గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న తరుణంలో ఈ–కామర్స్(E Commerce) దిగ్గజం అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌ను(Amazon Republic Day Sale) ప్రకటించింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ ఈవెంట్ రేపటి (జనవరి 20)తో ముగియనుంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందజేస్తుంది. అంతేకాదు, ఎస్బీఎఐ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్‌పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో రూ. 15 వేలలోపు లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై ఓ లుక్కేయండి.
రెడ్మి 10 ప్రైమ్..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో రెడ్మి 10 ప్రైమ్ ఫోన్ రూ. 12,499 ధర వద్ద లభిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో కూడా అందుబాటులో ఉంటుంది. మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో 6,000mAh బ్యాటరీని అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రివర్స్ ఛార్జింగ్‌కు సైతం మద్దతిస్తుంది.
రియల్మీ నార్జో 50A..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో రియల్మీ నార్జో 50Aను కేవలం రూ. 12,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇది 6,000mAh బ్యాటరీ, HD+ డిస్ప్లేతో వస్తుంది. బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్ల మధ్య అందుబాటులో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ A03s..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈవెంట్లో శామ్సంగ్ గెలాక్సీ A03s స్మార్ట్‌ఫోన్‌ను రూ. 10,998 వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 3GB RAM, 32GB స్టోరేజ్, ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌తో వస్తుంది. గెలాక్సీ A03s 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.
టెక్నో స్పార్క్ 7..
టెక్నో కంపెనీ షియోమి, రియల్మీ వంటి టాప్ బ్రాండ్లతో పోటీపడుతూ బడ్జెట్ ధరలోనే స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తోంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో టెక్నో స్పార్క్ 7 కేవలం రూ. 7,699 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. అమెజాన్ కూపన్‌తో రూ. 200 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది 2GB RAM, 32GB స్టోరేజ్, డ్యూయల్-రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
IBPS Exam Calendar 2022: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఏడాది రాబోయే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవే
శామ్సంగ్ గెలాక్సీ M32..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో శామ్సంగ్ గెలాక్సీ M32 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 12,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజ్‌తో వస్తుంది. 6GB + 128GB వేరియంట్ రూ. 14,999 వద్ద అందుబాటులో ఉంటుంది. ఇక, ఫీచర్ల విషయానికొస్తే, ఇది 90Hz ఫుల్-HD+ డిస్ప్లే, క్వాడ్ రియర్ కెమెరా సెటప్, 6,000mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్‌తో వస్తుంది.
నోకియా G20..
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ సేల్‌లో నోకియా జీ20 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 12,490 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ కూపన్‌తో అదనంగా రూ. 500 డిస్కౌంట్ పొందవచ్చు. ఇది క్లీన్ ఆండ్రాయిడ్ యూఐపై పనిచేస్తుంది. దీనిలో 5050mAh బ్యాటరీని అమర్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone