరియు గీజర్లు మరియు హీటర్లపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది.


    స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం తగ్గింపు: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో, మీరు స్మార్ట్‌ఫోన్‌లపై రూ. 7,000 ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌లు మరియు యాక్సెసరీలపై 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా, HDFC బ్యాంక్ కార్డ్‌లతో చేసిన కొనుగోళ్లపై ఆరు నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్ మరియు అదనంగా 3 నెలల నో కాస్ట్ EMI ప్రయోజనం కూడా ఉంది. సేల్ లో Vivo iQOO Z6 5G స్మార్ట్ ఫోన్ ధర రూ. 12,999 నుంచి ప్రారంభం అవుతుంది. అదే సమయంలో.. OnePlus Nord CE 2 Lite 5G ధర రూ. 17,499. Redmi Note 11 ప్రారంభ ధర రూ. 12,999, Samsung M33 5G రూ. 17,999 మరియు Realme Narzo 50A Prime రూ. 11,499 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Amazon, Laptops, Smart TV, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు