• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • AMAZON INVESTING RS 225 CRORES IN INDIA TO COMPETE WITH PHONEPE GOOGLE PAY PAYTM SS GH

Amazon pay: 'అమెజాన్​ పే' బలోపేతానికి రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అమెజాన్

Amazon pay: 'అమెజాన్​ పే' బలోపేతానికి రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అమెజాన్

Amazon pay: 'అమెజాన్​ పే' బలోపేతానికి రూ.225 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అమెజాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Amazon pay | అమెజాన్ పే బలోపేతానికి భారతదేశంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది అమెజాన్.

  • Share this:
ప్రముఖ ఇ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ ఉత్పత్తుల రవాణా సేవలే కాకుండా 'అమెజాన్​ పే' పేరుతో డిజిటల్ పేమెంట్​ సేవలను కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం, భారత డిజిటల్​ పేమెంట్స్​ విభాగంలో ముందున్న గూగుల్​ పే, ఫోన్​పే, పేటీఎం వంటి దిగ్గజాలకు గట్టి పోటీనిచ్చేందుకు అమెజాన్​ సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే రూ.225 కోట్లను వెచ్చించి తమ పేమెంట్స్​ విభాగం 'అమెజాన్​ పే'ను మరింత బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రూ.22,50,00000 ఈక్విటీ షేర్లను ప్రస్తుతం ఉన్న వాటాదార్లకు రైట్స్​ బేసిస్​ కింద కేటాయించింది. ఈ షేర్లను అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెజాన్.కామ్​లకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు దాఖలు చేసిన పత్రాల్లో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొంది.

Gas Cylinder Discount: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? డిస్కౌంట్... పొందండి ఇలా

Vi New Plans: వొడాఫోన్ ఐడియా నుంచి సరికొత్త ప్లాన్స్... డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితం

అమెజాన్​ పే బలోపేతం కోసం ఇటీవలి కాలంలో పెద్ద మొత్తాలని కేటాయించింది. 2020 అక్టోబర్‌లో రూ.700 కోట్లు, 2021 జనవరిలో రూ.1,355 కోట్లను కేటాయించింది. భారత్​లో మార్కెట్​ప్లేస్​, హోల్‌సేల్, పేమెంట్స్​ వంటి కార్యకలాపాలను బలోపేతం చేయడంపై అమెజాన్​ దృష్టి సారించింది. వీటి కోసం ఏటా మిలియన్​ డాలర్లను వెచ్చిస్తోంది. తద్వారా భారత మార్కెట్​లో అమెజాన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ప్రస్తుతం భారతఈ–కామర్స్​​ రంగంలో ఫ్లిప్​కార్ట్​ను దాటేసి మొదటి స్థానంలో ఉన్న అమెజాన్​, డిజిటల్​ పేమెంట్స్​ విభాగంలో మాత్రం గూగుల్​ పే, ఫోన్​పే, పేటీఎంల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. అందువల్లే, తమ పేమెంట్​ విభాగం ‘అమెజాన్​ పే’ను మరింత బలోపేతం చేసేందుకు భారీ పెట్టుబడులకు సైతం వెనకాడటం లేదు.

Smartphone under Rs 10000: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే

Samsung Galaxy A32: సాంసంగ్ గెలాక్సీ ఏ32 స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో ఆఫర్స్

రూ. 225 కోట్ల మేర పెట్టుబడి


భారత్​లోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలను ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చేందుకు 1 బిలియన్ డాలర్ల (రూ .7,000 కోట్లు)కు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు అమెజాన్​ సీఈవో జెఫ్​ బెజోస్​ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు కూడా ఇదే తరహాలో అమెజాన్​ భారతదేశంలో 5.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టింది. అమెరికా తర్వాత అతి ముఖ్యమైన మార్కెట్​గా భారత్​ను పరగణిస్తుంది అమెజాన్​ సంస్థ. అందువల్లే, ఇక్కడ భారీ పెట్టుబడులు పెట్టి మరీ తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవాలని యోచిస్తోంది.
Published by:Santhosh Kumar S
First published: