Amazon Pay Later: కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న అమెజాన్

Amazon Pay Later service | అమెజాన్ పే లేటర్ సేవలు ఇండియాలో ప్రారంభమయ్యాయి. కస్టమర్లు డబ్బులు లేకపోయినా వస్తువులు కొనొచ్చు. తర్వాత చెల్లించొచ్చు.

news18-telugu
Updated: April 29, 2020, 12:42 PM IST
Amazon Pay Later: కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న అమెజాన్
Amazon Pay Later: కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న అమెజాన్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా భారతదేశంలో 'అమెజాన్ పే లేటర్' క్రెడిట్ సర్వీస్‌ని ప్రారంభించింది. ఈ సర్వీస్ ద్వారా కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తోంది. అమెజాన్ ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్‌కి మాత్రమే ఇది వర్తిస్తుంది. డబ్బులు లేకపోయినా 'అమెజాన్ పే లేటర్' ద్వారా వస్తువులు కొని గడువు లోగా వడ్డీ లేకుండా చెల్లించొచ్చు. లేదా 12 నెలల వరకు ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే 1.5 నుంచి 2 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా డబ్బులు లేకపోయినా అమెజాన్ యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్, డీటీహెచ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ చెల్లించొచ్చు. నిత్యావసర వస్తువులు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ కూడా కొనొచ్చు. అమెజాన్ పే లేటర్ సర్వీస్ కోసం క్యాపిటల్ ఫ్లోట్, కరూర్ వైశ్య బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్.

మీరు కూడా అమెజాన్ పే లేటర్ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే అమెజాన్ ఇండియా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ పే లేటర్ సర్వీస్ కేవలం యాప్‌లోనే ఉంది. డెస్క్‌టాప్‌లో పనిచేయట్లేదు. మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ నెంబర్, ఇతర వివరాలతో కేవైసీ పూర్తి చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అమెజాన్ పే లేటర్ సర్వీస్ ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది కాబట్టి కొంతమంది కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. కస్టమర్ల క్రెడిట్ ఎలిజిబిలిటీని బట్టి రూ.60,000 వరకు అప్పు ఇవ్వాలని నిర్ణయించింది అమెజాన్. ఈ లిమిట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గైడ్‌లైన్స్ ప్రకారం ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Loans: లోన్లు తీసుకునేవారికి ఆర్‌బీఐ గుడ్ న్యూస్

WhatsApp: గుడ్ న్యూస్... యూజర్లకు లోన్స్ ఇవ్వనున్న వాట్సప్

మీ అకౌంట్‌లోకి రూ.1,500 వచ్చాయా? చెక్ చేయండి ఇలా
First published: April 29, 2020, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading