హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Amazon Offers: అమెజాన్ బంపర్ డిస్కౌంట్లు.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు ఇవే!

Amazon Offers: అమెజాన్ బంపర్ డిస్కౌంట్లు.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు ఇవే!

బంపర్ డిస్కౌంట్లు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు ఇవే!

బంపర్ డిస్కౌంట్లు.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో టాప్ 5 స్మార్ట్‌ఫోన్ ఆఫర్లు ఇవే!

Amazon Sale | అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఈ సేల్‌లో భాగంగా చాలా ప్రొడక్టులపై ఆఫర్లు ఉన్నాయి. మనం ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్‌పై ఉన్న టాప్ 5 ఆఫర్లు ఏంటివో ఒకసారి తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Great Indian Festival Sale | దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో ఫెస్టివ్ సేల్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. వచ్చే వారం నుంచి కస్టమర్లకు స్మార్ట్‌ఫోన్లపై (Smartphones) గ్రేట్ డిస్కౌంట్లు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్ (Amazon) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో (Great Indian Festival Sale) భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. దాదాపు ప్రతి విభాగంలోనూ ఆఫర్లు ఉన్నాయి. ఇప్పుడు మనం టాప్ 5 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

    మీరు పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని భావిస్తే.. మీకోసం వన్ ప్లస్ 10టీ 5జీ ఫోన్‌పై ఆఫర్ అందుబాటులో ఉంది. దీని ధర సాధారణంగా రూ. 49,999గా ఉంటుంది. అయితే సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 44,999కే కొనుగోలు చేయొచ్చు.

    స్మార్ట్‌‌టీవీపై రూ.19 వేల డిస్కౌంట్.. రూ.28 వేల టీవీ రూ.8,500కే కొనేయండి

    అలాగే రియల్‌మి నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్‌పై కూడా ఆఫర్ ఉంది. దీని ప్రారంభ ధర రూ. 11,499. అయితే అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను కేవలం రూ. 8,499కే కొనుగోలు చేయొచ్చు.

    టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ స్మార్ట్‌పోన్‌పై ఆకర్షణీయ తగ్గింపు లభిస్తోంది. మీరు ఈ ఫోన్‌ను కేవలం రూ. 6,099కే కొనుగోలు చేయొచ్చు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకూడదని భావించే వారికి ఈ బడ్జెట్ ఫోన్ అనువుగా ఉంటుంది.

    వావ్.. ఈ ఫోన్‌పై రూ.43 వేల తగ్గింపు.. ఫ్లిప్‌కార్ట్ మెగా డిస్కౌంట్ ఆఫర్!

    ఇంకా ఒప్పొ ఏ54 ఫోన్‌పై అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. మీరు దీన్ని రూ.10 వేల కన్నా తక్కువ రేటుకే కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 9391కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ. 13,490.

    శాంసంగ్‌ గెలాక్సీ ఎం33 5జీ ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 15,499. అయితే దీన్ని అమెజాన్ సేల్‌లో భాగంగా రూ. 11,999కే కొనుగోలు చేయొచ్చు. బడ్జెట్ ధరలో ఆన్‌లైన్‌లో మంచి ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఈ డీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేవలం ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా ఇంకా అమెజాన్‌లో పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫ్లిప్‌కార్ట్‌లో కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాబోతోంది. ఇందులో కూడా స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అందుకే షాపింగ్ చేయడానికి ముందే డీల్స్ వివరాలు తెలుసుకోండి. ఎందులో అయితే మంచి ఆఫర్లు ఉన్నాయో అక్కడే కొనుగోలు చేయడం ఉత్తమం.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Amazon, Amazon Great Indian Festival Sale, Amazon sale, Flipkart, Flipkart Big Billion Days

    ఉత్తమ కథలు