AMAZON OFFERS RS 18000 DISCOUNT ON APPLE MACBOOK PRO WITH INTEL I5 PROCESSOR NS
Apple MacBook Pro కొనాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. రూ. 18 వేల భారీ తగ్గింపు ప్రకటించిన Amazon.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
మ్యాక్ బుక్ కొనాలనుకునే వారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్ మ్యాక్ బుక్ ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ. 18 వేల తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది.
మ్యాక్ బుక్ కొనాలనుకునే వారికి అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పింది. యాపిల్ మ్యాక్ బుక్ ప్రోపై భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రూ. 18 వేల తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. 13 ఇంచులు ఉండే ఈ మ్యాక్ బుక్ 256 జీబీ మెమోరీని కలిగి ఉంటుంది. అయితే దీని ప్రైజ్ ఇప్పటివరకు రూ.1,17,900 ఉండగా ఇప్పుడు రూ. 99,990కే అమెజాన్ అమ్మకానికి ఉంచింది. దీంతో రూ. 17, 910 డిస్కౌంట్ ను అందిస్తోంది. దీనిపై రూ. 18 వేల వరకు ఎక్సేంజ్ ఆఫర్ ను సైతం అమెజాన్ అందిస్తోంది. వర్కింగ్ కండిషన్లో ఉన్న ల్యాప్ టాప్ లపై మాత్రమే ఈ ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తున్నట్లు అమెజాన్ స్పష్టం చేసింది.
అయితే 256 జీబీ స్టోరేజ్ మోడల్ పై మాత్రమే ఈ డిస్కౌంట్ ను అమెజాన్ అందిస్తోంది. 526 జీబీ వేరియంట్ ధర రూ.1,41,791గా ఉంది. ఈ మోడల్ పై కేవలం రూ. 1,199 మాత్రమే డిస్కౌంట్ అందిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ ఎప్పటివరకు అందుబాటులో ఉంటుందన్న విషయాన్ని అమెజాన్ ఇంత వరకు స్పష్టం చేయలేదు.
ఈ మ్యాక్ బుక్ ప్రత్యేకతలు..
ఈ 13 ఇంచుల మ్యాక్ బుక్ ప్రో గత సంవత్సరంలో విడుదల చేశారు. దీనిలో 8th జనరేషన్ ఇంటెల్ i5 ప్రాసెసర్ తో పాటు 8జీబీ ర్యామ్ ఇందులో ఉంటుంది. కంఫర్టబుల్ టైపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం మ్యాజిక్ కీబోర్డ్ ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.