Amazon Sale: అమెజాన్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్... ఆఫర్లు ఇవే

Amazon India Fab Phones Fest | స్మార్ట్‌ఫోన్లతో పాటు పవర్ బ్యాంక్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్, బ్లూటూత్ హెడ్‌సెట్స్ ఇలా అనేక స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీస్ పైనా ఆఫర్లున్నాయి.

news18-telugu
Updated: June 8, 2019, 11:57 AM IST
Amazon Sale: అమెజాన్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్... ఆఫర్లు ఇవే
Amazon Sale: అమెజాన్‌లో మరోసారి స్మార్ట్‌ఫోన్ ఫెస్టివల్... ఆఫర్లు ఇవే (image: Amazon)
news18-telugu
Updated: June 8, 2019, 11:57 AM IST
స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో మరోసారి ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ ప్రకటించింది అమెజాన్ ఇండియా. ఈ సేల్ జూన్ 10న ప్రారంభం కానుంది. నాలుగు రోజుల సేల్ జూన్ 13న ముగుస్తుంది. ఇప్పటికే కొన్ని ఆఫర్స్‌ని రివీల్ చేసింది అమెజాన్. వన్‌ప్లస్, యాపిల్, సాంసంగ్, షావోమీ, వివో, హానర్ స్మార్ట్‌ఫోన్లపై ఎక్స్‌ఛేంజ్, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లున్నాయి. స్మార్ట్‌ఫోన్లతో పాటు పవర్ బ్యాంక్స్, స్క్రీన్ ప్రొటెక్టర్స్, బ్లూటూత్ హెడ్‌సెట్స్ ఇలా అనేక స్మార్ట్‌ఫోన్ యాక్సెసరీస్ పైనా ఆఫర్లున్నాయి. మరి స్మార్ట్‌ఫోన్లపై ఏఏ ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోండి.

Amazon India Fab Phones Fest: స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...


OnePlus 6T: వన్‌ప్లస్ 6టీ భారీ తగ్గింపుతో లభించనుంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.32,999 ఉండగా సేల్‌లో రూ.27,999 ధరకే లభిస్తుంది.

Apple iPhone X: యాపిల్ ఐఫోన్ ఎక్స్ భారీ డిస్కౌంట్‌తో లభించనుంది. అయితే డిస్కౌంట్ ఎంత అన్న విషయాన్ని అమెజాన్ బయటపెట్టలేదు. సేల్ రోజునే తెలుస్తుంది. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్ ఎక్స్ ధర రూ.69,999.

Honor 9N: హానర్ 9ఎన్ 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999 ఉండగా భారీ డిస్కౌంట్ ఉంటుందని ప్రకటించింది అమెజాన్.



Mi A2: ఎంఐ ఏ2 4జీబీ+64జీబీ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.11,999 ఉండగా భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది.

Samsung Galaxy M30: ఇటీవల రిలీజైన సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్‌ఫోన్ ఓపెన్ సేల్‌లో లభించనుంది. 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,990.
Loading...
Xiaomi Redmi Y3: షావోమీ రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్ కూడా ఓపెన్ సేల్‌లో లభిస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.9,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.11,999.

వీటితో పాటు రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ వై2, హానర్ 8ఎక్స్, ఒప్పో ఏ5, హానర్ 10 లైట్, సాంసంగ్ గెలాక్సీ నోట్ 9, హువావే పీ30 ప్రో, ఒప్పో ఆర్17, నోకియా 8.1, హానర్ వ్యూ 20 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఉంటాయి.

Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


ఇవి కూడా చదవండి:

Budget 2019 : కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.10,000 లోపు టాప్-10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

World Cup Offer: ఏడాదంతా ప్యారడైజ్ బిర్యానీ ఫ్రీ... కండీషన్స్ అప్లై

Jio Effect: 5 ఫోన్ నెంబర్లకు ఒకటే బిల్... వొడాఫోన్ ఆఫర్
First published: June 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...