Home /News /technology /

AMAZON INDIA PRIME DAY SALE 2021 SMALL BUSINESSES TO LAUNCH OVER 2400 PRODUCTS SS GH

Amazon India: అమెజాన్​ ప్రైమ్ డే సేల్‌లో 2,400 కొత్త ఉత్పత్తుల అమ్మకం

Amazon India: అమెజాన్​ ప్రైమ్ డే సేల్‌లో 2,400 కొత్త ఉత్పత్తుల అమ్మకం

Amazon India: అమెజాన్​ ప్రైమ్ డే సేల్‌లో 2,400 కొత్త ఉత్పత్తుల అమ్మకం

Amazon India | అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా చిన్న వ్యాపారులు 2400 పైగా కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేయనున్నారు.

ఇ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ ఇండియా ఈనెల 26, 27 తేదీల్లో ‘ప్రైమ్​ డే’ పేరుతో సేల్​ నిర్వహించనుంది. ప్రైమ్​ డే సేల్​లో ప్రతి ఏడాది కొత్త ఉత్పత్తులను అమ్మకానికి పెడుతున్న విషయం తెలిసిందే. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా 100కు పైగా చిన్న, మధ్య తరహా సంస్థల్లో తయారైన 2,400 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు అమెజాన్​ ఇండియా డైరెక్టర్​ ప్రణవ్​ భాసిన్​ తెలిపారు. స్టార్టప్‌లు, మహిళా ఎంటర్​ప్రెన్యూర్లు, చేనేత కళాకారులు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రైమ్​డే సేల్​లో విడుదల చేస్తామని ఆయన అన్నారు. ఈసారి అమెజాన్​ నిర్వహించే ప్రైమ్​డే సేల్​లో 450కి పైగా నగరాల నుంచి 75 వేల మందికి పైగా అమ్మకందారులు పాల్గొంటారని స్పష్టం చేశారు.

Unlimited Data Plans: అన్‌లిమిటెడ్ డేటా కావాలా? Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే

Earphones: ఆ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990... షాకయ్యారా? ఎందుకో తెలుసుకోండి

వందకు పైగా చిన్న మధ్య తరహా సంస్థ (ఎస్​ఎంబీ)ల్లో తయారైన ఇంటి అవసరాలకు వాడే ఉత్పత్తులు, ఫ్యాషన్​, బ్యూటీ, జ్యూవెలరీ, కిరాణా, ఎలక్ట్రానిక్స్​ లాంటి అనేక ఉత్పత్తులను సేల్​లో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రైమ్​డేలో 450కి పైగా నగరాల నుంచి 75,000 పైచిలుకు 'లోకల్ షాప్స్ ఆన్ అమెజాన్’ విక్రేతలు పాల్గొంటారని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ సేల్​లో భాగంగా మిలియన్ల మంది చేతివృత్తులవారు, చేనేత కార్మికులు, లక్షలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలు, వేలాది స్టార్టప్‌లు తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించనున్నట్లు తెలిపారు.

అటు చిన్న తరహా వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు ఈ సేల్​ ఎంతగానో ఉపయోగపడుతుందని అమెజాన్​ ఇండియా ఎంఎస్ఎంఈ విక్రేత భాగస్వామి ప్రణవ్ భాసిన్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న చిన్న వ్యాపారాలు తిరిగి పుంజుకునేందుకు తమ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

Exchange Offer: రూ.17,000 ధరకే ఐఫోన్... ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్

WhatsApp: ఒకే వాట్సప్ అకౌంట్ 4 డివైజ్‌లలో వాడుకోవచ్చు... కొత్త ఫీచర్ వచ్చేసింది

కొత్తగా 11 గోడౌన్‌లు


ఇక రాబోయే పండుగ సీజన్​లో చేపట్టబోయే ఫెస్టివల్​ సేల్స్​, ప్రైమ్​డే సేల్స్​లో అమ్మకానికి రానున్న ఉత్పత్తుల నిల్వ​ కోసం 11 కొత్త గిడ్డంగులను ప్రారంభిస్తామని ప్రణవ్ భాసిన్ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న తొమ్మిది ఫెసిలిటీ సెంటర్లతో పాటు ఇవి కూడా ప్రారంభంకానున్నాయని తెలిపారు. ఈ ప్రక్రియను మరింత వేగంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఫుల్​ఫిల్​మెంట్​ సెంటర్లు మహారాష్ట్ర, బీహార్, గుజరాత్, అస్సాం, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలలో ఉన్నాయని ప్రణవ్ వివరించారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, AMAZON INDIA, Amazon prime, Business, Small business

తదుపరి వార్తలు