అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!

ఎంపిక చేసిన కస్టమర్లు మొదట రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారి అమెజాన్ పే అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి.

news18-telugu
Updated: September 25, 2018, 10:31 AM IST
అప్పు కావాలా? అమెజాన్ ఇస్తుంది!
IMAGE: REUTERS
news18-telugu
Updated: September 25, 2018, 10:31 AM IST
మీ దగ్గర అమెజాన్ అకౌంట్ ఉందా? అయితే మీరు రూ.60,000 వరకు అప్పు పొందొచ్చు. ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించొచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సింది ఏంటంటే... మీ పాన్ కార్డ్, కేవైసీ వివరాలు ఇస్తే చాలు. వెంటనే అప్పు ఇచ్చేస్తుంది అమెజాన్. దీని ద్వారా క్రెడిట్ కార్డులు లేనివారు ఈఎంఐ సదుపాయం పొందొచ్చు.

ఎవరు అర్హులు?
ప్రస్తుతానికి ఇది ఇన్వైట్ ఓన్లీ ప్రోగ్రామ్ మాత్రమే. ఎంపిక చేసిన కస్టమర్లు మొదట రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వారి అమెజాన్ పే అకౌంట్‌లోకి డబ్బులు క్రెడిట్ అవుతాయి. పే బ్యాలెన్స్‌తో అమెజాన్‌లో కావాల్సిన వస్తువులు కొనుక్కోవచ్చు. యూజర్లకు రూ.60,000 వరకు క్రెడిట్ లభిస్తుంది. రాబోయే ఫెస్టివల్ సీజన్‌ని దృష్టిలో పెట్టుకొని క్యాపిటల్ ఫ్లోట్‌ భాగస్వామ్యంతో క్రెడిట్ సర్వీస్‌ని ప్రారంభించింది అమెజాన్.

ఈ ఆఫర్ గురించి ఎలా తెలుసుకోవచ్చు?
అమెజాన్ పే హోమ్‌పేజీలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత అమెజాన్ పే ఈఎంఐ సేవల్ని పొందొచ్చు. యూజర్లు పాన్ కార్డ్, కేవైసీ వివరాలు తెలియజేయాలి. నిబంధనలకు అనుగుణంగా వివరాలు సరిపోతే రూ.60,000 క్రెడిట్ లభిస్తుంది. మీరు ఏదైనా వస్తువు కొంటే ఎలాంటి ఛార్జీలు, ఫీజులు ఉండవు. ఆ తర్వాత ప్రతీ నెలా వాయిదాలు చెల్లించొచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ అమెజాన్ పే హోమ్‌ పేజీలో తెలుసుకోవచ్చు.ఇటీవలే డెబిట్ కార్డులపై ఈఎంఐ సౌకర్యాన్ని ప్రారంభించింది అమెజాన్. ఇప్పుడు రాబోయే ఫెస్టివల్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కార్డులు లేనివారికి అప్పులు ఇస్తోంది. మరి ఈ సేవల్ని ఎంతమంది కస్టమర్లు ఉపయోగించుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి:
Loading...
'ఆయుష్మాన్ భారత్' పథకం గురించి తెలుసా?

గ్రాండ్‌గా లాంఛైన 'మోటోరోలా వన్ పవర్'

డేంజరస్ గేమ్స్‌పై పోరాటానికి ఆన్‌లైన్ గేమ్!

ఇండియాలో లాంఛైన నోకియా 5.1 ప్లస్

సాంసంగ్ నుంచి మరో రెండు ఫోన్లు!
First published: September 25, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...