డేటా స్కామ్ ఫేస్‌బుక్‌ను ఏ స్థాయిలో కుదిపేసిందో నెటిజన్లకు బాగా తెలుసు. ఇప్పుడు అలాంటి స్కామ్‌లోనే అమెజాన్ చిక్కుకుందా? ఈ అనుమానాలు ఎవరివో కాదు. ఆ కంపెనీవే. కస్టమర్ల డేటా లీక్ చేయడం, నెగిటీవ్ రివ్యూలను డిలిట్ చేయడం లాంటి ఆరోపణలపై సొంత స్టాఫ్‌పైనే అమెజాన్ దర్యాప్తు జరుపుతోంది. ఇది కంపెనీ పాలసీని ఉల్లంఘించడమే. అయితే ప్రస్తుతం ఈ వివాదం చైనాకే పరిమితమైంది. షెన్జెన్లోని కొందరు మధ్యవర్తులు అమెజాన్ ఉద్యోగుల ద్వారా కస్టమర్ల డేటాను సంపాదించి 80-2000 డాలర్లకు అమ్ముకుంటున్నట్టు తేలింది.
ఇలా కస్టమర్ల డేటాను సొంత ఉద్యోగులే థర్డ్ పార్టీ కంపెనీలకు అమ్ముతున్నట్టు తమ విచారణలో తేలిందని అమెజాన్ కంపెనీయే స్వయంగా ప్రకటించింది. కస్టమర్ల విశ్వసనీయ సమాచారాన్ని మధ్య వర్తుల ద్వారా తమ వెబ్సైట్లో వస్తువులు అమ్మే వ్యాపారులకే అందించినట్టు తేలింది. ఇలాంటి వాటిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది అమెజాన్ యాజమాన్యం.

కంపెనీ ఇలాంటి చర్యల్ని అస్సలు సహించదు. ఈతరహా చెడు ప్రవర్తన ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారుల్ని గుర్తించి వారి సెల్లింగ్ అకౌంట్లను తొలగిస్తాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
— అమెజాన్ ప్రకటన
అంతేకాదు... నెగిటీవ్ రివ్యూలను డిలిట్ చేసి సొంత ఉద్యోగులే వ్యాపారులకు మేలు చేస్తున్నట్టు గుర్తించింది కంపెనీ. అయితే కొందరు కస్టమర్లు ఇచ్చే ఫేక్ రివ్యూలు కూడా కంపెనీకి పెద్ద సమస్యగా మారాయి. అయితే ప్రస్తుతం ఈ లోపాలన్నీ చైనాలో మాత్రమే బయటపడ్డాయి. మరి అమెజాన్‌కు కోట్లాది కస్టమర్లు ఉన్న ఇండియాలో డేటా అమ్ముకోవడం, రివ్యూలు డిలిట్ చేయడం లాంటి అక్రమాలు ఉన్నాయో లేదో తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
గూగుల్‌లో మీ డేటాను ఎలా డిలిట్ చేయాలో తెలుసా?
మీ వాట్సప్ డేటా ఇలా బ్యాకప్ చేసుకోండి!
మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పాలసీలివి!
క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు!Published by:Santhosh Kumar S
First published:September 17, 2018, 12:42 IST