హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Great Indian Festival: స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

Amazon Great Indian Festival: స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్

Amazon Great Indian Festival: స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్
(image: Amazon India)

Amazon Great Indian Festival: స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం తగ్గింపుతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (image: Amazon India)

Amazon Great Indian Festival | అమెజాన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను (Great Indian Festival Sale) ప్రకటించింది అమెజాన్. కొన్ని ఆఫర్స్ కూడా రివీల్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ (Big Billion Days Sale) ప్రకటించింది. ఇప్పుడు అమెజాన్ కూడా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Indian Festival Sale) ప్రకటించింది. దసరా, దీపావళి సందర్భంగా ప్రతీ ఏటా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇ-కామర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా షాపింగ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు ఇ-కామర్స్ సంస్థలు సేల్స్‌ని ప్రకటించాయి. ఇంకా తేదీలను ప్రకటించలేదు. సెప్టెంబర్ 25 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్ కూడా అదే సమయంలో ఉంటాయి. సేల్ జరిగే తేదీలను ప్రకటించకపోయినా ఆఫర్స్ మాత్రం ప్రకటించాయి ఈ రెండు సంస్థలు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. యాపిల్, షావోమీ, రియల్‌మీ, సాంసంగ్, రెడ్‌మీ, ఒప్పో, వివో, మోటోరోలా లాంటి బ్రాండ్లకు చెందిన మొబైల్స్‌పై 40 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఐఫోన్ కొనాలనుకునేవారికి ఐఫోన్ 12, ఐఫోన్ 13 సిరీస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్ లభించనుంది.

Google Pay UPI PIN: గూగుల్ పే యూపీఐ పిన్ మార్చి సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టండి ఇలా

అమెజాన్‌లో టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్స్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్స్ లభించబోతున్నాయి. ఫ్యాషన్ నుంచి ఫర్నీచర్ వరకు ఏ ప్రొడక్ట్ అయినా స్పెషల్ ప్రైస్‌కే కొనొచ్చు. కస్టమర్లకు అదనంగా డిస్కౌంట్స్ ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది అమెజాన్ . ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డుతో లావాదేవీలు జరిపితే 10 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు.

అమెజాన్‌లో 60 పైగా కొత్త ప్రొడక్ట్స్ లాంఛ్ కానున్నాయి. ఇందులో టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ప్రొడక్ట్స్ ఉంటాయి. కిక్‌స్టార్టర్ డీల్స్, ఒక్క రూపాయికే ప్రీబుకింగ్, బ్లాక్‌బస్టర్ డీల్స్, క్రేజీ ఆఫర్స్ పేరుతో మరిన్ని ఆఫర్స్ ఉంటాయి.

Mobile Offer: ఈ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అదిరిపోయే ఆఫర్... 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ, 8GB వరకు ర్యామ్

అమెజాన్ లాగానే ఫ్లిప్‌కార్ట్ కూడా భారీ ఆఫర్స్ ఇవ్వబోతోంది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే 10 శాతం తగ్గింపు లభిస్తుంది. ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్, టీవీలు, అప్లయెన్సెస్‌పై 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. ఫ్యాషన్ వేర్‌పై 60 శాతం నుంచి 90 శాతం వరకు, హోమ్ అండ్ కిచెన్ ప్రొడక్ట్స్‌పై 50 శాతం నుంచి 80 శాతం వరకు, ఫర్నీచర్, మ్యాట్రెసెస్‌పై 85 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇక ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే ఏడాదిలో ఎప్పుడూ లభించనంత డిస్కౌంట్ ఈ సేల్‌లో లభించడం ఖాయం. అందుకే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో దసరా, దీపావళి సేల్స్‌లోనే స్మార్ట్‌ఫోన్లు కొనేందుకు వెయిట్ చేస్తూ ఉంటారు.

First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, AMAZON INDIA, Flipkart, Flipkart Big Billion Days

ఉత్తమ కథలు