హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Top Gaming Laptops: గేమింగ్ ల్యాప్‌టాప్‌ కొనాలనుకుంటున్నారా? రూ.80 వేలలోపు లభించే ఈ బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ ఇవే..

Top Gaming Laptops: గేమింగ్ ల్యాప్‌టాప్‌ కొనాలనుకుంటున్నారా? రూ.80 వేలలోపు లభించే ఈ బెస్ట్ గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గేమింగ్ ల్యాప్‌టాప్‌(Laptop) కొనాలనుకునేవారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తీపి కబురు అందించింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival) కంటే ముందే ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

గేమింగ్ ల్యాప్‌టాప్‌ (Laptop) కొనాలనుకునేవారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తీపి కబురు అందించింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival) కంటే ముందే ల్యాప్‌టాప్స్‌పై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. రూ.80,000లోపు లెనోవో, ఆసుస్‌, హెచ్‌పీ వంటి టాప్ బ్రాండ్ల గేమింగ్ ల్యాప్‌టాప్స్‌ను అమెజాన్ చాలా తక్కువ ధరలకే అందుబాటులోకి తీసుకొచ్చింది.

హెచ్‌పీ పెవిలియన్

ప్రస్తుతం అమెజాన్‌లో హెచ్‌పీ పెవిలియన్ 18 శాతం డిస్కౌంట్‌తో రూ.65,000కే అందుబాటులోకి వచ్చింది. దీని అసలు ధర రూ.78,900. ఇందులో 15.6-అంగుళాల FHD IPS ప్యానెల్‌, 8GB RAM+1TB HDD స్టోరేజ్, 4GB GTX 1650 GPU అందించారు.

Amazon Washing Machine Offer: అమెజాన్లో అమేజింగ్ ఆఫర్లు.. ఈ వాషింగ్ మిషన్ పై ఏకంగా రూ.19 వేల తగ్గింపు.. ఆఫర్ ఈ ఒక్కరోజే..

హెచ్‌పీ విక్టస్

రూ.88,990 విలువైన హెచ్‌పీ విక్టస్‌ను 14% డిస్కౌంట్‌తో రూ.71,990కి కొనచ్చు. ఇది 16.1-అంగుళాల FHD ప్యానెల్, 8GB RAM (32GB వరకు ఎక్స్‌పాండబుల్), 512GB SSD స్టోరేజ్ 4GB RTX 3050 గ్రాఫిక్స్ యూనిట్‌తో వస్తుంది.

Amazon Sale: ఏసీలపై అమెజాన్ కళ్లుచెదిరే ఆఫర్లు.. ఏకంగా రూ.40 వేల తగ్గింపు!

ఆసుస్‌ TUF గేమింగ్ F15

Asus TUF గేమింగ్ F15 ల్యాప్‌టాప్ 17% డిస్కౌంట్‌తో రూ.74,000కి దొరుకుతుంది. ఇందులో 8GB RAM, 512GB SSD స్టోరేజ్, 4GB GTX 1650 GPU, 10th జనరేషన్ Intel i5 CPU ఇచ్చారు.

లెనోవో ఐడియాప్యాడ్ గేమింగ్ 3

30% డిస్కౌంట్‌తో రూ.78,990కి అందుబాటులో ఉంది.. అసలు ధర రూ.1,13,290. 3 నెలల ఉచిత Xbox గేమ్ పాస్ సబ్‌స్క్రిప్షన్‌. 120Hzతో 15.6-అంగుళాల పూర్తి HD IPS స్క్రీన్.. 16GB RAM, 512GB SSD నిల్వ, 4GB RTX 3050 గ్రాఫిక్స్ యూనిట్‌తో జత చేయబడింది.

హెచ్‌పీ Omen

హెచ్‌పీ Omen 13% డిస్కౌంట్‌తో రూ.69,050కి లభిస్తుంది. ఇది 15.6-అంగుళాల FHD స్క్రీన్, AMD రైజెన్ 5 ప్రాసెసర్‌, 8GB RAM+512GB SSD, 4GB GTX 1650Ti గ్రాఫిక్స్ కార్డ్‌తో వస్తుంది.

* MSI గేమింగ్ GF63

ఎమ్ఎస్ఐ ల్యాప్‌టాప్‌ 23% డిస్కౌంట్‌తో రూ.68,990కి అందుబాటులో ఉంది. 15.6-అంగుళాల FHD IPS డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌, 8GB RAM (64GB వరకు ఎక్స్‌పాండబుల్), 512GB SSD స్టోరేజ్, 4GB GTX1650 Max Q గ్రాఫిక్స్ యూనిట్, 11th జనరేషన్ ఇంటెల్ i7 ప్రాసెసర్‌తో ఇది లాంచ్ అయ్యింది.

ఏసర్ నిట్రో 5

ఏసర్ నిట్రో 5 8GB RAM వేరియంట్‌ను 20% డిస్కౌంట్‌తో రూ.79,990కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఫ్రీ Xbox గేమ్ పాస్ అల్టిమేట్ సబ్‌స్క్రిప్షన్‌, 15.6-అంగుళాల FHD ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్‌, 512GB SSD, RTX 3050 GPU యూనిట్, 12th జనరేషన్ Intel i5 CPU ఆఫర్ చేశారు.

లెనోవో ఐడియాప్యాడ్ L340

రూ.68,990 ఒరిజినల్ ప్రైస్ ఉన్న లెనోవో ఐడియాప్యాడ్ L340 ల్యాప్‌టాప్‌ 12 శాతం డిస్కౌంట్‌తో రూ.60,500కి లభిస్తోంది. ఇందులో 15.6-అంగుళాల ఫుల్ HD IPS డిస్‌ప్లే, 8GB RAM (16GB వరకు ఎక్స్‌పాండబుల్), 1TB HDD ఇంటర్నల్ స్టోరేజ్, 3GB GTX 1050 డెడికేటెడ్ గ్రాఫిక్స్ యూనిట్‌, 9th జనరేషన్ ఇంటెల్ i5 ప్రాసెసర్‌ అందించారు.

ఏసర్ యాస్పైర్ 5

ఏసర్ యాస్పైర్ 5 (Acer Aspire 5) ల్యాప్‌టాప్‌ను 25 శాతం డిస్కౌంట్‌తో రూ.63,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల ఫుల్ HD IPS స్క్రీన్‌, 12th జనరేషన్ Intel i5 ప్రాసెసర్, 16GB RAM (32GB వరకు ఎక్స్‌పాండబుల్), 512GB SSD స్టోరేజ్, 4GB RTX 2050 గ్రాఫిక్స్ కార్డ్‌తో లాంచ్ అయింది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Laptop, New laptop

ఉత్తమ కథలు