హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Great Republic Day Sale: అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్.. ఈ Redmi స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6 వేలకే

Amazon Great Republic Day Sale: అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్.. ఈ Redmi స్మార్ట్ ఫోన్ కేవలం రూ.6 వేలకే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్ (Amazon Great Republic Day Sale) ఈ రోజు ప్రైమ్ సభ్యులకు ప్రారంభమైంది. ఈ సేల్ లో Redmi 9A Sport ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. వివరాలు ఇలా ఉన్నాయి.

Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Amazon Great Republic Day Sale) రేపు అంటే ఈ నెల 17న ప్రారంభమై జనవరి 20 వరకు కొనసాగనుంది. అయితే.. ప్రైమ్ మెంబర్‌ల కోసం సేల్ ఈరోజు (జనవరి 16, 2022) నుంచి ప్రారంభమైంది. సేల్‌లో స్మార్ట్ ఫోన్లతో పాటు, ఇతర అనేక స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కస్టమర్లు Redmi 9A Sport ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో సొంతం చేసుకోవచ్చు. Redmi 9A స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.8,499. అయితే ఈ ఫోన్ పై 18 శాతం డిస్కౌంట్ ప్రకటించింది అమెజాన్. అంటే ఈ సేల్ లో ఈ ఫోన్ ని రూ. 6,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎస్బీఐ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే ఈ ఫోన్ పై పది శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే రూ.700 డిస్కౌంట్ అందుకోవచ్చు. అంటే రూ. 6,299కే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్ లో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.

Amazon Great Republic Day Sale: అమెజాన్ లో Samsung, Redmi, Iphone, OnePlus స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు.. ప్రారంభమైన గ్రేట్ రిపబ్లిక్ డే సేల్.. వివరాలివే

Redmi 9A Sport ఫీచర్ల విషయానికి వస్తే.. ఇది 6.53 అంగుళాల HD + LCD డాట్ డ్రాప్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇంకా 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియో కలిగి ఉంటుంది. Redmi 9 Sport Android 10 ఆధారిత MIUI 12 పై రన్ అవుతుంది. Octa-core MediaTek Helio G25 ప్రాసెసర్‌ని ఫోన్‌లో ఉపయోగించారు. ఈ ఫోన్ ర్యామ్ 3 GB కాగా.. 32 జీబీ స్టోరేజ్.

Flipkart Big Saving Days Sale 2022: ఈ నెల 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ స్మార్ట్‌ఫోన్లపై 80 శాతం డిస్కౌంట్ లభ్యం

ఈ ఫోన్ వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. సెల్ఫీ కోసం 5 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్టోరేజ్ 32 GB వరకు ఉంటుంది. స్టేరేజ్ ను 512 GB వరకు విస్తరించుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే.. Redmi 9A ఫోన్ లో 5,000 mAh బ్యాటరీ అందించబడింది. ఇది 10 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం, ఇందులో 3.5mm ఆడియో జాక్, 4G LTE, Wi-Fi మరియు మైక్రో-USB పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో AI ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ అందించబడింది.

First published:

Tags: Amazon, Redmi

ఉత్తమ కథలు