Amazon Prime Day 2021: ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్‌తో ముందుకొచ్చింది. ఈ సేల్ నేడు, రేపు (26, 27 తేదీల్లో) రెండు రోజుల పాటు జరగనుంది. సేల్‌లో భాగంగా అనేక ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించింది. ఇక, కోవిడ్–19తో అంతా ఇంటికే పరిమితమవ్వడంతో టీవీలు, ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకొని అమెజాన్ స్మార్ట్‌టీవీలపై 65 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ప్రముఖ స్మార్ట్బ్రాండ్లకు చెందిన 4కె స్మార్ట్‌టీవీలపై అమెజాన్ అందిస్తున్న ఆఫర్లపై ఓలుక్కేయండి.
స్మార్ట్‌టీవీలపై బెస్ట్ డీల్స్ ఇవే..
Vu Premium 4K Ultra HD Smart LED TV (43-inch)
ప్రముఖ స్మార్ట్బ్రాండ్ వూ తన ప్రీమియం 4 కె అల్ట్రా హెచ్డి ఎల్ఈడి టీవీపై అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇది 64 -బిట్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 43 అంగుళాల ఎల్ఈడి స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది డాల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో హెచ్‌డిఆర్ 10 సర్టిఫికేషన్ కూడా అందించారు. ఈ స్మార్ట్‌టీవీని అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో రూ .36,000 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Onida Full HD Smart IPS LED Fire TV (42-inch)
ప్రైమ్ డే సేల్‌లో ఒనిడా ఫుల్ హెచ్డి ఎల్ఈడీ టీవీపై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌టీవీ 4K యూహెచ్‌డి రిజల్యూషన్ సపోర్ట్‌తో వస్తుంది. అయితే, ఈ డివైజ్ అమెజాన్ ఫైర్ టీవీ ఓఎస్‌తో పనిచేస్తుంది. దీనిలో డిస్ప్లే మిర్రరింగ్, అలెక్సా వాయిస్ రిమోట్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది.
Mi 4K Ultra HD Android Smart LED TV 4X (43-inch)
అమెజాన్ సేల్‌లో భాగంగా చైనా స్మార్ట్బ్రాండ్ షియోమికి చెందిన ఎంఐ 4 కె స్మార్ట్ టీవీపై కూడా డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్టీవీ అల్ట్రా హెచ్డి ఎల్ఈడి10- బిట్ ప్యానెల్ (1.07 బిలియన్ కలర్స్) డిస్ప్లేతో వస్తుంది. ఈ ఆండ్రాయిడ్ టివిలో ప్రొప్రైటరీ ప్యాచ్‌వాల్ ఇంటర్ఫేస్ను అందించారు.
TCL Full HD Certified Android Smart LED TV (40-inch)
ప్రముఖ స్మార్ట్బ్రాండ్ టీసీఎల్ స్మార్ట్ ఎల్ఈడి టీవీపై డిస్కౌంట్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌టీవీ డ్యూయల్ కోర్ మాలి 470 గ్రాఫిక్స్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 8-బిట్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 16.7 మిలియన్ కలర్స్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో మైక్రో డిమ్మింగ్, 2 కె హెచ్‌డిఆర్ 10 కంటెంట్ సపోర్ట్‌ను అందించారు. ఇది 178 డిగ్రీల వ్యూయింగ్ ఆంగిల్ కలిగి ఉంటుంది. ఇక, దీనిలో 20W డాల్బీ ఆడియో స్పీకర్లను అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Smart TV