AMAZON GREAT REPUBLIC DAY SALE 2022 IPHONE 12 AIRPODS PRO MACBOOK GET BIG DISCOUNT GH VB
Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో యాపిల్ ప్రొడక్ట్స్‌పై బంపరాఫర్లు.. ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్..
(Image: Apple India)
Amazon Offers: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 12 64GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ. 56,999 వద్ద లభిస్తుంది. 128GB వేరియంట్ రూ. 61,999, 256 జీబీ వేరియంట్ రూ. 75,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి.
గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ మరో రెండు రోజుల్లో (జనవరి 20 న) ముగియనుంది. ఈ సేల్ ఈవెంట్లో యాపిల్ ప్రొడక్ట్స్‌పై(Products) బంపరాఫర్లు ప్రకటించింది. యాపిల్ ఐఫోన్(Apple Iphone), ఐపాడ్ ఎయిర్ 2021, యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ 2020 వంటి వాటిపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. డిస్కౌంట్లకు అదనంగా నో-కాస్ట్ ఈఎంఐ(EMI), బ్యాంక్ ఆఫర్లను ఆస్వాదించవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు ఎంపిక చేసిన డివైజ్‌లపై అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. అమెజాన్ సేల్‌లో యాపిల్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లపై లభిస్తున్న బెస్ట్ డీల్స్‌ను పరిశీలిద్దాం.
ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఐఫోన్ 12 64GB స్టోరేజ్ వేరియంట్ కేవలం రూ. 56,999 వద్ద లభిస్తుంది. 128GB వేరియంట్ రూ. 61,999, 256 జీబీ వేరియంట్ రూ. 75,999 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ వేరియంట్లు వైట్, రెడ్, బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తాయి. ఐఫోన్ 12 A14 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. ఇది 6.1 -అంగుళాల OLED డిస్ప్లేతో వస్తుంది. దీనిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఐఫోన్ 12 5G మెగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
యాపిల్ ట్యాబ్లెట్, మ్యాక్‌బుక్‌లపై ఆఫర్లు..
మీరు కొత్త టాబ్లెట్ కోసం చూస్తున్నట్లయితే, యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2020 ఎడిషన్‌ను భారీ డిస్కౌంట్‌పై కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2020 బేస్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 47,900 వద్ద లభిస్తుంది. ఇక, 256 జీబీ వేరియంట్ రూ. 58,900 వద్ద లభిస్తుంది. ఇది గ్రే, గ్రీన్, పింక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఐప్యాడ్ ఎయిర్ 2020 A14 బయోనిక్ చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. 10.9-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
దీనిలో టచ్ ఐడీ, 12- మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వైఫై 6 వంటివి అందించింది. ఇక, ఎంఐ -ఆధారిత యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్, ఎయిర్‌పాడ్స్ ప్రో 2020 ఎడిషన్‌పై కూడా డిస్కౌంట్ లభిస్తుంది. యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (8GB + 256GB SSD) ల్యాప్‌టాప్‌ను రూ. 92,900 వద్ద, 512 SSD స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 1,04,990 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇది సిల్వర్, పింక్, గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మరోవైపు, ఎయిర్‌పాడ్స్ ప్రోను రూ. 18,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.