• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • AMAZON LAUNCHES AMAZONBASICS FIRE TV EDITION SMART TVS IN INDIA PRICING STARTS AT RS 13999 SS

Amazon Smart TV: ఇండియాలో స్మార్ట్‌టీవీలు లాంఛ్ చేసిన అమెజాన్... ఫీచర్స్ ఇవే

Amazon Smart TV: ఇండియాలో స్మార్ట్‌టీవీలు లాంఛ్ చేసిన అమెజాన్... ఫీచర్స్ ఇవే

Amazon Smart TV: ఇండియాలో స్మార్ట్‌టీవీలు లాంఛ్ చేసిన అమెజాన్... ఫీచర్స్ ఇవే (image: Amazon India)

AmazonBasics Smart TV | అమెజాన్ బేసిక్స్ స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. నాలుగు స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది అమెజాన్. ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    స్మార్ట్‌టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో స్మార్ట్‌టీవీ సెగ్మెంట్‌లో అడుగుపెట్టింది. 32 అంగుళాలు, 43 అంగుళాలు, 50 అంగుళాలు, 55 అంగుళాల టీవీలను లాంఛ్ చేసింది. అమెజాన్ బేసిక్స్ పేరుతో లాంఛ్ అయిన ఈ స్మార్ట్ టీవీల ధరలు రూ.13,999 నుంచి ప్రారంభమౌతాయి. ఇవన్నీ ఫైర్ టీవీ ఎడిషన్ స్మార్ట్ టీవీలు. అంటే ఈ టీవీల్లో అమెజాన్ ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తాయి. డాల్బీ విజన్ డిస్‌ప్లే, డాల్బీ అట్మాస్ ఆడియో లాంటి ఫీచర్స్ ఉన్నాయి. టీవీ ధరను బట్టి ఫీచర్స్‌లో కొన్ని మార్పులు ఉన్నాయి.

    AmazonBasics 32-inch Fire TV


    అమెజాన్ బేసిక్స్ 32 అంగుళాల ఫైర్ టీవీ హెచ్‌డీ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ ఉండటం విశేషం. రెండు హెచ్‌‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. 20 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలెక్సా బిల్ట్ ఇన్ ఉంది. అలెక్సా వాయిస్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ మెమొరీ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ధర రూ.13,999.

    Smartphones under Rs 20,000: కొత్త ఫోన్ కొనాలా? రూ.20,000 లోపు బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్స్ ఇవే... 5జీ ఫోన్ కూడా

    Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ ఫ్రీ... ఫ్రీ... ఫ్రీ... ఇలా పొందండి

    AmazonBasics 43-inch Fire TV


    అమెజాన్ బేసిక్స్ 43 అంగుళాల ఫైర్ టీవీ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్‌ ఉండటం విశేషం. రెండు హెచ్‌‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు ఉన్నాయి. 20 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలెక్సా బిల్ట్ ఇన్ ఉంది. అలెక్సా వాయిస్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. 1.5GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ మెమొరీ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ధర రూ.23,499.

    AmazonBasics 43-inch Fire TV Edition 4K


    అమెజాన్ బేసిక్స్ 43 అంగుళాల ఫైర్ టీవీ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్10+ రేటింగ్ ఉండటం విశేషం. మూడు హెచ్‌‌డీఎంఐ 2.0 పోర్టులు, 1 యూఎస్‌బీ 3.0 పోర్ట్, 1 యూఎస్‌బీ 2.0 పోర్టులు ఉన్నాయి. 20 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలెక్సా బిల్ట్ ఇన్ ఉంది. అలెక్సా వాయిస్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. 1.95GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబీ ర్యామ్, 8జీబీ మెమొరీ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ధర రూ.27,499.

    Samsung Galaxy M02s: సాంసంగ్ గెలాక్సీ ఎం02ఎస్ ఫస్ట్ సేల్‌ డేట్ ప్రకటించిన అమెజాన్

    Jio Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? జియో అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

    AmazonBasics 55-inch Fire TV Edition 4K


    అమెజాన్ బేసిక్స్ 55 అంగుళాల ఫైర్ టీవీ అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీలో 60Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్10+ రేటింగ్ ఉండటం విశేషం. మూడు హెచ్‌‌డీఎంఐ 2.0 పోర్టులు, 1 యూఎస్‌బీ 3.0 పోర్ట్, 1 యూఎస్‌బీ 2.0 పోర్టులు ఉన్నాయి. 20 వాట్స్ స్పీకర్స్ ఉన్నాయి. ఫైర్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అలెక్సా బిల్ట్ ఇన్ ఉంది. అలెక్సా వాయిస్ కంట్రోల్‌తో పనిచేస్తుంది. 1.95GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5జీబీ ర్యామ్, 8జీబీ మెమొరీ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ధర రూ.36,999.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు