Amazon Freedom Sale | ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌వాచెస్, కెమెరాలు, యాక్సెసరీస్‌లపై 50 శాతం వరకు, హెడ్‌ఫోన్స్, స్పీకర్లపై 60 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.30,000 వరకు, రిఫ్రిజిరేటర్లపై రూ.35,000 వరకు, వాషింగ్ మెషీన్లపై రూ.11,000 వరకు, టీవీలు, ఏసీలపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 'ఫ్రీడమ్ సేల్' ప్రకటించింది అమెజాన్. ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 11 వరకు ఈ సేల్ జరగబోతోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు సేల్ ఆగస్ట్ 7 మధ్యాహ్నం 12 గంటలకే ప్రారంభం అవుతుంది. స్మార్ట్ఫోన్లు, టీవీలు, పవర్ బ్యాంకులతో పాటు అనేక ప్రొడక్ట్స్‌పై డిస్కౌంట్ ఆఫర్స్ అందించబోతోంది అమెజాన్. సాంసంగ్ గెలాక్సీ ఎం40, సాంసంగ్ గెలాక్సీ ఎస్10, సాంసంగ్ గెలాక్సీ ఎం30, సాంసంగ్ గెలాక్సీ ఎం20, రెడ్మీ వై3, ఒప్పో ఏ7, హానర్ వ్యూ 20, ఒప్పో కే3 లాంటి స్మార్ట్‌ఫోన్స్, యాక్సెసరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు ఇవ్వనుంది అమెజాన్. ఎక్స్ఛేంజ్లో వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ కొనేవారికి అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. వన్‌ప్లస్ 7, ఒప్పో రెనో, వివో వీ15, సాంసంగ్ గెలాక్సీ నోట్ 7, ఒప్పో ఎఫ్11 ప్రో ఫోన్లపైనా ఎక్స్ట్రా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. పవర్ బ్యంకులు, కేబుల్స్, ఛార్జర్స్, బ్లూటూత్ హెడ్సెట్, ఫోన్ కేస్, కవర్లపైనా డిస్కౌంట్స్, డీల్స్ ఉంటాయి.
ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌వాచెస్, కెమెరాలు, యాక్సెసరీస్‌లపై 50 శాతం వరకు, హెడ్‌ఫోన్స్, స్పీకర్లపై 60 శాతం వరకు, ల్యాప్‌టాప్‌లపై రూ.30,000 వరకు, రిఫ్రిజిరేటర్లపై రూ.35,000 వరకు, వాషింగ్ మెషీన్లపై రూ.11,000 వరకు, టీవీలు, ఏసీలపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఇక హోమ్ అండ్ కిచెన్, దుస్తులు, నిత్యావసర వస్తువులపై డీల్స్ ఉంటాయి. అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఇకో డివైజ్‌లు, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్‌పై రూ.5,000 వరకు తగ్గింపు పొందొచ్చు. ఆఫర్స్‌తో పాటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఉపయోగించినవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ, బజార్ ఫిన్సర్వ్ ఈఎంఐ లాంటి పేమెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి.
BMW X7: ఇండియాలోనే బీఎండ్ల్యూ ఎక్స్7 తయారీ... కారు ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.