Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS

    Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు

    Amazon Prime Day Sale | అమెజాన్ ప్రొడక్ట్స్ అయిన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌, అమెజాన్ కిండిల్, అమెజాన్ ఇకో లాంటివాటిని డిస్కౌంట్‌లో కొనొచ్చు.

    news18-telugu
    Updated: July 12, 2019, 12:37 PM IST
    Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు
    Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు (image: Amazon)
    • Share this:
    అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. జూలై 15, 16వ తేదీల్లో 48 గంటల పాటు 'ప్రైమ్ డే సేల్‌' నిర్వహిస్తోంది అమెజాన్. ఈ సేల్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రమే. ప్రైమ్ డే సేల్‌కు సంబంధించిన డీల్స్‌ని ప్రకటించింది అమెజాన్. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లున్నాయి. యాపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్, యాపిల్ ఐఫోన్ ఎక్స్, యాపిల్ ఐఫోన్ 6ఎస్ ప్లస్, వన్‌ప్లస్ 7 ప్రో, వన్‌ప్లస్ 6టీ, వివో నెక్స్, వివో వీ15 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో, హువావే పీ30 లైట్, సాంసంగ్ గెలాక్సీ ఏ50, హువావే పీ30 లైట్ లాంటి స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉండబోతున్నాయి. స్మార్ట్‌ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, టీవీలు గ్యాడ్జెట్స్, మొబైల్ యాక్సెసరీస్‌లపైనా డిస్కౌంట్స్ అందించనుంది అమెజాన్. ఈ సేల్‌లోనే వెయ్యికిపైగా కొత్త ఉత్పత్తుల్ని లాంఛ్ చేస్తోంది అమెజాన్.



    ఇక అమెజాన్ ప్రొడక్ట్స్ అయిన అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్‌, అమెజాన్ కిండిల్, అమెజాన్ ఇకో లాంటివాటిని డిస్కౌంట్‌లో కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకున్నా ఆఫర్ వర్తిస్తుంది. ఇతర కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. మీరు ఇప్పటికే ఏదైనా ప్రొడక్ట్ కొనాలనుకుంటే విష్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. వాటిపై లైటెనింగ్ డీల్ ఉంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. కొన్ని డీల్స్ కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి. ఇక యువతకు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌పై 50% డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. ఆ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే


    ఇవి కూడా చదవండి:

    IRCTC e-wallet: రైలు టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీ ఇ-వ్యాలెట్ ట్రై చేశారా?

    Passport: పాస్‌పోర్ట్‌కు అప్లై చేస్తున్నారా? ఈ నకిలీ సైట్లతో జాగ్రత్త

    Good News: ఆధార్ కాంటెస్ట్ గడువు పొడిగింపు... రూ.30,000 గెలుచుకోండి ఇలా
    Published by: Santhosh Kumar S
    First published: July 12, 2019, 12:37 PM IST
    మరిన్ని చదవండి
    తదుపరి వార్తలు

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading