అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) యూజర్లకు మరో కొత్త ఆప్షన్ అందుబాటులోకి తెచ్చుకొంది. నిరంతరం ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించే అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల సౌకర్యం కోసం మరో ఆప్షన్ అందిస్తోంది. అదే సబ్‌స్కిప్షన్ రద్దు ఆప్షన్. ప్రైమ్ మెంబర్షిప్ (Membership) నెలవారి సబ్స్క్రిప్షన్ (Subscription) సేవలను తిరిగి అమెజాన్ ప్రారంభించింది. దీంతో కొత్తగా ప్రైమ్ మెంబర్షిప్ సేవలను ప్రయత్నించే వారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆర్థికంగా సౌకర్యంగా కూడా ఉంటుంది. ప్రైమ్ మెంబర్షిప్ సేవలను నెల రోజుల పాటు పొంది, నచ్చకపోతే ప్రైమ్ మెంబర్షిప్ వెంటనే రద్దు చేసుకోవచ్చును. ఇది వినియోగదారులు సౌకర్యంగా ఉంటుందని అమెజాన్ పేర్కొంటుంది.
ధరల వివరాలు..
- అమెజాన్ ప్రైమ్వార్షిక ప్రణాళిక ధర రూ. 999,
- మూడు నెలల ప్లాన్ ధర తగ్గింపు రేటు రూ. 329 కి బదులుగా రూ. 387. మార్చారు.
- నెలవారీ చందా. రూ. 129లకే అభిస్తోంది. కానీ ఇది ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులకు మాత్రమే
కారణం ఏంటీ?
అమెజాన్ ఈ ఏడాది ప్రారంభంలోనే అమెజాన్ నెల వారి సబ్స్క్రిప్షన్ తీసి వేసింది. మూడు నెలలు, సంవత్సరం సబ్స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి. కారణం రిజర్వ్ బ్యాంకు నిబంధనలు అక్టోబర్ 1 నుంచి ఆటో డెబిట్ కార్డు రూల్స్‌పై రిజర్వ్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుందే.
iQOO 8 Legend: త్వరలో మార్కెట్లోకి ఐకూ 8 లెజెండ్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ ఇవే
పునరావృతమయ్యే లావాదేవీలపై ఆర్బీఐ కట్టడి చేసింది. ఇప్పటికే వన్ మంత్ సబ్స్క్రిప్షన్ కేవలం సెలక్టెడ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతోనే పొందవచ్చును. నెట్‌ఫ్లిక్స్ తరహాలో ఉచిత వన్ మంత్ ట్రయల్ సబ్‌స్క్రిప్షన్‌ను అమెజాన్ తీసివేసిన విషయం తెలిసిందే. దీంతో అమెజాన్ తిరిగి వినియోగ దారుల కోసం ఈ విధానాన్ని ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.
అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్..
వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది అమెజాన్ (Amazon). ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్’ పేరిట సరికొత్త ప్రోగ్రాంను లాంచ్ చేసింది.
ఈ స్కీమ్ ప్రైమ్ వినియోగదారులను ఆకర్షిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఎంటీ ‘అడ్వాన్టేజ్ జస్ట్ ఫర్ ప్రైమ్ తెలుసుకోండి. ఈ కొత్త ప్రొగ్రాం వల్ల ప్రైమ్ వినియోగ దారులకు ఎటువంటి లబ్ధి చేకూరుతుందో తెలుసుకొందాం. ఈ ప్రోగ్రాం (Program) సాయంతో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ప్రైమ్ సభ్యులకు నో కాస్ట్ ఈఏమ్ఐలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కేవలం స్మార్ట్ఫోన్లకే వర్తించనుంది.
నెల రోజుల పాటు జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ల్యాప్‌టాప్‌లు (Laptops) , స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్ (Mobile Phone)లు , ఎయిర్ ప్యూరిఫైయర్లు , గృహోపకరణాలు , వంటగది ఉపకరణాలు మరిన్నింటిపై అమెజాన్ డిస్కౌంట్లను అందిస్తోంది . ఇవన్నీ 'అడ్వాంటేజ్ - జస్ట్ ఫర్ ప్రైమ్' ప్రోగ్రామ్‌లో భాగంగా మాత్రమే అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Amazon prime, Latest Technology