హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon: మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌.. అమెజాన్ నయా ప్లాన్ అదుర్స్ అంతే!

Amazon: మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌.. అమెజాన్ నయా ప్లాన్ అదుర్స్ అంతే!

Amazon

Amazon

Amazon: అమెజాన్ (Amazon) శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించాలని డిసైడ్ అయింది. ఈ కంపెనీ తన శాటిలైట్ ఇంటర్నెట్‌ యూనిట్ ప్రాజెక్ట్ అయిన కైపర్ (Kuiper) ద్వారా 2024 ప్రథమార్థంలో తన మొదటి ఇంటర్నెట్ శాటిలైట్స్‌ లాంచ్ చేయాలని యోచిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైర్డ్‌, వైర్‌లెస్ నెట్‌వర్క్‌లు మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఫాస్ట్ ఇంటర్నెట్‌(Internet)ను అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో భూమిపై ప్రతి చోటా ఇంటర్నెట్ అందించే దిశగా టెక్ దిగ్గజాలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే SpaceX బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌ శాటిలైట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్‌ను ఆఫర్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే మరో టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) శాటిలైట్ ఇంటర్నెట్‌ను అందించాలని డిసైడ్ అయింది. ఈ కంపెనీ తన శాటిలైట్ ఇంటర్నెట్‌ యూనిట్ ప్రాజెక్ట్ అయిన కైపర్ (Kuiper) ద్వారా 2024 ప్రథమార్థంలో తన మొదటి ఇంటర్నెట్ శాటిలైట్స్‌ లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

రాబోయే రెండు, మూడు ఏళ్లలో లో- ఆర్బిట్ కక్ష్యలో 3,000 శాటిలైట్స్‌ను ప్రయోగించే యోచనతో, ఈ ఏడాది చివర్లో ఈ ఉపగ్రహాలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయాలని కంపెనీ భావిస్తోంది. గ్లోబల్ ఇంటర్నెట్ కవరేజీని అందించడానికి శాటిలైట్స్‌ లాంచ్ చేసిన కొద్దిసేపటికే ఇనీషియల్ కమర్షియల్ టెస్ట్స్‌ అందించాలని అమెజాన్ నిర్ణయించింది. అమెజాన్ డివైజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవ్ లింప్ తాజాగా మాట్లాడుతూ బీటా టెస్టింగ్ ఫేజ్‌తో ప్రారంభించి 2024లో కమర్షియల్ కస్టమర్‌లతో కంపెనీ తమ శాటిలైట్ ఇంటర్నెట్‌ను టెస్ట్ చేస్తుందని ప్రకటించారు. వాషింగ్టన్‌లో జరిగిన ఓ సదస్సులో ఆయన ఈ ప్రకటన చేశారు.

రెగ్యులేటరీ బాడీ ఆదేశాల ప్రకారం, అమెజాన్ 2026 నాటికి 3,236 ఉపగ్రహాల కైపర్ శాటిలైట్ నెట్‌వర్క్‌లో సగం శాటిలైట్స్ లాంచ్ చేయాలి. ఈ రిక్వైర్‌మెంట్‌ను మీట్ కావడానికి, కంపెనీ 2024 నాటికి తమ మొదటి ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కంపెనీ రోజూ మూడు నుంచి ఐదు ఉపగ్రహాలను తయారు చేయాలని యోచిస్తున్నట్లు డేవ్ లింప్ వెల్లడించారు. ఇక శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి అమెజాన్ తన కైపర్ నెట్‌వర్క్‌లో 10 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తోంది.

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో మిలియన్ల కొద్దీ పరికరాలను తయారుచేసిన అనుభవం అమెజాన్‌కి ఉంది. ఆ అనుభవమే ఇప్పటికే అంతరిక్షంలో 4 వేల ఉపగ్రహాలను లాంచ్ చేసిన SpaceX వంటి ప్రత్యర్థులపై పైచేయి సాధించే అవకాశాన్ని అందిస్తుందని కంపెనీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అమెజాన్ 2023 ప్రారంభంలో యునైటెడ్ లాంచ్ అలయన్స్‌తో ఒక జత ప్రోటోటైప్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి వడివడిగా అడుగులు వేస్తోంది. ఆపై 2021, 2022లో సేకరించిన రాకెట్లను ఉపయోగించి వేగంగా విస్తరణ ప్రచారాన్ని ప్రారంభించనుంది. మొదటగా ఉత్పత్తి చేసిన ఉపగ్రహాలను 2024లో అంతరిక్షానికి మోసుకెళ్లనుంది.

ఇది కూడా చదవండి : ఫోన్‌ పోయిందా! మీరు ముందు చేయాల్సిన పనులివే..!

మంగళవారం నాడే అమెజాన్ కంపెనీ తన కైపర్ ఉపగ్రహాలతో యూజర్లను కనెక్ట్ చేయడానికి మూడు విభిన్న రకాల టెర్మినల్స్‌ను ఆవిష్కరించింది. ప్రామాణిక కస్టమర్ టెర్మినల్ (Standard Customer Terminal) అనేది 11-అంగుళాల చదరపు యాంటెన్నా. ఇది సెకనుకు 400MB వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుంది. 400 డాలర్ల కంటే తక్కువ ఖర్చుతోనే దీనిని కంపెనీ తయారు చేయనుంది.

అమెజాన్ తన శాటిలైట్ ఇంటర్నెట్ నెట్‌వర్క్ కోసం దాని అత్యంత సరసమైన టెర్మినల్‌గా చిన్న, తేలికపాటి మొబైల్ యాంటెన్నాను కూడా ఆఫర్ చెయ్యనుంది. ఈ టెర్మినల్ ధరను కంపెనీ వెల్లడించలేదు. సెకనుకు 1 గిగాబిట్ వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందించగల పెద్ద యాంటెన్నాను కూడా కంపెనీ తీసుకురానుంది. ఈ టెర్మినల్ దాదాపు 30 సెకన్లలో HD ఫీచర్-లెంగ్త్ మూవీని డౌన్‌లోడ్ చేయగలదు.

First published:

Tags: Amazon, Internet, Latest Technology, Tech news

ఉత్తమ కథలు