భారత్‌లో 5G సేవలు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎంపిక చేసిన నగరాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ పెరిగింది. అయితే ఈ సేవలను పొందాలంటే కస్టమర్ల వద్ద 5G నెట్‌వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఉండాలి. ఇప్పటికే చాలా కంపెనీలు మార్కెట్లోకి 5G డివైజ్‌లను లాంచ్ చేశాయి. వీటిలో ఇండియన్ మొబైల్ కంపెనీ లావా లాంచ్ చేసిన ‘లావా బ్లేజ్ 5G’ (Blaze 5G) సేల్స్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం అవుతాయని ప్రకటించింది ఇ-కామర్స్ సంస్థ అమెజాన్. బడ్జెట్ రేంజ్‌లోనే దీన్ని సొంతం చేసుకోవచ్చు.
వివరాల్లోకి వెళ్తే.. లావా కంపెనీ బ్లేజ్ 5G(Blaze 5G)పేరుతో 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ అక్టోబర్‌లో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ డివైజ్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. భారత మార్కెట్లో అత్యంత చౌకైన 5G స్మార్ట్ఫోన్లలో ఒకటిగా ఇది మార్కెట్లోకి వస్తుందని లావా అప్పట్లో ప్రకటించింది. దీని సేల్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో, ఈ మోడల్ కోసం స్పెషల్ మైక్రోసైట్‌ను రూపొందించింది అమెజాన్ . ఈ పోర్టల్‌లో తాజా స్మార్ట్‌ఫోన్‌ను రూ.10వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు.
రూ.9 వేల గ్యాస్ స్టవ్ రూ.1600కే.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్!
లావా 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ స్పెషల్స్‌లో లిస్ట్ అయింది. ఈ డివైజ్ లాంచింగ్ ఆఫర్ సేల్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ వెబ్సైట్లో ప్రారంభమవుతుంది. కస్టమర్లు లాంచ్ డే ఆఫర్‌ను కూడా పొందవచ్చు. లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్ 4GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.9,999కు కొనుగోలు చేయవచ్చు. దీని గురించి లావా మొబైల్స్ ఓ ట్వీట్ చేసింది. ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే వర్తిస్తుందని ట్వీట్లో పేర్కొంది.
కిల్లింగ్ ఆఫర్.. రూ.37,000 ఫోన్‌ను రూ.13 వేలకే కొనండి
లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల HD+ IPS డిస్ప్లేతో 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది మీడియాటెక్ డైమెన్షిటీ 700 ప్రాసెసర్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను మైక్రోఎస్డీ కార్డ్‌తో 1TB వరకు పొడిగించుకోవచ్చు. లావా బ్లేజ్ 5G ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై రన్ అవుతుంది. కనెక్టివిటీ కోసం 3.5mm హెడ్‌ఫోన్ జాక్, టైప్-C పోర్ట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ రియర్ ప్యానెల్లో EIS సపోర్ట్‌తో 50MP AI ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 8MP కెమెరాను అమర్చారు.
లావా బ్లేజ్ 5G స్మార్ట్‌ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై 50 గంటల టాక్ టైమ్ ఇస్తుందని లావా పేర్కొంది. పవర్ బటన్కే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యుయల్ సిమ్, 5G, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ లావా బ్లేజ్ 5G కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ వంటి రెండు కలర్ ఆప్షన్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Amazon, Latest offers, Lava, Mobile offers