అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఏడాదికి రూ.999 చెల్లించాల్సిన అవసరం లేదు. రూ.499 ధరకే అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. అయితే ఇందుకోసం మీ వయస్సు 18 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అమెజాన్ ఇండియా అందిస్తున్న యూత్ ఆఫర్ ఇది. కొత్త ప్రైమ్ మెంబర్స్‌ని చేర్చుకోవడం కోసం, ముఖ్యంగా యువతను ఆకర్షించేందుకు అమెజాన్ ఇండియా ఈ ఆఫర్ ప్రకటించింది. 18 నుంచి 24 ఏళ్ల లోపు ఉన్న యువతీ యువకులు ముందుగా రూ.999 చెల్లించి అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఏడాది సబ్స్క్రిప్షన్ వస్తుంది. వారికి రూ.500 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంటే ఒక ఏడాది అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ రూ.499 ధరకే లభిస్తుంది.
Smartphone Multitasking: స్మార్ట్‌ఫోన్‌తో మల్టీటాస్కింగ్ చాలా డేంజర్... ఎందుకో తెలుసుకోండి
Top 10 Smartphones: ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడుపోయిన 10 స్మార్ట్ఫోన్లు ఇవే...
అమెజాన్ ప్రైమ్ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మాత్రమే కాదు. మూడు నెలల మెంబర్షిప్ తీసుకున్నవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.164 ధరకే మూడు నెలల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. సాధారణంగా ఇతర యూజర్లు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌కి రూ.329, ఏడాది సబ్‌స్క్రిప్షన్‌కి రూ.999 చెల్లించాలి. కానీ 18 నుంచి 24 ఏళ్ల యువతీ యువకులకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇందుకోసం వయస్సు ధృవీకరణ తప్పనిసరి. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్‌తో పాటు ఒక సెల్ఫీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వయస్సు ధృవీకరణ పూర్తైన తర్వాతే క్యాష్‌బ్యాక్ అమెజాన్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఏడాది సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారికి రూ.500, మూడు నెలల మెంబర్షిప్ తీసుకున్నవారికి రూ.165 క్యాష్‌బ్యాక్ వస్తుంది.
Redmi Note 10 Pro 5G: రెడ్మి నోట్ 10 ప్రో 5జీ రిలీజ్... ఫీచర్స్ ఇవే
Realme X7 Max 5G: ఇండియాలో రిలీజ్ అయిన రియల్మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ... ధర ఎంతంటే
వాస్తవానికి ఈ ఆఫర్ గతంలో కూడా ఉండేది. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఆదేశాల మేరకు ఆఫర్లో కొన్ని మార్పులు చేసింది అమెజాన్ ఇండియా. ఆర్బీఐ ఆదేశాలతో అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ ఆథెంటికేషన్ కూడా చేర్చింది. ప్రస్తుతం ఈ ఆఫర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఉంది. అంటే డెస్క్‌టాప్‌లో అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఈ ఆఫర్ పొందడం సాధ్యం కాదు. ఐఓఎస్ యూజర్లకు కూడా ప్రస్తుతం ఈ ఆఫర్ లేదు. అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్ యాక్సెస్ లభిస్తుంది. అమెజాన్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే ఉచిత డెలివరీ పొందొచ్చు. అయితే ప్రైమ్ సబ్స్క్రిప్షన్ లేనివాళ్లు రూ.499 కన్నా ఎక్కువ ఆర్డర్ చేస్తేనే ఫ్రీ డెలివరీ వర్తిస్తుంది. అంతకన్నా తక్కువ ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జీలు చెల్లించాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA, Amazon prime