ఆన్లైన్ షాపింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ డేట్స్ ఖరారు చేసింది అమెజాన్ ఇండియా. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు 6 రోజుల పాటు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరగనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు అక్టోబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకే ఈ సేల్ మొదలవుతుంది. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రకటించిన అమెజాన్... భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు అందించబోతోంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్స్, కెమెరాలు, లార్జ్ అప్లయెన్సెస్, టీవీలు, కిచెన్ ప్రొడక్ట్స్, ఫ్యాషన్, గ్రాసరీ, బ్యూటీ, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్‌పై డీల్స్, డిస్కౌంట్స్ లభించనున్నాయి. వన్‌ప్లస్ 7 ప్రో, షావోమీ ఎంఐ ఏ3, సాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండబోతున్నాయని పోస్టర్ చూస్తే తెలుస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్, డెబిట్ కార్డులతో కొన్నవారికి 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

షాపింగ్ సీజన్లో భారతదేశంలోని కస్టమర్లు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఇది. సరికొత్త డీల్స్, లాంఛెస్, ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్స్‌తో పాటు అమెజాన్ పే ఈఎంఐ, డెబిట్, క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్సర్వ్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ, ఫాస్ట్ డెలివరీ, హోమ్ అప్లయెన్సెస్ ఇన్స్టాలేషన్, మొబైల్ ఫోన్స్ ఎక్స్ఛేంజ్, ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్స్ ఇలా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
— మనీష్ తివారీ, వైస్ ప్రెసిడెంట్, కేటగిరీ మేనేజ్మెంట్, అమెజాన్ ఇండియా
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌తో పాటు అమెజాన్ ఫెస్టీవ్ యాత్రను కూడా ప్రారంభం కానుంది. 'భారతదేశం మొత్తాన్ని ఒకే చోటికి చేర్చే' హౌజ్ ఆన్ వీల్స్ కాన్సెప్ట్ ఇది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన కొన్ని ఉత్పత్తులతో పాటు, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలు, కళాకారులు, స్టార్టప్స్ రూపొందించిన వస్తువుల్నీ ఈ ఇంట్లో చూడొచ్చు. టాటా మోటార్స్‌తో కలిసి హౌజ్ ఆన్ వీల్స్ రూపొందించడం విశేషం. ఫెస్టీవ్ సీజన్లో భారతదేశంలోని 13 పట్టణాల్లో 6,000 కిలోమీటర్లు 'హౌజ్ ఆన్ వీల్స్' ప్రయాణించనుంది. న్యూ ఢిల్లీ నుంచి ప్రారంభమై బెంగళూరులో అమెజాన్ ఫెస్టీవ్ యాత్ర ముగుస్తుంది. దారిలో ఆగ్రా, లక్నో, అహ్మదాబాద్, ఇండోర్, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై, మథుర, కొచ్చి, ముంబై, విశాఖపట్నంలో హౌజ్ ఆన్ వీల్స్ ఆగుతుంది.
Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
e-PAN Card: పాన్ కార్డ్ మర్చిపోయారా? ఇ-పాన్ కార్డ్ డౌన్లోడ్ చేయండి ఇలా...
Samsung: సాంసంగ్ నుంచి రెండు కొత్త స్మార్ట్ఫోన్లు... ధర రూ.16,999 నుంచి
Flipkart Sale: భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్