Online Shopping: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్... ఆఫర్లు ఇవే

రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు ఇ-కామర్స్ కంపెనీలు సేల్ నిర్వహిస్తూ మంచిమంచి ఆఫర్లతో కస్టమర్లకు గాలం వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ పోటాపోటీగా నిర్వహించే సేల్‌‌తో కస్టమర్లకు ఆఫర్ల పండగే.

news18-telugu
Updated: January 20, 2019, 7:41 AM IST
Online Shopping: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో రిపబ్లిక్ డే సేల్... ఆఫర్లు ఇవే
Amazon vs Flipkart: పోటాపోటీగా సేల్స్... ఆఫర్లు ఇవే తెలుసుకోండి
news18-telugu
Updated: January 20, 2019, 7:41 AM IST
ఆన్‌లైన్‌లో మరోసారి ఆఫర్ల పండుగ వచ్చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోటాపోటీగా సేల్స్ ప్రకటించాయి. జనవరి 20 నుంచి 22 వరకు రిపబ్లిక్ డే సేల్ నిర్వహించబోతోంది ఫ్లిప్‌కార్ట్. మరోవైపు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ని జనవరి 20 నుంచి 23 వరకు నిర్వహిస్తోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు ఇ-కామర్స్ కంపెనీలు సేల్ నిర్వహిస్తూ మంచిమంచి ఆఫర్లతో కస్టమర్లకు గాలం వేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ పోటాపోటీగా నిర్వహించే సేల్‌‌తో కస్టమర్లకు ఆఫర్ల పండగే.

ఇది కూడా చదవండి:Flipkart Republic Day Sale: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్స్

Amazon Great Indian Sale, Amazon Great Indian Sale offers, Amazon Great Indian Sale deals Vs Flipkart Republic Day Sale, flipkart republic day deals, flipkart republic day Sale, flipkart republic day offers, flipkart republic day deals, flipkart smartphone offers, flipkart tv offers, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే డీల్స్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే ఆఫర్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్స్
జనవరి 20 నుంచి 23 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌


అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌




అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌ జనవరి 20 నుంచి 23 వరకు జరగనుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు మాత్రం జనవరి 19 రాత్రి 8 గంటల నుంచే సేల్ మొదలవుతుంది. అమెజాన్‌లో పలు క్యాటగిరీల్లో 17 కోట్ల ఉత్పత్తులపై ఆఫర్లున్నాయి. ప్రైమ్ మెంబర్లకు ప్రత్యేక డీల్స్ ఉన్నాయి. వన్‌ప్లస్ 6టీ, సాంసంగ్ గెలాక్సీ ఫోన్స్, ఐఫోన్స్, హానర్, రియల్‌మీ, షావోమీ లాంటి స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు లభిస్తాయి. హెచ్‌‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డులు ఉపయోగించినవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. బజాజ్ ఫిన్‌సర్వ్ ఈఎంఐ కార్డు హోల్డర్లకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ అండ్ కిచెన్, నిత్యావసర వస్తువులపై ఆఫర్లు ఉన్నాయి. ఇక అమెజాన్ ఇకో, ఫైర్ టీవీ స్టిక్, కిండిల్ ఇ-రీడర్స్‌పై రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి: Paytm Petrol Offer: పేటీఎంతో పెట్రోల్ కొంటే రూ.7,500 క్యాష్ బ్యాక్

Amazon Great Indian Sale, Amazon Great Indian Sale offers, Amazon Great Indian Sale deals Vs Flipkart Republic Day Sale, flipkart republic day deals, flipkart republic day Sale, flipkart republic day offers, flipkart republic day deals, flipkart smartphone offers, flipkart tv offers, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే డీల్స్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్, ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే ఆఫర్స్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ఆఫర్స్
జనవరి 20 నుంచి 22 వరకు ఫ్లిప్‌కార్ట్‌‌లో రిపబ్లిక్ డే సేల్
Loading...

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్


ఫ్లిప్‌కార్ట్‌‌లో జనవరి 20 నుంచి 22 వరకు రిపబ్లిక్ డే సేల్ జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లు జనవరి 19 రాత్రి 8 గంటల నుంచే ఆఫర్లు పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, హోమ్ అప్లయెన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ లాంటి కేటగిరీల్లో డీల్స్ కస్టమర్లను ఆకట్టుకోనున్నాయి. ఎప్పట్లాగే షావోమీ, హానర్, ఏసుస్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై మంచి ఆఫర్లు ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఎలక్ట్రానిక్స్‌, యాక్సెసరీస్‌పై 80శాతం వరకు, టీవీలు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు, ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్స్‌పై 70 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అంతే కాదు 3 వస్తువులు కలిపి కొంటే 10శాతం, 4 వస్తువులు కలిపి కొంటే 15 శాతం తగ్గింపు ఆఫర్లున్నాయి. ఎస్‌బీఐ కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10 శాతం అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది. నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ప్రతీ 8 గంటలకోసారి బ్లాక్ బస్టర్ డీల్స్ రీఫ్రెష్ అవుతాయి. జనవరి 20 అర్థరాత్రి రెండు గంటల నుంచి రష్ హవర్స్ ఎక్స్‌ట్రా డిస్కౌంట్స్, ప్రతీరోజు రూ.1,450 కొనుగోలుపై 10 శాతం, మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు 26 శాతం, రూ.1950 కొనుగోలుపై అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి:

WHATSAPP BUG: వాట్సప్‌లో మీ మెసేజెస్ మాయం... ఎందుకో తెలుసా?

WhatsApp Dictation: చెప్తే చాలు... వాట్సప్‌ మెసేజ్ టైప్ అయిపోతుంది
First published: January 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626