హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Prime Day 2022 Sale: అమెజాన్ కళ్లు చెదిరే ఆఫర్లు.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు..!

Amazon Prime Day 2022 Sale: అమెజాన్ కళ్లు చెదిరే ఆఫర్లు.. మొబైల్స్‌పై భారీ తగ్గింపు..!

అమెజాన్ ప్రైమ్ డేలో భారీ డిస్కౌంట్‌లు

అమెజాన్ ప్రైమ్ డేలో భారీ డిస్కౌంట్‌లు

ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి కళ్లుచెదిరే ఆఫర్లు అందించే అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ సేల్ జులై 23న ప్రారంభమై జులై 24న ముగుస్తుంది.

ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి కళ్లుచెదిరే ఆఫర్లు అందించే అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ సేల్ జులై 23న ప్రారంభమై జులై 24న ముగుస్తుంది. ప్రైమ్ డే సేల్‌లో యాపిల్, శాంసంగ్, వన్‌ప్లస్, షియోమీ, ఐకూ, రియల్‌మీ, ఇతర ప్రముఖ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లపై భారీ ఆఫర్ల (Offers)ను అమెజాన్ అందించనుంది. కిండల్ eReaders, అమెజాన్ ఎకో-సిరీస్ స్మార్ట్ స్పీకర్లపై కూడా ఆకర్షణీయమైన డీల్స్‌ (Deals)ను ఆఫర్ చేస్తామని కంపెనీ తెలిపింది. మరి ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఉన్న ఆ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.

* యాపిల్

ఈ సేల్ టైమ్‌లో కొన్ని ఐఫోన్ మోడల్స్‌పై కస్టమర్లు రూ.20,000 వరకు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ మోడళ్లు ఏంటనేవి ఇంకా వెల్లడించలేదు. అయితే ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మాక్స్ మోడల్‌లపై గ్రేట్ డీల్స్ ఆఫర్ చేస్తామని అమెజాన్ తెలిపింది.

* సాంసంగ్

ఈ సేల్‌లో సాంసంగ్ గెలాక్సీ S21 FE మొబైల్‌పై 30 శాతం వరకు డిస్కౌంట్, గెలాక్సీ M52పై రూ.15,000 డిస్కౌంట్, గెలాక్సీ M53, M33లపై రూ.8,000 డిస్కౌంట్, గెలాక్సీ M32పై రూ.5,000 డిస్కౌంట్‌తో సహా మరిన్ని M-సిరీస్ ఫోన్లపై కూడా ఆఫర్లు ఉంటాయి. కొన్ని బ్యాంక్ కార్డ్‌లతో అదనపు డిస్కౌంట్స్ పొందొచ్చు.

ఇదీ చదవండి:  శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. సైన్యమే దేశాన్ని చేతుల్లోకి తీసుకోనుందా.. విస్తుపోయే నిజాలు ఇవే !


* వన్‌ప్లస్‌

జులై 23, 24 తేదీల్లో ఒన్‌ప్లస్‌ 9 రూ.37,999కే అందుబాటులో ఉంటుంది. ఒన్‌ప్లస్‌ 10R, ఒన్‌ప్లస్‌ 10 Pro 9 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌తో వస్తాయి. కూపన్లపై రూ.4,000 డిస్కౌంట్, రూ.7,000 వరకు ఎక్స్ఛేంజ్ వాల్యూ కూడా ఉంటాయి.

* షావోమి

సేల్ సమయంలో రూ.600 అదనపు కూపన్‌ బెనిఫిట్స్‌తో రెడ్‌మీ 9-సిరీస్ ఫోన్స్ కేవలం రూ.6,899 నుంచే ప్రారంభమవుతాయి. నోట్ 10T 5G, నోట్ 10 Pro, నోట్ 10 Pro Max, నోట్ 10Sతో సహా రెడ్‌మీ నోట్ 10 సిరీస్ ఫోన్లు కొన్ని అదనపు బ్యాంక్ ఆఫర్ల కింద రూ.10,999 ప్రారంభ ధరతో దొరుకుతాయి. షావోమి 11 లైట్ రూ.23,999కి అందుబాటులో ఉంటుంది. షావోమి 11T ప్రో రూ.35,999 స్టార్టింగ్ ప్రైస్‌తో లభిస్తుంది. షావోమి

12 Pro ధర బ్యాంక్ డిస్కౌంట్లు, కూపన్‌ వంటి అదనపు ఆఫర్లతో రూ.6000 వరకు తగ్గి రూ. 56,999కి అందుబాటులోకి వస్తుంది.

* రియల్‌మీ

నార్జో 50 5G, నార్జో 50 ప్రో, నార్జో 50Aలతో కూడిన రియల్‌మీ నార్జో 50-సిరీస్ సేల్ సమయంలో రూ. 11,499 నుంచి ప్రారంభమవుతుంది. బ్రాండ్ కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్‌లతో సహా అదనపు ప్రయోజనాలను కూడా కొనుగోలుదారులు అందుకోవచ్చు.

* ఐక్యూ

ఐక్యూ నియో 6 (iQOO Neo 6)ని సేల్ సమయంలో రూ.29,999కు అమెజాన్ అందించనుంది. రూ.3,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్స్‌ కూడా ఆఫర్ చేస్తుంది. iQOO Z6 ప్రో ధర రూ.23,999, iQOO Z6 ధర కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్లతో రూ.14,999తో సొంతం చేసుకోవచ్చు. iQOO 9-సిరీస్ ఫోన్‌లపై చాలా డిస్కౌంట్స్, ఆఫర్లు కూడా ఉన్నాయి.

* ఇతర ఆఫర్లు, డీల్‌లు

ప్రైమ్ డే 2022 సేల్‌లో హెడ్‌సెట్‌లు రూ. 149 ప్రారంభ ధరతో, పవర్ బ్యాంక్‌లు రూ.499, మొబైల్ కేస్‌లు & కవర్లు రూ.99, కేబుల్‌లు రూ.49, ఛార్జర్లు రూ.139 స్టార్టింగ్ ధరతో అందుబాటులోకి వస్తాయి. ఈ రెండు రోజుల సమయంలో వినియోగదారులు అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్‌ప్లేలపై 55 శాతం వరకు డిస్కౌంట్‌ను అందుకోవచ్చు. అలానే Kindle eReadersపై రూ.4,000 డిస్కౌంట్‌ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. కిండల్ పేపర్‌వైట్ రూ.11,099, కిండల్ పేపర్‌వైట్ సిగ్నేచర్ వేరియంట్‌ను రూ.15,299కి అందుబాటులో తేనుంది.

First published:

Tags: Amazon, Amazon prime, Mobiles, Tech news

ఉత్తమ కథలు