Amazon Sale: భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్... ఆఫర్స్ ఇవే

Amazon Prime Day Sale 2020 | ప్రైమ్ డే సేల్ 2020 వచ్చే నెలలో నిర్వహించనుంది అమెజాన్ ఇండియా. ఈ సేల్ విశేషాలు ఏంటో తెలుసుకోండి.

news18-telugu
Updated: July 23, 2020, 12:42 PM IST
Amazon Sale: భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్... ఆఫర్స్ ఇవే
Amazon Sale: భారీ ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్... ఆఫర్స్ ఇవే
  • Share this:
అమెజాన్ ఇండియా ప్రైమ్ డే 2020 సేల్ ప్రకటించింది. ఆగస్ట్ 6, 7 తేదీల్లో ఈ సేల్ జరగనుంది. ఎప్పట్లాగే ఈ సేల్‌లో భారీ ఆఫర్స్ అందించనుంది అమెజాన్. ప్రతీ ఏటా జూలైలోనే ప్రైమ్ డే 2020 సేల్ ఉంటుంది. కానీ... ఈసారి ఆగస్ట్‌లో ఈ సేల్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఉండటం కారణం కావొచ్చు. సాధారణంగా అమెరికాలో, భారతదేశంలో ఒకేసారి ప్రైమ్ డే 2020 సేల్ ఉంటుంది. కానీ ఇంకా అమెరికాలో ప్రైమ్ డే 2020 సేల్ షెడ్యూల్ ప్రకటించలేదు అమెజాన్. ఇక భారతదేశంలో నాలుగో ప్రైమ్ డే సేల్ ఇది. ఈ సేల్‌ కేవలం అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు మాత్రమే. వారికి ప్రత్యేకంగా భారీ ఆఫర్స్ ఉంటాయి. ఈ సేల్‌లో ఎలాంటి ఆఫర్స్ ఉంటాయో ప్రతీ రోజూ డీల్స్ రివీల్ చేస్తుంది అమెజాన్.

Honda Activa: హోండా యాక్టీవా కొనండి... సగం ఈఎంఐ చెల్లించండి... అదిరిపోయిన ఆఫర్

Personal Loan: లోన్ ఈజీగా రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి

ఆగస్ట్ 6న ప్రారంభమయ్యే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్, ఇతర హోమ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్, గ్యాడ్జెట్స్‌పై డీల్స్ ఉంటాయి. ఇక అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఇకో, ఫైర్ టీవీ, కిండిల్ డివైజ్‌లపైనా ఆఫర్స్ ఉంటాయి. సాంసంగ్, టైటాన్, వన్‌ప్లస్, జేబీఎల్, షావోమీ లాంటి బ్రాండ్స్ 300 కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ చేయనున్నాయి. అమెజాన్ పే నుంచి షాపింగ్ చేసినా, పేమెంట్స్ చేసినా రూ.2,000 వరకు రివార్డ్స్ పొందొచ్చు.

అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ జూలై 23 అర్థరాత్రి నుంచి ఆగస్ట్ 5 మధ్య చిన్న, మధ్యతరహా వ్యాపారుల నుంచి ప్రొడక్ట్స్ కొంటే 20 శాతం రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అమెజాన్ యాప్‌లో ఉచితంగా ఇన్ గేమ్ కంటెంట్ కూడా ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు 10 శాతం ఇన్‍స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉంటాయి.

OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ ధర చూసి షాకయ్యారా? ఫోన్ ప్రత్యేకతలివే...

Savings Scheme: ఈ స్కీమ్‌లో పొదుపు చేస్తే రూ.66 లక్షలు రిటర్న్స్... వివరాలివే

ప్రైమ్ డే సేల్‌లో షాపింగ్ చేయాలంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తప్పనిసరి. ఏడాది మెంబర్‌షిప్ రూ.999 కాగా, నెలకు రూ.129 చొప్పున వసూలు చేస్తోంది అమెజాన్. ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటే అమెజాన్‌లో ప్రత్యేకమైన ఆఫర్స్‌తో పాటు ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ లాంటి సేవలు పొందొచ్చు.
Published by: Santhosh Kumar S
First published: July 23, 2020, 12:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading