Amazon: ఫుడ్ డెలివరీ బిజినెస్‌లోకి అమెజాన్... స్విగ్గీ, జొమాటోకు పోటీ

Food Delivery Business | ఫెస్టివల్ సీజన్ అయిన సెప్టెంబర్‌లో అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

news18-telugu
Updated: July 30, 2019, 3:32 PM IST
Amazon: ఫుడ్ డెలివరీ బిజినెస్‌లోకి అమెజాన్... స్విగ్గీ, జొమాటోకు పోటీ
Amazon: ఫుడ్ డెలివరీ బిజినెస్‌లోకి అమెజాన్... స్విగ్గీ, జొమాటోకు పోటీ
news18-telugu
Updated: July 30, 2019, 3:32 PM IST
మీకు కావాల్సిన వస్తువుల్ని అమెజాన్‌లో ఆర్డర్ చేస్తున్నారా? వస్తువులు మాత్రమే కాదు... త్వరలో అమెజాన్‌లో ఫుడ్ కూడా ఆర్డర్ చేయొచ్చు. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న ఫుడ్ డెలివరీ బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతోంది అమెజాన్. జొమాటో, స్విగ్గీ, ఊబెర్ ఈట్స్ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెజాన్ ఇండియా కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదిలోనే అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రారంభం కావచ్చు. ఇందుకోసం అమెజాన్ ఇండియా భారతదేశంలోని కాటమరన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోబోతోంది. కాటమరన్ కంపెనీని ఐటీ రంగ నిపుణులు నారాయణమూర్తి స్థాపించారు. ఉద్యోగుల నియామకం కూడా మొదలైంది. ఫెస్టివల్ సీజన్ అయిన సెప్టెంబర్‌లో అమెజాన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

భారతదేశంలో 2011 నుంచి ఫుడ్ డెలివరీ బిజినెస్ వేగంగా విస్తరిస్తోంది. స్విగ్గీ, జొమాటోలు భారతదేశానికి చెందిన స్టార్టప్స్. స్విగ్గీ వెనుక నాస్పర్స్, టెన్సెంట్, జొమాటో వెనుక సెఖోయా లాంటి ఇన్వెస్టర్లు ఉన్నారు. జొమాటో ఇటీవలే యూఏఈ, పోర్చుగల్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, లెబనాన్, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా లాంటి దేశాలకు విస్తరించింది. ఇండియాలో స్విగ్గీ, జొమాటో కంపెనీలు ప్రస్తుతం మార్కెట్ లీడర్స్‌గా ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో, ఊబెర్ ఈట్స్ లాంటి కంపెనీలు మార్కెట్‌లో పట్టు కోసం పోటీపడుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చాయి. ఇటీవల ఆఫర్లు తగ్గించి లాభాలవైపు పరుగులు తీద్దామని స్విగ్గీ, జొమాటో ప్రణాళికలు రూపొందించాయి. కానీ... ఇంతలో ఈ కంపెనీలకు అమెజాన్ రూపంలో మరో గట్టి పోటీ ఎదురుకాబోతోంది.

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Reliance Jio: వొడాఫోన్-ఐడియాపై రిలయెన్స్ జియో పైచేయి

IRCTC: ఐఆర్‌సీటీసీ ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్... టికెట్ ధర ఎలా పెరుగుతుందో తెలుసా?
Loading...
Credit Card: మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందా? ఈ తప్పులతో తిప్పలే
First published: July 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...