Amazon Offers On TVs: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో స్మార్ట్​టీవీలపై భారీ డిస్కౌంట్లు

Amazon Offers On TVs: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో స్మార్ట్​టీవీలపై భారీ డిస్కౌంట్లు (ప్రతీకాత్మక చిత్రం)

Amazon Offers On TVs | దసరా సేల్‌లో స్మార్ట్ టీవీ (Smart TV offers) కొనాలనుకునేవారికి శుభవార్త. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Amazon Great Indian Festival) స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి.

  • Share this:
పండుగ సీజన్​ సమీపిస్తుండటంతో ఇ-కామర్స్​ దిగ్గజాలు అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ పోటీపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. అమెజాన్​ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​ (Amazon Great Indian Festival), ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డేస్​ (Flipkart Big Billion Days) సేల్​ పేరుతో పండుగ సేల్స్​ను ప్రారంభించనున్నాయి. ఈ సేల్స్​ ద్వారా నువ్వా నేనా అన్నట్లుగా పోటాపోటీగా ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అమెజాన్​ ప్రకటించిన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్‌టాప్స్​, యాక్సెసరీలు, ఆడియో ఉత్పత్తులు, టీవీలు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. వీటికి అదనంగా హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​, డెబిట్​ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఇందు కోసం అమెజాన్​ సంస్థ హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో స్మార్ట్​టీవీలపై అందిస్తున్న టాప్​ డీల్స్​ను పరిశీలిద్దాం.

Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం52 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే

స్మార్ట్​టీవీలపై 65 శాతం వరకు డిస్కౌంట్​


గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ సేల్​లో షియోమి, సోనీ, ఎల్​జీ, టీసీఎల్​, శామ్సంగ్​ వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్​టీవీలపై అమెజాన్ 65 శాతం వరకు డిస్కౌంట్​ ప్రకటించింది. అమెజాన్ సేల్​ ప్రారంభమయ్యే వరకు ప్రతిరోజూ టీవీలపై డీల్స్​ షెడ్యూల్‌, ధరను వెల్లడిస్తామని తెలిపింది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 28న షియోమీ టీవీల షెడ్యూల్​, వాటి ధరలను వెల్లడిస్తుంది. సెప్టెంబర్ 29 న కంపెనీ షియోమి "బిగ్గెస్ట్ టీవీ ఆఫ్​ ది ఇయర్​" ఆఫర్​ను ప్రకటించనుంది. సెప్టెంబర్ 30న ఏసర్, iFFALCON, మరికొన్ని స్మార్ట్​టీవీలకు చెందిన అన్ని డీల్స్​ను వెల్లడిస్తుంది. తర్వాత అక్టోబర్ 1న ప్రీమియం టీవీలపై మరిన్ని డీల్స్ వెల్లడిస్తామని తెలిపింది.

Realme Offers: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ 10 రియల్‌మీ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 వరకు డిస్కౌంట్

అక్టోబర్ 2న అమెజాన్ స్పెషల్​ డివైజెస్​పై డీల్స్​ను ప్రకటించనుంది. ఈ మేరకు అమెజాన్​ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ల్యాండింగ్ పేజీలో పేర్కొంది. టీవీఎస్​ టీవీలపై కూడా బెస్ట్​ డీల్స్ ఉంటాయని తెలిపింది. ఒనిడా 32 అంగుళాలు, 42 అంగుళాల స్మార్ట్​టీవీ మోడల్స్​పై భారీ డిస్కౌంట్​ ఇస్తామని పేర్కొంది.
Published by:Santhosh Kumar S
First published: