హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Pay for Business: వ్యాపారుల కోసం ప్రత్యేకంగా 'అమెజాన్ పే ఫర్ బిజినెస్' యాప్

Amazon Pay for Business: వ్యాపారుల కోసం ప్రత్యేకంగా 'అమెజాన్ పే ఫర్ బిజినెస్' యాప్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Amazon Pay for Business App | వ్యాపారుల కోసం అమెజాన్ పే ఫర్ బిజినెస్ పేరుతో ప్రత్యేకంగా ఓ యాప్ రూపొందించింది. ఈ యాప్‌తో ఉపయోగాలేంటో తెలుసుకోండి.

అమెజాన్ ఇండియాకు చెందిన డిజిటల్​ పేమెంట్​ ప్లాట్​ఫామ్​ అమెజాన్ పే సరికొత్త రికార్డును క్రియేట్​ చేసింది. అమెజాన్​ పేలో భాగస్వామ్యమైన వ్యాపారుల సంఖ్య 5 మిలియన్ల మార్కును చేరుకుంది. దీంతో, చిన్న, మధ్యతరహా వ్యాపారుల చెల్లింపు అవసరాలను మరింత సరళీకృతం చేయడానికి 'అమెజాన్ పే ఫర్ బిజినెస్' అనే కొత్త యాప్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త బిజినెస్​ యాప్​ను ఆండ్రాయిడ్‌ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్​ నుండి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు. కిరాణా షాపు వంటి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు ఎవరైనా సరే ఈ యాప్​లో యూనిక్​ క్విక్​ రెస్పాన్స్​ (క్యూఆర్)​ కోడ్​ను రూపొందించుకోవచ్చు. తద్వారా కస్టమర్లకు డిజిటల్ చెల్లింపు సేవలను అందించవచ్చు. దీంతో ఆయా వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవచ్చు. కస్టమర్లు అమెజాన్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆయా వ్యాపారాలకు చెల్లింపులు చేయవచ్చు. యూనిఫైడ్​ పేయిమెంట్​ ఇంటర్​ఫేస్​ (యుపిఐ) ఆధారిత ఏ యాప్​ నుంచైనా క్యూఆర్​ కోడ్​ను స్కాన్​ చేసి క్షణాల్లో పేమెంట్​ పూర్తి చేయవచ్చు.

EPF Withdrawal: ఈపీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేయాలా? ఎంత తీసుకోవచ్చో తెలుసుకోండి

Viral Video: రైలు పట్టాలపై చిన్నారి... ఎదురుగా రైలు... 20 సెకండ్లలో ఏం జరిగిందంటే

కాగా, ఈ కొత్త యాప్​పై అమెజాన్ పే ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహేంద్ర నెరుర్కర్ మాట్లాడుతూ “అమెజాన్ పే ఫర్ బిజినెస్ యాప్​ వ్యాపారులకు మరింత సులభతరమైన డిజిటల్ చెల్లింపులను అనుమతిస్తుంది. ఈ యాప్​ ద్వారా కస్టమర్లు నిమిషాల్లో పేమెంట్​ పూర్తి చేయవచ్చు. ఇది ముఖ్యంగా చిన్న, మధ్యతరహా వ్యాపారులకు మేలు చేస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల ప్లాట్​ఫామ్​గా రాణించాలన్నదే మా లక్ష్యం. రాబోయే కాలంలో డిజిటల్​ చెల్లింపు వ్యవస్థలో మరిన్ని ఉత్పత్తులను రూపొందించాలని యోచిస్తున్నాం." అని అన్నారు.

Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

EPF Account: జాబ్ మానేసిన తర్వాత మీ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేయలేదా? ఈ విషయం తెలుసా?

5 మిలియన్ల వ్యాపారులను చేరుకున్న అమెజాన్​


కాగా, ప్రస్తుతం అమెజాన్ పేలో భాగస్వామ్యమైన 5 మిలియన్ల మంది వ్యాపారుల్లో 2.5 మిలియన్ల మంది కిరాణా స్టోర్స్ వంటి చిన్న తరహా రిటైల్, షాపింగ్ అవుట్​లెట్లను నిర్వహిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అమెజాన్ పేలో మరో 1.9 మిలియన్ల మంది వ్యాపారులు రెస్టారెంట్లు, చిన్న తినుబండారాలు, సెలూన్లతో పాటు మెడికల్​ కేర్, ఆహార పానీయాల దుకాణాలను నిర్వహిస్తున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం, కిరాణా షాపుల్లో తన వాటాను పెంచుకోవటానికి అమెజాన్ మొత్తం 107.6 కోట్ల డాలర్లతో రిటైల్ టెక్ స్టార్టప్ పెర్పుల్‌ను కొనుగోలు చేసింది. చిన్న వ్యాపారాలకు డిజిటల్‌ సేవలు అందించడానికి, పంపిణీదారుల నుండి ఆర్డర్‌లను కొనుగోలు చేయడానికి, బిల్లింగ్స్‌లో సహాయం చేయడానికి ‘అల్ట్రాపోస్’ సొల్యూషన్​ ఉపయోగపడుతుంది. అమెజాన్ ఇండియా 2025 నాటికి 1 మిలియన్ ఆఫ్‌లైన్ రిటైల్​ స్టోర్లను తన ‘లోకల్ షాప్స్’ కార్యక్రమం ద్వారా సైన్ అప్ చేయనున్నట్లు తెలిపింది, స్థానిక దుకాణాలకు ఆన్‌లైన్ సేవలు అందించడంలో ఇది సహాయపడుతుంది. కాగా, అమెజాన్​ పే ప్రస్తుతం ఫోన్​పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్​ పేమెంట్​ సంస్థల నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ఈ–కామర్స్​ రంగంలో నెంబర్​1 గా కొనసాగుతున్న అమెజాన్​.. ఇప్పుడు, తన డిజిటల్​ పేమెంట్​ ప్లాట్​ఫామ్​ ‘అమెజాన్​ పే’ను మరింత బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.

First published:

Tags: Amazon, AMAZON INDIA, AMAZON PAY, Business, Business Ideas, BUSINESS NEWS, Online business, Small business

ఉత్తమ కథలు