AMAZON GREAT INDIAN FESTIVAL SALE TOP DEALS ON 43 INCH SMART TVS RIGHT NOW MK GH
Amazon: అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో 43 అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్లు.. టాప్ డీల్స్‌పై ఓలుక్కేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
Amazon Great Indian Festival: బడ్జెట్ ధరలోనే హై క్వాలిటీ 43- అంగుళాల స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా?.. అయితే, ఇంకో ఐదు రోజుల ఆగండి. ఎందుకంటే, అక్టోబర్ 3న ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌లో 43 అంగుళాల 4K స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను కంపెనీలు ప్రకటించనున్నాయి.
Amazon Great Indian Festival: బడ్జెట్ ధరలోనే హై క్వాలిటీ 43- అంగుళాల స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా?.. అయితే, ఇంకో ఐదు రోజుల ఆగండి. ఎందుకంటే, అక్టోబర్ 3న ప్రారంభమయ్యే అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్‌లో 43 అంగుళాల 4K స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన డిస్కౌంట్లను కంపెనీలు ప్రకటించనున్నాయి. వీటిలోని హై డెఫినిషన్ పిక్చర్ క్వాలిటీ మీ హోమ్ థియేటర్.. యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను రెట్టింపు చేస్తాయి. సాధారణంగా హై క్వాలిటీ స్మార్ట్‌టీవీల ధర ఎక్కువగానే ఉంటుంది. అందుకే చాలా మంది ఇంత ధర పెట్టి కొనుగోలు చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. అటువంటి వారు రాబోయే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో తక్కువ ధరలోనే స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయవచ్చు. అయితే ఏ స్మార్ట్‌టీవీలపై ఎంత డిస్కౌంట్ ఉంటుందనే విషయాన్ని మాత్రం అమెజాన్ ఇంకా వెల్లడించలేదు.
శామ్సంగ్ 43 అంగుళాల క్రిస్టల్ 4K ప్రో సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 3840x2160p రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇది డైనమిక్ క్రిస్టల్ కలర్ ఆప్షన్లో వస్తుంది. ఈ హైరిజల్యూషన్ టీవీలో డార్క్ సన్నివేశాలను సైతం క్లారిటీతో చూడవచ్చు. ఈ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ రెండింటికీ మద్దతిస్తుంది. ఇది 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీనిలో 20W ఆడియో అవుట్‌పుట్‌ను ఇచ్చే పవర్ఫుల్ స్పీకర్లను అందించింది.
ఎల్జీ 43 అంగుళాల 4K అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
ఎల్జీ 43 అంగుళాలు 4K అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ఫుల్ హెచ్డీ స్మార్ట్‌టీవీల కంటే నాలుగు రెట్లు ఎక్కువ రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలోని క్వాడ్-కోర్ ప్రాసెసర్ అన్వాన్టెడ్ నాయిస్‌ను తొలగిస్తుంది. తక్కువ రిజల్యూషన్ ఉన్న ఫోటోలను మరింత స్పష్టమైన ఫోటోలుగా మారుస్తుంది. ఐపీఎస్ 4K ప్యానెల్ విస్తృతమైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. ఎల్జీ 43 అంగుళాల 4K అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి స్ట్రీమింగ్ యాప్స్‌కు యాక్సెస్ ఇస్తుంది.
ఎంఐ 43 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
ఎంఐ 43 ఇంచెస్ 4K అల్ట్రా హెచ్డీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ HDR 10 సపోర్ట్‌తో వస్తుంది. దీనిలోని 20W స్పీకర్లు అద్భుతమైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. ఈ స్మార్ట్ టీవీలో మీకు ఇష్టమైన యాప్స్‌ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. మెరుగైన కనెక్టివిటీ కోసం దీనిలో 3 HDMI, 2 USB పోర్ట్‌లను అందించింది. ఈ స్మార్ట్‌టీవీ 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.
శామ్సంగ్ 43 అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ
శామ్సంగ్ 43 అంగుళాల క్రిస్టల్ 4K సిరీస్ అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ 3840x2160p రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మీ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్‌ను దీనికి కనెక్ట్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. ఈ ఎల్ఈడీ స్మార్ట్‌టీవీ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ రెండింటికీ మద్దతిస్తుంది. ఇది 1.5 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో 20W ఆడియో అవుట్‌పుట్‌ను ఇచ్చే పవర్ ఫుల్ స్పీకర్లను చేర్చింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.