Amazon Sale | స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్. భారీ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) భారీ తగ్గింపు ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై (Smartphone) కళ్లుచెదిరే డీల్ లభిస్తోంది.
అమెజాన్‌లో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై పరిమిత కాల ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జీ ఫోన్2పై కళ్లుచెదిరే డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 59 వేల డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 ఉచితంగా పొందొచ్చు.
రూ.30 వేల స్మార్ట్ టీవీని రూ.8 వేలకే కొనేయండి.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!
అమెజాన్ లిస్టింగ్ ప్రకారం చూస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫోన్ ఎంఆర్‌పీ రూ. 1,61,998గా ఉంది. 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ వేరియంట్‌కు ఈ రేటు వర్తిస్తుంది. ఈ ఫోన్‌పై ఇప్పుడు అమెజాన్‌లో ఏకంగా 36 శాతం డిస్కౌంట్ ఉంది. రూ. 59 వేల తగ్గింపు లభిస్తోంది. అంటే మీరు ఈ ఫోన్‌ను రూ. 1,02,998కు కొనొచ్చు.
ఈ 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. ఏకంగా రూ.13 వేల డిస్కౌంట్!
అంతేకాకుండా రూ. 59 వేల డిస్కౌంట్‌తో పాటుగా శాంసంగ్ గెలాక్సీ వాట్ 4 ఉచితంగా పొందొచ్చు. దీని విలువ రూ. 29,999. అంటే మీకు మొత్తంగా రూ. 89 వేల వరకు ఆదా అవుతుందోని చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆదా చేసే డబ్బుతో మరో కొత్త ఐఫోన్ 14 లేదా పిక్సెల్ 7 ప్రో కొనుగోలు చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22 అల్ట్రా ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి. 6.8 అంగుళాల డైనమిక్ అమొలెడ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, వన్ యూఐ 5 పై పని చేస్తుంది. ఫోన్‌లో కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో 108 ఎంపీ రియర్ కెమెరా ఉంటుంది. అలాగే కంపెనీ ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లో 40 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అమర్చింది. కాగా ఇంకా ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ఇతర ఫీచర్లు ఉన్నాయి. బ్రాండెడ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది అదిరిపోయే ఆఫర్ అని చెప్పుకోవచ్చు. అయితే ఈ డీల్ కొంత కాలం వరకే ఉండొచ్చు. అందువల్ల మీరు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. వెంటనే ఈ ఆఫర్ పొందొచ్చు. offers
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Amazon, Latest offers, Mobile offers