Amazon Prime వార్షిక చందాపై బంపర్ ఆఫర్...వారికి మాత్రమే

Amazon Prime | సాధారణంగా రూ.999 విలువ చేసే అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌‌పై ఇప్పుడు రూ.100ల రాయితీ ప్రకటించింది. అంటే కేవలం రూ.899కే వార్షిక సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఈ ప్రత్యేక రాయితీ అందరికీ వర్తించదు.

news18-telugu
Updated: June 27, 2020, 5:30 PM IST
Amazon Prime వార్షిక చందాపై బంపర్ ఆఫర్...వారికి మాత్రమే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కష్టకాలంలో అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సన్ నెక్ట్స్ వంటి వీడియో స్ట్రీమింగ్ సర్వీసులకు వీక్షకుల ఆదరణ విపరీతంగా పెరిగింది. లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన జనం...ఓటీటీ ప్లాట్‌ఫాంలపై గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సబ్‌స్కైబర్లను పెంచుకునేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటాపోటీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో పోటీలో ముందుండే లక్ష్యంతో అమెజాన్ ప్రైమ్ మరో బంపర్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా రూ.999 విలువ చేసే అమెజాన్‌ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్‌‌పై ఇప్పుడు రూ.100ల రాయితీ ప్రకటించింది. అంటే కేవలం రూ.899కే వార్షిక సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉండి...ఆటో రెన్యూవల్ ఆప్షన్ లేకుండా మరికొన్ని ముగిసే పక్షంలో దీన్ని రిన్యూవల్ చేసుకునే కస్టమర్లకు ఇది వర్తిస్తుంది. అయితే ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న వార్షిక సబ్‌స్ర్కిప్షన్ ముగిసిపోయిన తర్వాత ఈ రూ.100ల రాయితీ వర్తించదు. అలాగే గతంలో అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉండి...ఏవో కారణాలతో దీన్ని రెన్యూవల్ చేసుకోని కస్టమర్లకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.  amazon.in లో మీకు ఈ ప్రత్యేక ఆఫర్ వర్తిస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవచ్చు.

amazon prime video, amazon prime offer, amazon prime discount, amazon ott, amazon news, అమెజాన్ ప్రైమ్, అమెజాన్ ప్రైమ్ డిస్కౌంట్, అమెజాన్ ప్రైమ్ ఆఫర్
ప్రతీకాత్మక చిత్రం


సినిమా థియేటర్స్ ఓపన్ కాకపోవడంతో పలు కొత్త సినిమాలను కూడా ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల చేస్తున్నారు. నెట్‌‌ఫ్లిక్స్‌తో పోల్చితే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ చౌకగా లభించడంతో పాటు...నెట్‌ఫ్లిక్స్‌తో పోల్చితే అమెజాన్ ప్రైమ్‌లో లోకల్ కంటెంట్ ఎక్కువగా లభిస్తుంది. దీంతో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌ వార్షిక సబ్‌స్క్రిప్షన్ తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించిన రూ.100ల రాయితీతో తన పాత కస్టమర్లకు మళ్లీ దగ్గరకావాలని అమెజాన్ ప్రైమ్ భావిస్తోంది. నెలకు రూ.129గా ఉన్న అమెజాన్ ప్రైమ్ మాస సబ్‌స్క్రిప్షన్ మాత్రం యధాతథంగానే కొనసాగుతుంది.

అమెజాన్ ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ కింద పలు సర్వీసులు లభిస్తాయి. ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో బుక్ చేసే ఆర్డర్స్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండానే కొన్ని నగరాల్లో ఒకట్రెండు రోజుల్లోనే డెలివరీ పొందచ్చు. అలాగే ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్‌కు సబ్‌స్క్రైబర్లకు ఉచిత యాక్సస్ ఉంటుంది.
First published: June 27, 2020, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading