Amazon Offers | మీరు ఐఫోన్ ప్రియులా? అయితే గుడ్ న్యూస్. కొత్తగా ఐఫోన్ (iPhone) కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఏంటి ఆ ఆఫర్ అని అనుకుంటున్నారా? యాపిల్ ఐఫోన్ 12పై (iPhone 12) కళ్లుచెదిరే డీల్ సొంతం చేసుకోవచ్చు. గతంలో లేని విధంగా ఈ ఐఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఐఫోన్ కొనాలని భావించే వారికి ఇది మంచి డీల్ అని చెప్పుకోవచ్చు.
దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ తీసుకువచ్చింది. ఈ సేల్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. ప్రైమ్ మెంబర్లకు సేల్ అందుబాటులోనే ఉంది. సాధారణ కస్టమర్లకు సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో భాగంగా ఐఫోన్ 12పై భారీ తగ్గింపు పొందొచ్చు. యాపిల్ ఐఫోన్ 12పై ఉన్న ఆఫర్ వివరాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
7 నెలల కనిష్టానికి కుప్పకూలిన బంగారం ధర.. కారణం ఇదే! నేటి రేట్లు ఇలా
అమెజాన్‌లో ఐపోన్ 12 64 జీబీ వేరియంట్ ధర రూ. 42,999గా ఉంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ధర వర్తిస్తుంది. అంతేకాకుండా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాడే వారికి అదనంగా రూ. 3 వేల వరకు తక్షణ తగ్గింపు వస్తుంది. అంటే ఐఫోన్ 12 ధర రూ. 39,999కు తగ్గుతుంది. ఐఫోన్ 12ను లాంచ్ చేసిన దగ్గరి నుంచి చూస్తే ఇదే అతి తక్కువ రేటు అని చెప్పుకోవచ్చు.
బంగారం ధర రూ.6,500 పతనం.. వెండి రూ.19 వేలు ఢమాల్! ఆల్‌టైమ్ గరిష్టం నుంచి..
అంతేకాకుండా ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ ఐఫోన్ 12పై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 14,350 వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ఆఫర్‌ను కూడా కలుపుకొని చూస్తే ఐఫోన్ 12 ఇంకా తక్కువ ధరకే లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ నెల చివరి వరకు ఉంటుంది. కేవలం ఫోన్లపై కాకుండా ఇతర ప్రొడక్టులపై కూడా అదిరే డీల్స్‌ను ఈ సేల్‌లో భాగంగా సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. పలు రకాల ప్రొడక్టులపై డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్లపై కూడా కళ్లుచెదిరే డీల్స్ లభిస్తున్నాయి. ఐఫోన్ ఎస్ఈ 2020 పైన భారీ తగ్గింపు ఉంది. ఈ ఫోన్‌ను రూ. 13,599కు కొనొచ్చు. దీని రేటు రూ. 30,499గా ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్, ఇతర ఆఫర్లను కలుపుకుంటే.. అప్పుడు రూ. 15 వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Iphone, Latest offers