Home /News /technology /

AMAZON PRIME DAY SALE 2021 BEST DEALS AND OFFERS FOR HOUSEHOLD APPLIANCES MK GH

Amazon Prime Day: అమెజాన్ ప్రైమ్ డే సేల్​లో భారీ ఆఫర్లు.. బెస్ట్ డీల్స్​పై ఓ లుక్కేయండి

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ప్రైమ్​డే సేల్ ప్రారంభమైంది. నేడు, రేపు రెండ్రోజుల పాటు జరిగే ఈ సేల్​లో అనేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.స్మార్ట్ హోం గ్యాడ్జెట్లు, గృహోపకరణాలైన ఎయిర్ కండీషనర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు తదితర వస్తువులపై ఆఫర్లను ప్రకటించింది.హోం, కిచెన్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. వీటిలో కొన్ని బెస్ట్ ప్రొడక్టులపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఇంకా చదవండి ...
ఈ–కామర్స్​ దిగ్గజం అమెజాన్ప్రైమ్​డే సేల్ ప్రారంభమైంది. నేడు, రేపు రెండ్రోజుల పాటు జరిగే ఈ సేల్​లో అనేక ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది.స్మార్ట్ హోం గ్యాడ్జెట్లు, గృహోపకరణాలైన ఎయిర్ కండీషనర్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు తదితర వస్తువులపై ఆఫర్లను ప్రకటించింది.హోం, కిచెన్ వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్​ ఇస్తోంది. వీటిలో కొన్ని బెస్ట్ ప్రొడక్టులపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

విప్రో 10ఏ స్మార్ట్ ప్లగ్..
విప్రోకు చెందిన ఈ స్మార్ట్ ప్లగ్ తో మీరు పలు రకాల డివైజ్ లను వాయిస్ కమాండ్ల ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎనర్జీ వినియోగాన్ని పర్యవేక్షించవచ్చు. వీటితో పాటు డివైజ్ టర్న్ ఆన్, ఆఫ్ కు సంబంధించి రిమైండర్లు, షెడ్యూల్స్ కు అనుమతిస్తుంది. దీన్ని టీవీలు, ఎలక్ట్రిక్ కెటిల్స్, టేబుల్ ఫ్యాన్లు, సెట్ అప్ బాక్సులకు, ఎయిర్ ప్యూరీఫైర్లు లాంటి విద్యుత్ ఉపకరణాలకు కనెక్ట్ చేసుకోవచ్చు. సాధారణంగా దీని ధర రూ.899లు ఉంటుంది. అయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్లో దీనిపై 28 శాతం రాయితీ ఉంది.

ఐరోబో రూంబా ఐ7 ప్లస్..
రోజువారీగా ఇంటిని శుభ్రపరిచే సౌలభ్యాన్ని ఇది ఇస్తుంది. దీని స్మార్ట్ నేవిగేషన్ కు మీరు ఫిదా అవుతారు. క్లీనర్ కు వాయిస్ కమాండ్లు ఇచ్చి ఇంటి మూల మూలల్లోనూ శుభ్రపరచిచేలా మార్గనిర్దేశం చేయవచ్చు. కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు. ఛార్జ్ చేసిన తర్వాత రెండు నెలల వరకు మళ్లీ ఛార్జింగ్ చేయాల్సిన పనిలేదు. దుమ్ము, ధూళి, మరకలు, కాలానుగుణ అలెర్జీ కారకాలను ఇది సేకరిస్తుంది. అంతేకాకుండా పెంపుడు షెడ్డింగ్ సీజన్లలో ఆటోమేటిక్ గా శుభ్రం చేయాలని సూచిస్తుంది. సాధారణంగా దీని ధర రూ.1,01,900లు ఉంటుంది. ప్రైమ్ డే సేల్ పరంగా రాయితీతో రూ.74,900 కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. HDFC కార్డులు కలిగిన వారు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ రూపంలో రూ.500లు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

రియల్ మీ స్మార్ట్ సెక్యురిటీ కెమెరా..
ఈ రియల్ మీ స్మార్ట్ సెక్యురిటీ కెమెరాలో టైమ్ మోషన్ ట్రాకింగ్, వాయిస్ టాక్ బ్యాక్, 3డీ నాయిస్ క్యాన్సలేషన్, ఇన్ ఫ్రారెడ్ నైట్ విజన్ లాంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 360 డిగ్రీల విజన్ దీని అదనపు ఆకర్షణ. 1080పీ రిజల్యూషన్ తో స్పష్టమైన వీడియో నాణ్యతను కలిగి ఉంది. అంతేకాకుండా 128 జీబీ స్టోరేజీని కలిగి ఉండటమే కాకుండా అప్ రైట్, టైటిల్డ్ పొజిషన్లలో లభ్యమవుతుంది. ఈ సెక్యురిటీ కెమెరాను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ప్రైమ్ డే సేల్ లో మీరు కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు. అంతేకాకుండా 28 శాతం అదనపు డిస్కౌంటు కూడా అందుబాటులో ఉంది.

ఐరోబో బ్రావా ఎం6 మోపింగ్ రోబో..
ఈ స్మార్ట్ మోపింగ్ రోబో మీ ఇంటిని శుభ్రపరచడానికి అనువుగా ఉంటుంది. వాయిస్ కమాండ్ తో పనిచేసే ఈ రోబో మీరు ఎక్కడ శుభ్రం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పవచ్చు. దీని వైకింగ్ ఫైబర్లు దుమ్మును విచ్ఛిన్నం చేస్తాయి. అంతేకాకుండా డ్రై స్వీపింగ్ ప్యాడ్లు ధూళిని, పెంపుడు జంతువు జుట్టును సంగ్రహిస్తాయి. ఫర్నిచర్, రగ్గులకు దుమ్మును తొలగించేందుకు జెట్ స్ప్రేను కలిగి ఉంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో మీరు ఈ స్మార్ట్ డివైజ్ ను రాయితీ రేటుతో పొందవచ్చు. నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇందులో ఉంది. రూ. 500లు విలువైన కాంప్లిమెంటరీ అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ పొందవచ్చు.

డైకిన్ స్ప్లిట్ ఏసీ..
మార్కెట్లో లభ్యమవుతున్న పాపులర్ స్మార్ట్ ఎయిర్ కండీషనర్లలో అత్యంత సమర్థవంతమైన ప్రత్యామ్నాయాల్లో ఇది ఒకటి. ఈ డైకిన్ స్ప్లిట్ ఏసీ వేరియబలు్ స్పీడ్ కంప్రెసర్ ను కలిగి ఉంది. దీని ద్వారా పవర్ ను ఆటోమేటిక్ గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హీట్ లోడ్ పై ఇది ఆధారపడి ఉంటుంది. తక్కువ నాయిస్ లెవల్, యాంటీ సూక్ష్మజీవుల వడపోత, అధిక యాంబియంట్ వర్కింగ్ ఇందులో ముఖ్యమైన ఫీచర్లు. ఆర్32 రిఫ్రజరేటర్ గ్యాస్ ను కలిగి ఉంది. ఓజోన్ పొరకు ఈ ఏసీ ఎలాంటి హాని తలపెట్టదని డైకిన్ సంస్థ తెలిపింది. యూజర్ల దీన్ని వారి యాప్ పై నొక్కడం ద్వారా లేదా వాయిస్ కమాండ్ తో సులభంగా నియంత్రించవచ్చు. ఇది అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ రెండింటికి అనుకూలంగా ఉంటుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Amazon, Business

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు