Amazon Kiosk: ఇక షాపింగ్ మాల్స్‌లో అమెజాన్ కియోస్క్... 100 పైగా ఏర్పాటు

Amazon Kiosk | ఈ ఏడాది చివరి నాటికి కియోస్క్‌ల ఏర్పాటు పూర్తికానుంది. 70-80 చదరపు అడుగుల స్థలంలోనే కియోస్క్ ఏర్పాటు చేయనుంది అమెజాన్. ఇవి థర్డ్ పార్టీలు నిర్వహించే ఫ్రాంఛైజ్‌లుగా ఉంటాయి.

news18-telugu
Updated: March 26, 2019, 3:26 PM IST
Amazon Kiosk: ఇక షాపింగ్ మాల్స్‌లో అమెజాన్ కియోస్క్... 100 పైగా ఏర్పాటు
Amazon Kiosk: ఇక షాపింగ్ మాల్స్‌లో అమెజాన్ కియోస్క్... 100 పైగా ఏర్పాటు
  • Share this:
ఏదైనా వస్తువు కొనాలంటే అమెజాన్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నారా? ఇకపై మీకు షాపింగ్ మాల్స్‌లో అమెజాన్ కియోస్క్‌లు కనిపించనున్నాయి. దేశవ్యాప్తంగా పలు పట్టణాల్లోని మాల్స్‌లో 100 కియోస్క్‌ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది అమెజాన్. ఇందులో కిండిల్, ఇకో స్పీకర్, ఫైర్ టీవీ స్టిక్ లాంటి అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అమ్ముతారు. ఈ ఏడాది చివరి నాటికి కియోస్క్‌ల ఏర్పాటు పూర్తికానుంది. 70-80 చదరపు అడుగుల స్థలంలోనే కియోస్క్ ఏర్పాటు చేయనుంది అమెజాన్. ఇవి థర్డ్ పార్టీలు నిర్వహించే ఫ్రాంఛైజ్‌లుగా ఉంటాయి.

మాల్స్‌లో కియోస్క్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన అమెజాన్‌కు కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం బెంగళూరులో ప్రారంభించింది. ఆ తర్వాత ముంబై, అహ్మదాబాద్, నోయిడాలో ఏర్పాటు చేసింది. కర్నాటకలో రెండు కియోస్క్‌లు ఉండగా, ముంబై, అహ్మదాబాద్‌‌లో ఒక్కోటి ఉన్నాయి. నోయిడాలో ఐదో కియోస్క్‌ను గత వారం ప్రారంభించింది అమెజాన్. మరో వందకు పైగా కియోస్క్‌లు దేశంలోని వివిధ పట్టణాల్లో మాల్స్‌లో ఏర్పాటు కానున్నాయి.

Photos: సముద్రంలో రెస్టారెంట్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

NTA UGC NET 2019: యూజీసీ నెట్‌ పాసైతే 5 లాభాలు ఇవే... మార్చి 30 చివరి తేదీ

IRCTC New Rule: ఇక 4 గంటల ముందు రైలు ఎక్కే స్టేషన్ మార్చుకోవచ్చుTRAI Deadline: ఛానెళ్ల ఎంపికకు మార్చి 31 డెడ్‌లైన్
First published: March 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు