వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... ఆ ప్లాన్స్‌పై మాత్రమే

Amazon Prime Day 2020 | ఆగస్ట్ 6, 7 తేదీల్లో అమెజాన్ ప్రైమ్ డే సేల్ జరగనుంది. ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికోసమే ఈ సేల్. మరి మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలనుకుంటున్నారా? ఉచితంగా పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 30, 2020, 2:39 PM IST
వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... ఆ ప్లాన్స్‌పై మాత్రమే
వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... ఆ ప్లాన్స్‌పై మాత్రమే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు వొడాఫోన్ ఐడియా కస్టమరా? ఎయిర్‌టెల్ నెట్వర్క్ వాడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా పొందొచ్చు. ఆగస్ట్ 6, 7 తేదీల్లో ఇండియాలో అమెజాన్ ప్రైమ్ డే 2020 సేల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సేల్‌ ప్రైమ్ మెంబర్స్‌కు మాత్రమే. ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికి ప్రత్యేకమైన ఆఫర్స్ లభిస్తాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే ఏడాదికి రూ.999 చెల్లించాలి. ఒక నెలకు రూ.129, మూడు నెలలకు రూ.329 ప్లాన్స్ ఉన్నాయి. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా కూడా తీసుకోవచ్చు. ఎయిర్‌టెల్ వొడాఫోన్ ఐడియా యూజర్లకు మాత్రమే ఈ అవకాశం. అయితే కొన్ని ప్లాన్స్‌పైన మాత్రమే ఈ ఆఫర్ ఉంది. ఆ ప్లాన్స్ తీసుకున్నవారికి మాత్రమే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. మరి ఆ ప్లాన్స్ ఏవో తెలుసుకోండి.

Vodafone Rs 1099 Plan: వొడాఫోన్ రూ.1099 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకున్న వారికి రూ.999 విలువ గల అమెజాన్ ప్రైమ్, రూ.999 విలువైన జీ5, రూ.5,988 విలువైన నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. వీటితో పాటు వొడాఫోన్ ప్లే కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

Vodafone Rs 699 plan: వొడాఫోన్ రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకునే వారికి అమెజాన్ ప్రైమ్, జీ5, వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం. అన్‌లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

Vodafone Rs 499 plan: వొడాఫోన్ రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ తీసుకునే వారికి అమెజాన్ ప్రైమ్, జీ5, వొడాఫోన్ ప్లే సబ్‌స్క్రిప్షన్స్ ఉచితం. నెలకు 75జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు.

Samsung Galaxy M31s: భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ రిలీజ్... ధర ఎంతో తెలుసా?

Personal Loans: అప్పు కావాలా? తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఈ బ్యాంకులు రెడీ

Airtel Rs 499 plan: ఎయిర్‌టెల్ రూ.499 ప్లాన్ తీసుకునేవారికి అమెజాన్ ప్రైమ్, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. నెలకు 75 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.Airtel Rs 799 plan: ఎయిర్‌టెల్ రూ.799 ప్లాన్ తీసుకునేవారికి అమెజాన్ ప్రైమ్, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. నెలకు 125 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

Airtel Rs 999 plan: ఎయిర్‌టెల్ రూ.999 ప్లాన్ తీసుకునేవారికి అమెజాన్ ప్రైమ్, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. నెలకు 150 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.

Airtel Rs 1599 plan: ఎయిర్‌టెల్ రూ.1599 ప్లాన్ తీసుకునేవారికి అమెజాన్ ప్రైమ్, జీ5, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. అన్‌లిమిటెడ్ 4జీ జీబీ డేటా, అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ, రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 30, 2020, 2:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading