Home /News /technology /

AMAZON IS NOW ALLOWS YOU TO TRY ON SHOES VIRTUALLY HERE IS DETAILS NS GH

Amazon Shoes Trial: అమెజాన్‌లో అద్భుతమైన ఫీచర్.. వర్చువల్‌గా షూస్‌ ట్రయల్ చేసుకునే ఛాన్స్.. ఇదిగో వీడియో

ఫొటో: ట్విట్టర్

ఫొటో: ట్విట్టర్

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన కస్టమర్లకు సరికొత్త షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వర్చువల్ పద్ధతిలో షూస్ (Shoes)ను కస్టమర్లు ట్రయల్ వేసుకునే అవకాశం కల్పించింది. అది ఎలాగంటే..

ఇంకా చదవండి ...
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన కస్టమర్లకు సరికొత్త షాపింగ్ (Shopping) ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా తాజాగా వర్చువల్ పద్ధతిలో షూస్ (Shoes)ను కస్టమర్లు ట్రయల్ వేసేందుకు/చేసేందుకు వీలుగా ఒక కొత్త ఫీచర్ పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. సాధారణంగా మనం షాపింగ్ మాల్స్‌కి వెళ్లినప్పుడు షూస్ కొనుగోలు చేయాలంటే వాటిని ధరించి అవి మనకి సరిగ్గా సరిపోయాయా? కాళ్లకు అందంగా ఉన్నాయా? అని పరిశీలిస్తాం. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో అలా కుదరదు. కానీ వర్చువల్ పద్ధతిలో వాస్తవ ప్రపంచంలో షాపింగ్‌ చేస్తున్నట్లు అనుభూతిని పొందడం సాధ్యమే. ఇదే ఆలోచనతో రియల్-వరల్డ్‌ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించడానికి అమెజాన్ "వర్చువల్ ట్రై-ఆన్ ఫర్ షూస్ (Virtual Try-On for Shoes)" పేరుతో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. ఇప్పటికే కెనడా, యూఎస్‌లోని ఐఓఎస్ యూజర్లు వర్చువల్‌గా షూలను ధరించేలా ఇంటరాక్టివ్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిచయం చేసినట్లు అమెజాన్ తాజాగా ప్రకటించింది.

ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో పనిచేసే వర్చువల్ ట్రై-ఆన్ (Virtual Try-On) ఫీచర్ ఆన్‌లైన్‌లో ఫ్యాషన్ ప్రొడక్ట్స్ కోసం షాపింగ్ చేస్తున్నప్పుడు మరింత ఇంటరాక్టివ్ అనుభూతిని అందిస్తుంది. యాప్‌లోని వర్చువల్ ట్రై-ఆన్ ఫీచర్‌పై క్లిక్ చేయడం ద్వారా కస్టమర్లు తాము సెలెక్ట్ చేసుకున్న షూస్‌ తమ పాదాలకు బాగున్నాయా? అనేది ప్రతి యాంగిల్ నుంచి పరిశీలించవచ్చు. కాళ్లు కదపడం ద్వారా ఎవ్రీ యాంగిల్ నుంచి లుక్‌ను గమనించవచ్చని... తద్వారా వాటిని కొనుగోలు చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చని అమెజాన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్ అమెరికా, కెనడా కస్టమర్లకు అందుబాటులోకి రాగా... ఇతర కస్టమర్లకు త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఆండ్రాయిడ్ కస్టమర్లకు కూడా అతి త్వరలోనే లాంచ్ చేస్తామని అమెజాన్ తెలిపింది.
Motorola Offers: మోటోరోలా స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్స్... 120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా, మరెన్నో ఫీచర్స్

వర్చువల్ ట్రై-ఆన్ ఫర్ షూస్ ఫీచర్‌ను పరిచయం చేస్తున్నందుకు తమకు చాలా సంతోషం ఉందని అమెజాన్ ఫ్యాషన్ ప్రెసిడెంట్ ముగే ఎర్డిరిక్ డోగన్ చెప్పారు. కస్టమర్లు ఎక్కడ ఉన్నా తమకు తెలిసిన, ఇష్టపడే బ్రాండ్‌ల నుంచి వేలకొద్దీ స్టైలిష్ షూలను వారి సౌలభ్యం మేరకు ప్రయత్నించవచ్చని డోగన్ పేర్కొన్నారు. కస్టమర్ల అభిప్రాయాల మేరకు మరిన్ని అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేస్తామన్నారు.



వర్చువల్ ట్రై-ఆన్ ఉపయోగించేది ఎలా
ఈ ఫీచర్ ఉపయోగించడానికి కస్టమర్లు మొదటగా అడిడాస్, రీబాక్, ప్యూమా వంటి బ్రాండ్ల నుంచి తమకు నచ్చిన షూలను ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ ఇమేజ్ కింద “వర్చువల్ ట్రై-ఆన్” బటన్‌పై క్లిక్ చేయాలి. అనంతరం ఫోన్ కెమెరాను పాదాలకు ఎదురుగా ఉంచాలి. అప్పుడు ఆ షూలు పాదాలకు నిజంగానే ధరించినట్లు వర్చువల్‌గా కనిపిస్తాయి. ఇలా పాదాలపై వర్చువల్‌గా షూస్‌ ఉన్నప్పుడు కాళ్లు కదపడం ద్వారా అన్ని కోణాల్లో పాదాలకు షూస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవచ్చు.

మీరు సెలెక్ట్ చేసుకున్న షూస్ ఎన్ని కలర్స్‌లో ఉంటే అన్ని కలర్లలో కూడా వర్చువల్‌గా ట్రై చేయవచ్చు. కస్టమర్లు తాము ప్రయత్నిస్తున్న వర్చువల్ షూని ఫోటో తీయవచ్చు. వాటిని సోషల్ మీడియా ద్వారా స్నేహితులతో పంచుకోవచ్చు. ప్రస్తుతం షూల వరకే ఉన్న అందుబాటులో ఈ ఫీచర్ మరికొద్ది రోజుల్లో అన్ని ఫ్యాషన్ ప్రొడక్ట్స్‌కు సపోర్ట్ చేయనుందని సమాచారం.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Amazon, Online shopping, Shoe cost

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు